హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Omicron : జనవరి 12 వరకు స్కూళ్లు మూసివేత.. సినిమా హాళ్లు బంద్.. సర్కారు ఉత్తర్వులు

Omicron : జనవరి 12 వరకు స్కూళ్లు మూసివేత.. సినిమా హాళ్లు బంద్.. సర్కారు ఉత్తర్వులు

ఒమిక్రాన్ దెబ్బ, ఇతర వేరియంట్ల విజృంభణతో దేశంలో రోజువారీ కొత్త కేసులు మళ్లీ పాతిక వేల మార్కుకు దగ్గరగా వచ్చాయి. రాబోయే నాలుగైదు వారాల్లో రోజువారీ కొత్త కేసుల సంఖ్య 2లక్షలు దాటొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలను ప్రకటిస్తున్నాయి..

ఇంకా చదవండి ...

  కరోనా వైరస్ మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్ లో విలయాన్ని సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. అమెరికా, యూరప్ దేశాల్లో ఇప్పటికే లక్షల కొద్దీ కేసులు, వేల కొద్దీ మరణాలు సంభవిస్తుండగా, ఇండియాలో కొత్త సంవత్సరం తొలి రోజు నుంచే కొవిడ్ మళ్లీ తిరగబెట్టింది. దేశంలో రోజువారీ కొత్త కేసులు మళ్లీ పాతిక వేల మార్కుకు దగ్గరగా వచ్చాయి. రాబోయే నాలుగైదు వారాల్లో రోజువారీ కొత్త కేసుల సంఖ్య 2లక్షలు దాటొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తద్వారా దేశంలో కొవిడ్ మూడో వేవ్ తప్పేలా లేదు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా కొవిడ్ తీవ్రత మహారాష్ట్ర, ఢిల్లీ, దాని చుట్టుపక్కల రాష్ట్రాల్లోనే అధికంగా ఉంది. ఢిల్లీని ఆనుకుని ఉండే హర్యానాలో పరిస్థితి రోజురోజుకూ జఠిలంగా మారుతోన్న క్రమంలో అక్కడి బీజేపీ సర్కారు పెద్ద ఎత్తున ఆంక్షలు విధించింది. జనవరి 12 వరకు అన్ని రకాల స్కూళ్లను సైతం మూసివేసింది. వివరాలివి..

  ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ఉత్తరాది రాష్ట్రం హర్యానా కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఐదు జిల్లాల్లో ఆల్మోస్ట్ లాక్ డౌన్ విధించింది. ఢిల్లీలో దాదాపు అతర్భాగమైపోయిన గురుగ్రామ్ సహా ఫరీదాబాద్, అంబాలా, పంచకుల, సోనిపట్ జిల్లాల్లో కొవిడ్ ఆంక్షలు విధించింది. ఈ ఐదు జిల్లాల్లో సినిమా హాళ్లను పూర్తిగా బంద్ చేశారు. స్పోర్ట్స్ కాంప్లెక్సులు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్ టైన్మెంట్ పార్కులను పూర్తిగా మూసేశారు. అదే సమయంలో..

  Sourav Ganguly : మళ్లీ Covid.. ఈసారి డెల్టా ప్లస్.. డిశ్చార్జ్ అయినా దాదాను వదలని మహమ్మారి  హర్యానాలోని ఐదు జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను పూర్తిగా మూసేశారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది. వ్యాపార, దుకాణ సముదాయాలు సాయంత్రం 5 గంటల వరకే అనుమతిస్తారు. ఈనెల 12 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని, రాబోయే 10 రోజుల్లో పరిస్థితులను బట్టి ఈనెల 10 తర్వాత సమీక్ష నిర్వహించి ఆంక్షల పొడగింపుపై నిర్ణయం తీసుకుంటామని హర్యానా ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు.

  Earthquake : పాకిస్తాన్‌ను వణికించిన భూకంపం.. మన జమ్మూకాశ్మీర్, LoC వెంబడీ ప్రకంపనలు  హర్యానాలో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి జోరు పెరిగిన నేపథ్యంలో ఖట్టర్ సర్కారు ఈ మేరకు కఠిన నిర్ణయాలు తీసుకుంది. పాక్షిక లాక్ డౌన్ అమలయ్యే ఐదు జిల్లాలతోపాటు మిగిలిన 17 జిల్లాల్లోనూ కొవిడ్ ఆంక్షలు అమలవుతాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. శుక్రవారం ఒక్కరోజే హర్యానాలో కొత్తగా 26 ఒమిక్రాన్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 63కు పెరిగింది. ఒమిక్రాన్ కాకుండా ఇతర వేరియంట్ల కేసులు సైతం భారీగా వస్తున్నాయి. అందుకే ఐదు జిల్లాల్లో బడులు సహా అన్నీ మూసేశారు. కొవిడ్ కేసులు అమాంతం 50 శాతం పెరిగిన నేపథ్యంలో ఢిల్లీలోనూ బడుల మూసివేత ఉండొచ్చు. దేశంలోని మిగతా రాష్ట్రాల్లోనూ కొవిడ్ ఆంక్షలు పెరుగుతున్నాయి.

  First published:

  Tags: Covid, Haryana, Lockdown, Omicron, Schools

  ఉత్తమ కథలు