Home /News /trending /

AMERICAN PRESIDENT JOE BIDEN FALLS OFF BIKE PVN

Video : సైకిల్ తొక్కుతూ కిందపడిపోయిన అమెరికా అధ్యక్షుడు

సైకిల్ తొక్కుతున్న జో బైడెన్

సైకిల్ తొక్కుతున్న జో బైడెన్

అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్‌(79) సైకిల్‌ పై నుంచి కింద పడ్డారు.సైకిల్‌ తొక్కుతూ కిందపడిపోయిన అమెరికా అధ్యక్షుడిని అక్కడే ఉన్న కొందరు వెంటనే పైకిలేపారు.

అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్‌(79) సైకిల్‌ పై నుంచి కింద పడ్డారు.సైకిల్‌ తొక్కుతూ కిందపడిపోయిన అమెరికా అధ్యక్షుడిని అక్కడే ఉన్న కొందరు వెంటనే పైకిలేపారు. వెంటనే పైకి లేచిన జో బైడెన్(Joe Biden) "ఐయామ్‌ గుడ్‌(బాగానే ఉన్నా)" అని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్​(Viral)గా మారాయి. ఈ ఘటనను వైట్‌హౌస్‌ ధ్రువీకరించింది. అధ్యక్షుడు బైడెన్‌కు ఎలాంటి దెబ్బలు తగలలేదని వైట్‌హౌస్‌ తెలిపింది.

జో బైడెన్ దంపతులు శుక్రవారం తమ వివాహ 45వ వార్షికోత్సవాన్ని నిర్వహించుకున్నారు. ఈ నేపథ్యంలో భార్య, ఆ దేశ ప్రథమ మహిళ జిల్ బైడెన్‌(Jil Biden)తో కలిసి డెలావేర్ రాష్ట్రంలోని బీచ్ హోమ్ వద్ద గడుపుతున్నారు. శనివారం ఉదయం భార్య జిల్ బైడెన్‌,మరికొందరితో కలిసి రెహోబోత్ బీచ్‌లోని వారి బీచ్ ఇంటికి సమీపంలో ఉన్న కేప్‌ హెన్లోపెన్‌ పార్కులో జో బైడెన్ సైకిల్‌ తొక్కారు. అనంతరం అక్కడ గుమిగూడిన స్థానికులు, మీడియాతో మాట్లాడేందుకు బైడెన్‌ ప్రయత్నించారు. తనను చూడడానికి వచ్చినవారి వద్దకు వెళ్లడానికి ఆయన సిద్ధమవుతున్నప్పుడు పెడల్‌లో పాదం ఇరుక్కుపోయింది. కిందికి దిగబోతున్న ఆయన తూలి, కుడివైపు పడిపోయారు. బైడెన్ కిందపడిపోవడంతో అక్కడున్నవారు ఆందోళన చెందారు. వెంటనే అక్కడే ఉన్న సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు ఆయనకు చేయి అందించి పైకిలేపారు. పైకి లేచిన బైడెన్‌ తాను బాగానే ఉన్నానని తెలిపారు. సైకిల్‌ పెడల్‌ పై నుంచి కాలును ఒక్కసారిగా తీయడంతో బ్యాలెన్స్‌ కోల్పోయినట్లు చెప్పారు. అయితే ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని, వైద్యం అవసరం లేదని వైట్‌హౌస్‌ కార్యాలయం పేర్కొంది. జో బైడెన్‌ సైకిల్‌ పై నుంచి కింద పడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.





See Pics : కూతురు పెళ్లికి చనిపోయిన తండ్రి..కన్నీళ్లు పెట్టించే సంఘటన

కాగా,2020 అమెరికా అధ్యక్ష ఎన్నికలు పూర్తయిన తర్వాత అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయకముందు తనకు ఇష్టమైన కుక్కపిల్లతో ఆడుతున్న సమయంలోనూ బైడెన్ కాలికి గాయమైంది. అమెరికా చరిత్రలోనే అత్యంత వృద్ద అధ్యక్షుడు జో బైడెనే. అయితే 2024లోనూ మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని బైడెన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బైడెన్‌ ఆరోగ్యంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Joe Biden, Viral Video

తదుపరి వార్తలు