డేంజర్ బెల్స్... ఏడాదికి 70 వేల ప్లాస్టిక్ కణాల్ని తినేస్తున్న అమెరికన్లు...

Plastic Danger : ప్లాస్టిక్ కణాలు జంతువులు, పక్షుల ఆహారంలో కలుస్తున్నాయి. అవే జంతువులు, పక్షుల్ని మనం తింటున్నాం.

Krishna Kumar N | news18-telugu
Updated: June 22, 2019, 2:51 PM IST
డేంజర్ బెల్స్... ఏడాదికి 70 వేల ప్లాస్టిక్ కణాల్ని తినేస్తున్న అమెరికన్లు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఈ రోజుల్లో మనం ఏం తిన్నా, ఏం తాగినా... అందుకు ప్లాస్టిక్ పదార్థాల్ని వాడుతున్నాం. ఆహార పదార్థాల ప్యాకేజింగ్‌లో కూడా ప్లాస్టిక్ ఉంటోంది. ఇలా ఏళ్లుగా జరుగుతుండటంతో... ఇప్పుడు మన వాతావరణంలో, పీల్చే గాలిలో అంతటా ప్లాస్టిక్ కణాలు చేరిపోయాయి. ఇక మనకంటే ఎక్కువగా ప్లాస్టిక్‌ని వాడుతున్నారు అమెరికన్లు. ఫలితంగా వాళ్లు ఏటా 74వేల నుంచీ లక్షా 21వేల మైక్రోప్లాస్టిక్ పార్టికిల్స్ (అతిసూక్ష్మ ప్లాస్టిక్ కణాలు) తింటున్నారు లేదా పీల్చుతున్నారని ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ జర్నల్ తెలిపింది. తాము చెప్పినది తక్కువేననీ, వాస్తవంలో ఇంకా ఎక్కువ కణాలే బాడీలోకి వెళ్లిపోతున్నాయని ఆ జర్నల్ వివరించింది.

మనం పర్యావరణంలో ప్లాస్టిక్ వ్యర్థాల్ని ఎంత ఎక్కువగా వేస్తే, అంతే స్థాయిలో వ్యర్థాలు... కణాలుగా విడిపోయి... గాల్లో కలుస్తున్నాయి. తినే ఆహారం, తాగే నీటిలో ఎన్నో రకాలుగా అవి చేరుతున్నాయి. నానాటికీ ప్లాస్టిక్ కణాలు అత్యంత చిన్నవిగా మారుతున్నాయి. ఒక్కో కణమూ నువ్వుల గింజ కంటే చిన్నగా మారుతోంది. ఈ రజను గాల్లో కలిసిపోతుంటే, ప్రజలు గుర్తించలేకపోతున్నారు. అవి జంతువులు, పక్షుల ఆహారంలో కలుస్తున్నాయి. అవే జంతువులు, పక్షుల్ని మనం తింటున్నాం. అలాగే గాల్లో తేలుతున్న కణాలను మనం పీల్చుతున్నాం.

26 రకాల అధ్యయనాల్లో ఈ విషయం బయటపడింది. సముద్ర ఆహారం, యాడెడ్ షుగర్స్, సాల్ట్స్, బీర్, వాటర్, గాలిలో ఈ ప్లాస్టిక్ కణాలు ఉంటున్నాయి. ఐతే... పప్పుధాన్యాలు, బీఫ్, కూరగాయలు, పౌల్ట్రీలో మాత్రం ప్లాస్టిక్ కణాలు కనిపించలేదు. గాలి, బాటిళ్ల వాటర్, సముద్ర ఆహారంలో ఎక్కువగా ప్లాస్టిక్ కణాలు ఉంటున్నాయి. సాల్ట్స్, కుళాయి వాటర్, బీర్‌లో తక్కువ స్థాయిలో ప్లాస్టిక్ కణాలు కనిపించాయి. ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు తాగేవారు... ఏడాదికి 90వేల ప్లాస్టిక్ కణాలు తాగేస్తున్నారు. ఇవి మన శరీరంలోకి వెళ్తే... వెంటనే సమస్య రాకపోయినా, కొన్ని ఏళ్ల తర్వాత అనారోగ్యాలు తప్పవంటున్నారు శాస్త్రవేత్తలు.

ఒకప్పటికీ ఇప్పటికీ ప్లాస్టిక్ వాడకం 22 రెట్లు పెరిగింది. అందుకు తగ్గట్లే విపరీత పరిణామాలు ఉంటాయంటున్నారు శాస్త్రవేత్తలు.

 

ఇవి కూడా చదవండి :

PICs : సింగపూర్... గ్రీన్ సిటీలా ఎలా అయ్యింది? ఆసక్తికర విశేషాలు ఇవీ

PICS : మార్స్‌ని ఈ విధంగా ఎప్పుడూ చూసివుండరు... నాసా ఫొటోస్...


PICS : ఇండియాలో అత్యంత ఆకర్షణీయమైన ఆఫీస్ బిల్డింగ్స్

First published: June 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading