Home /News /trending /

AMID COVID SPIKE 1500 ATTEND MONKEY LAST RITES IN RAJGARH MADHYA PRADESH SK

Monkey Funeral Feast: కోతి దశదినకర్మకు వేలాదిగా తరలివచ్చిన జనం.. కోవిడ్ ఆంక్షలు గోవిందా..!

కోతి అంత్యక్రియలకు భారీగా హాజరైన జనం

కోతి అంత్యక్రియలకు భారీగా హాజరైన జనం

Monkey Funeral Feast: కరోనా ఆంక్షలున్న సమయంలో కోతి దిశదినకర్మకు ఇంత మంది హాజరవడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు కేసు నమోదు చేశారు.

    ప్రస్తుతం మన దేశంలో కరోనా థర్డ్ వేవ్ (Corona Third Wave) విరుచుకుపడుతోంది. లక్షల్లో కొత్త కేసులు వస్తున్నాయి. కోవిడ్ వ్యాప్తి భీకరంగా పెరగడంతో ఇప్పటికే మహారాష్ట్ర (Maharashtra), ఢిల్లీ (Delhi) సహా పలు రాష్ట్రాలు ఆంక్షలను కఠినతరం చేస్తున్నాయి. నైట్ కర్ఫ్యూలు (Night Curfew), వీకెండ్ లాక్‌డౌన్‌ (Weekend Lockdown)లు విధిస్తున్నాయి. సినిమా థియేటర్లు, రెస్టారెండ్లు మూతపడుతున్నాయి. పెళ్లిళ్లు, అంత్యక్రియలకు సైతం ఆంక్షలున్నాయి. ప్రభుత్వాలు ఇన్ని ఆంక్షలు విధిస్తుంటే..కొందరు మాత్రం లైట్ తీసుకుంటున్నారు. నిబంధనలను ఉల్లంఘించి.. కోవిడ్‌ను బొట్టుపెట్టి మరీ ఆహ్వానిస్తున్నారు. ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో మనుషుల అంత్యక్రియలకే ఎన్నో ఆంక్షలున్నాయి. 50 మంది కంటే ఎక్కువ అనుమతించడం లేదు. కానీ ఓ కోతి అంత్యక్రియలకు వేలాదిగా జనం హాజరయ్యారు.. అది కూడా థర్డ్ వేవ్ సమయంలో అంటే నమ్ముతారా..! కానీ ఇది నిజం. మధ్యప్రదేశ్‌లో ఈ ఘటన జరిగింది.

    shocking video: విమానాన్ని ఢీకొట్టిన రైలు.. ఒక్క సెకన్‌లో జీవితం తారుమారు..

    మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh) లోని రాజ్‌గఢ్ జిల్లా దాలుపురా గ్రామంలో డిసెంబరు 28న ఓ కోతి మరణించింది. గ్రామస్తులతో ఆ కోతికి ఎంతో అనుబంధం ఉంది. అందరూ ఎంతో అల్లారుముద్దుగా చూసుకునేవారు. ఇంట్లో కుటుంబ సభ్యుడిలా చూసుకునేవారు. కానీ అనారోగ్యంతో అతి మరణించడంతో వారంతా ఎంతో బాధపడ్డారు. ఐతే ఆ కోతి మృతదేహాన్ని దూరంగా పడేయకుండా.. అచ్చం మనుషులకు చేసినట్లుగానే అంత్యక్రియలు (Monkey Last rites) నిర్వహించారు. తలా కొంత డబ్బులు వేసుకొని.. గ్రామ శివారులో హిందూ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. ఆ కార్యక్రమానికి వందలాదిగా స్థానికులు హాజరయ్యారు. ఐతే అంతటితో ఆగలేదు. దశదినకర్మ కూడా నిర్వహించారు. హరిసింగ్ అనే యువకుడు గుండు కొట్టించుకున్నాడు. అనంతరం దశదిన కర్మ (Monkey Funeral Feast) నిర్వహించి ఊరంతా భోజనాలు పెట్టారు. ఈ కార్యక్రమానికి ఏకంగా 1500 మందికి పైగా హాజరయ్యారు. కరోనా ఆంక్షలున్న సమయంలో కోతి దిశదినకర్మకు ఇంత మంది హాజరవడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు కేసు నమోదు చేశారు. అంత్యక్రియలు, దశదినకర్మ నిర్వహించడంలో ప్రధాన పాత్ర పోషించిన ఇద్దరిని అరెస్టు చేశారు.

    Shocking: ఈ పురుగును చూస్తే భయమేస్తోందా ? వీటి గురించి అసలు విషయం తెలిస్తే మరింత షాకవుతారు



    కాగా, మన దేశంలో హిందూ సమాజంలో గోవుకు ఎంత ప్రాధాన్యత ఉందో.. కోతికి కూడా అంతే ఉంది. కోతిని హనుమంతుడి ప్రతిరూపంగా భావిస్తారు. దేవుడిగా కొలుస్తారు. అందుకే ఎక్కడైనా వానరాలు మరణిస్తే.. వాటికి మనుషుల్లాగే ఘనంగా అంత్యక్రియలు నిర్వహిస్తారు.

    ఈ అమ్మాయిలు పిల్లలను కంటారు.. ఆ తరువాత ఏం జరుగుతుందంటే.. ఊహించని దారుణం

    కాగా, అన్ని రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్‌లోనూ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 2,317 కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్తగా 559 మంది మరణించారు. మరణాల సంఖ్య మాత్రం తక్కువగానే ఉంది. ఒకే ఒక్క మరణం నమోదయింది. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో 8,599 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్‌తో పోల్చితే ఇక్కడ తక్కువ కేసులే ఉన్నాయి. ఐనప్పటికీ ప్రభుత్వ మాత్రం ఆంక్షలను విధిస్తోంది. కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. కానీ కొందరు మాత్రం యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. మాస్క్‌లు ధరించకుండా.. భౌతిక దూరం పాటించకుండా.. కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Madhya pradesh, Monkeys, Viral Video

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు