Home /News /trending /

AMERICAN WOMAN MOTHER OF 12 CHILDREN PREGNANT FOR 16 CONSECUTIVE YEARS WANTS MORE BABIES PVN

American Woman Pregnant: ఈమె 16 ఏళ్లు వరుసగా గర్భవతి,12మంది పిల్లలకు తల్లి,అయినా ఇంకా

తన పిల్లలతో ఐరిస్ పర్నెల్

తన పిల్లలతో ఐరిస్ పర్నెల్

Woman pregnant for 16 consecutive years : తల్లి కావాలనే భావన ఏ స్త్రీకైనా ఉంటుంది, కానీ మాతృత్వం యొక్క ప్రయాణం చాలా కష్టం. పిల్లలు పుట్టడానికి ముందు, తర్వాత వారి జీవితం పూర్తిగా మారిపోతుంది. వారి శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి, బాధ్యతలు పెరుగుతాయి, నిద్ర, ఖాళీ సమయాన్ని పిల్లల కోసం త్యాగం చేయాల్సి వస్తుంది.

ఇంకా చదవండి ...
Woman pregnant for 16 consecutive years : తల్లి(Mother) కావాలనే భావన ఏ స్త్రీకైనా ఉంటుంది, కానీ మాతృత్వం యొక్క ప్రయాణం చాలా కష్టం. పిల్లలు పుట్టడానికి ముందు, తర్వాత వారి జీవితం పూర్తిగా మారిపోతుంది. వారి శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి, బాధ్యతలు పెరుగుతాయి, నిద్ర, ఖాళీ సమయాన్ని పిల్లల కోసం త్యాగం చేయాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితిలో, నేటి కాలంలో మహిళలు ఒకరు లేదా ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలను కోరుకోరు. కానీ అమెరికా(USA)కు చెందిన ఒక మహిళ అభిప్రాయాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఆమె 12 మంది పిల్లల తల్లి, కానీ ఆమె సంతృప్తి చెందలేదు,ఇంకా ఎక్కువ మంది పిల్లలు కావాలని కోరుకుంటోంది.

అమెరికాలోని కాలిఫోర్నియాలో నివసిస్తున్న 38 ఏళ్ల ఐరిస్ పర్నెల్ ఇటీవల న్యూయార్క్ పోస్ట్ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ తన గురించి చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఐరిస్ వృత్తిరీత్యా ఓ కొరియోగ్రాఫర్. వరుసగా 16 ఏళ్లు గర్భవతిగా ఉంటోంది. 2004 నుండి 2019 వరకు ప్రతి సంవత్సరం గర్భవతి అయింంది. ఆమె ప్రస్తుతం 12 మంది పిల్లలకు తల్లిగా ఉంది. ఐరిస్ పర్నెల్ తన భాగస్వామి కోర్డెల్‌తో కలిసి నివసిస్తుంది మరియు పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. ప్రెగ్నెన్సీ తనకు చాలా నేర్పిందని నమ్ముతున్నానని ఐరిస్ పర్నెల్ తెలిపింది. ఓపికగా ఉండటం నేర్చుకున్నట్లు తెలిపింది.



Eye with gold: ఈమె చూపే బంగారం

ఆమె 2005లో అంతర్జాతీయ నృత్యకారుడు అయిన కోర్డెల్‌ను కలుసుకుంది. ఆ సమయంలో వారిద్దరికీ మునుపటి సంబంధం వల్ల బిడ్డ పుట్టాడు. ఇప్పుడు ఈ జంట తమ 12 మంది పిల్లలతో నివసిస్తున్నారు. అమె యూట్యూబ్, టిక్‌టాక్‌లో వీడియోలను పోస్ట్ చేస్తూనే ఉంటారు, వీటిని ప్రజలు చాలా ఇష్టపడతున్నారు. ఇటీవల ఆమె ఒక వీడియో పోస్ట్ చేసింది. అందులో తాను వరుసగా 16 సంవత్సరాలు గర్భవతి అని చెప్పింది. దీనితో పాటు, తాను మళ్లీ గర్భవతి కావాలనుకుంటున్నానని, తన ప్రెగ్నెన్సీ పీరియడ్‌ను చాలా మిస్ అవుతున్నానని చెప్పింది. మళ్లీ గర్భం దాల్చకుండా ఉండేందుకు ట్యూబల్ లిగేషన్ సర్జరీ చేయించుకుంది ఐరిస్.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Pregnancy, Pregnant women, USA

తదుపరి వార్తలు