• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • AMERICAN RAPPER GETS RUPEES 175 CRORES WORTH OF DIAMOND IN FOREHEAD VIDEO GOES VIRAL MS GH

Diamond On Forehead: నుదుటిపై కోట్ల రూపాయల విలువైన వజ్రాన్ని ధరించిన ర్యాపర్.. వీడియో వైరల్

Diamond On Forehead: నుదుటిపై కోట్ల రూపాయల విలువైన వజ్రాన్ని ధరించిన ర్యాపర్.. వీడియో వైరల్

Image credits Instagram

Diamond On Forehead: ఈ ర్యాపర్ డైమండ్‌తో సందడి చేస్తున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రాం అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. దీనికి "బ్యూటీ ఈజ్ పెయిన్" అనే ట్యాగ్‌ పెట్టాడు. ఈ వీడియోకు ఒక్క రోజులోనే కోటికి పైగా వ్యూస్ వచ్చాయి.

  • News18
  • Last Updated:
  • Share this:
నుదుటిపై వంద కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన వజ్రాన్ని ధరించి హల్‌చల్ చేస్తున్నాడు ఒక అమెరికన్ ర్యాపర్. వజ్రాల్లో పింక్ డైమండ్స్‌ విలువ ఎక్కువగా ఉంటుంది. అలాంటి 10 క్యారెట్ల పింక్ డైమండ్‌ను లిల్ ఉజి వెర్ట్ అనే అమెరికన్ ర్యాపర్‌ నుదుటిపై కుట్టించుకున్నాడు. ఆ వజ్రం విలువ 24 మిలియన్ డాలర్లు. మన కరెన్సీలో సుమారు రూ.175 కోట్ల వరకు ఉంటుంది. వజ్రంతో అతడు మార్వెల్‌ సినిమాల్లో ఫిక్షనల్ ప్రాత్ర అయిన విజన్‌లాగా కనిపిస్తున్నాడు. అమెరికాలో లిల్‌కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అతడి అసలు పేరు సైమేర్ వుడ్స్. తాను నాలుగేళ్లుగా సంపాదించిన డబ్బుతో ఈ వజ్రాన్ని కొన్నానని లిల్ చెబుతున్నాడు. అతడి ముఖంపై పింక్ డైమండ్ ఉన్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

ఈ ర్యాపర్ డైమండ్‌తో సందడి చేస్తున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రాం అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. దీనికి "బ్యూటీ ఈజ్ పెయిన్" అనే ట్యాగ్‌ పెట్టాడు. ఈ వీడియోకు ఒక్క రోజులోనే కోటికి పైగా వ్యూస్ వచ్చాయి. లిల్ జ్యువెలర్ ఇలియట్ ఇలియంట్ కూడా అతడి వీడియోను షేర్ చేశాడు.

అంత విలువైన వజ్రంతో ఉంగరం ఎందుకు చేయించుకోలేదని కొంతమంది ఫ్యాన్స్ అడగ్గా.. ‘ఉంగరం పోతుందని’ అంటూ వ్యంగ్యంగా స్పందించాడు. నుదుటి మీద వజ్రం కనిపిస్తే మీరు ఇంకా ఎక్కువగా నన్ను ఆటపట్టించవచ్చని చెప్పాడు.















View this post on Instagram






A post shared by Elliot Eliantte (@eliantte)






వీడియోలో లిల్‌ను, అంత పెద్ద పింక్ డైమండ్‌ను చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. డైమండ్ అసలు విలువ తెలుసుకొని లిల్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. చూడటానికి ఆ వజ్రం అతడికి మూడో కన్నులా కనిపిస్తుందని ఒక వ్యక్తి కామెంట్ చేశాడు.





మరికొంతమంది అతడి ఫోటోలతో మీమ్స్ తయారు చేసి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. మార్వెల్ సిరీస్‌లో విజన్ ఫోటోలను, లిల్ ఫోటోలను పోల్చుతూ అతడి ఫ్యాన్స్ హడావిడి చేస్తున్నారు.
Published by:Srinivas Munigala
First published:

అగ్ర కథనాలు