ఉడుతకు స్పెషల్ ట్రీట్... నాసా మాజీ ఇంజినీర్ ట్రిక్... వైరల్ వీడియో...

పక్షులకు పెట్టే ఆహారం ఉడుతలు తినకుండా చెయ్యాలనుకున్న ఆయన... ఉడుతకు కొన్ని సాహసాలు చేసేలా ఏర్పాటు చేయడం అందర్నీ ఆకట్టుకుంటోంది.

news18-telugu
Updated: May 31, 2020, 2:43 PM IST
ఉడుతకు స్పెషల్ ట్రీట్... నాసా మాజీ ఇంజినీర్ ట్రిక్... వైరల్ వీడియో...
ఉడుతకు స్పెషల్ ట్రీట్... నాసా మాజీ ఇంజినీర్ ట్రిక్... వైరల్ వీడియో... (credit - Youtube)
  • Share this:
ప్రపంచంలో పక్షులు, ఉడుతల ప్రేమికులు చాలా మంది ఉన్నారు. ఎప్పుడూ చెలాకీగా తిరిగే పక్షులు, ఉడుతలంటే అందరికీ ఇష్టమే. పక్షులకు ప్రత్యేకంగా ఆహారం పెట్టేవారూ ఉన్నారు. అలాంటి వారిలో నాసా మాజీ ఇంజినీర్... మార్క్ రోబెర్... తనదైన మార్క్ చూపించారు. ఎంతైనా ఇంజినీర్ కదా... తాను పక్షులకు పెట్టే ఆహారాన్ని ఉడుతలు ఎట్టి పరిస్థితుల్లో తినకుండా ఉండాలని అనుకున్నారు. అందుకు ఎలాంటి ఏర్పాటు ఉండాలనే అంశంపై రకరకాల ప్రయోగాలు చేశారు. ఐతే... ఆయన ఎలాంటి అడ్డంకులు పెట్టినా... ఉడుతలు మాత్రం ఆహారాన్ని అందుకోగలుగుతున్నాయి. రకరకాల సాహసాలు చేసి మరీ పక్షుల ఆహారాన్ని ఆరగించేస్తున్నాయి. ఇదంతా వీడియో తీసి... యూట్యూబ్‌లో పెట్టడంతో... అది వైరల్ అయ్యింది. మే 24న అప్‌లోడ్ చేసిన ఈ వీడియోని ఇప్పటికే 2 కోట్ల మందికిపైగా చూశారు.

మార్క్... ఉడుతల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో ఇలా చెయ్యట్లేదు... అసలు ఉడుతలకు తెలివితేటలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవడానికి ఇలా చేశారు. ఆయన పెట్టిన పరీక్షల్లో ఉడుతలు చాలా తెలివైనవని నిరూపించుకున్నాయి. ఈ వీడియో చూసి నెటిజన్లు తెగ నవ్వుతున్నారు. ఐస్ ఏజ్ సినిమాల సిరీస్ గుర్తొస్తోందని చెబుతున్నారు. ఆ ఉడుతల్ని ఒలింపిక్స్‌కి పంపాలని మరికొందరు సలహా ఇస్తున్నారు.
Published by: Krishna Kumar N
First published: May 31, 2020, 2:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading