హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

మృతదేహాలకు ప్రాణం పోసే టెక్నాలజీ.. ఆ ల్యాబ్‌లో ప్రయోగాలు.. ఫుల్ డిమాండ్

మృతదేహాలకు ప్రాణం పోసే టెక్నాలజీ.. ఆ ల్యాబ్‌లో ప్రయోగాలు.. ఫుల్ డిమాండ్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

క్రయోనిక్స్ టెక్నాలజీని ఉపయోగించి ల్యాబ్‌లో మృతదేహాన్ని పెద్ద పెద్ద ఫ్రీజర్లలో అతి శీతల ఉష్ణోగ్రతలో ఉంచారు. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద గడ్డకటిస్తారు. ఆ వాతావరణంలో మృతదేహాలు పాడవవు. కొన్ని సంవత్సరాల పాటు అలానే ఉంటాయి.

పుట్టిన వాడు గిట్టక తప్పదు. జీవిత సత్యం ఇది. కోట్ల డబ్బు .. ఖరీదైన ఇల్లున్న ధనవంతుడైనా... కూడూ గూడూ లేని పేదోడైనా.. ఏదో ఒక రోజు మరణించక తప్పదు. ఈ జీవితం శాశ్వతం కాదు. కొన్నాళ్ల పాటు భూమిపై జీవించి.. ఆ తర్వాత ఎవరైనా వెళ్లిపోవాల్సిందే. అదృష్టం ఉంటే.. చావును నుంచి తప్పించుకోవచ్చేమో గానీ.. చనిపోయిన తర్వాత బతకడం మాత్రం అసాధ్యం. ఇది అందరికీ తెలుసు. ఐతే ఈ అసాధ్యాన్ని సాధ్యం చేయాలని ఓ కంపెనీ కంకణం కట్టుకుంది. మరణించిన వారిని మళ్లీ బతికించేందుకు ప్రయోగాలు చేస్తోంది. అక్కడ మృతదేహాలను సజీవంగా మార్చే పని జరుగుతోందట. ప్రస్తుతం ఆ ల్యాబ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలా కంపెనీ ఏది? ఎక్కడ ఈ ప్రయోగాలు చేస్తున్నారు.

ప్రాచీన కాలంలో వైద్యంలో నాటు మందులే వాడారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. వైద్య రంగంలో ఎన్నో సంచలనాలను చూస్తున్నాం. వైద్య విధానం కాలక్రమేణా చాలా పురోగతి సాధించింది. ఇందులో చాలా టెక్నిక్స్ వచ్చాయి. మనిషి గుండె తీసి గుండె పెడుతున్నారు. జంతువు అవయాలను అమర్చి మనుషులను బతికిస్తున్నారు. ఇలాంటి టెక్నాలజీ వస్తుందని.. కొంతకాలం క్రితం వరకు ఎవరూ ఊహించలేరు. అంతా మార్పులు చోటుచేసుకున్నాయి. రోజు రోజుకూ మరింత అభివృద్ధి చెందేందుకు శాస్త్రవేత్తల ప్రయోగాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ ప్రయోగం ప్రపంచమంతా చర్చనీయాంశంగా మారింది. చనిపోయిన వారిని తిరిగి బ్రతికించే ప్రయోగాలు చేస్తున్నారు. ఇది జోక్ కాదు. నిజంగా నిజం. చనిపోయిన వ్యక్తులను తిరిగి బ్రతికించే టెక్నాలజీ అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు.

తుఫాన్ ఎంత పనిచేసింది.. బట్టతల బండారాన్ని బయటపెట్టిందిగా.. చూస్తే నవ్వాపుకోలేరు

అమెరికాలో ఈ టెక్నాలజీని క్రయోనిక్స్ అంటారు. అరిజోనాలో నిర్మించిన ఓ ల్యాబ్‌లో ప్రయోగాలు జరుగుతున్నాయి. క్రయోనిక్స్ టెక్నాలజీ ద్వారా సజీవంగా ఉండాలనే ఆశతో చాలా మంది ఇప్పటికే మృతదేహాలను భద్రపరిచారు. వీరిలో ఎంతో మంది ధనవంతులు ఉన్నారు. వీరు చనిపోయిన తమ వారిని మళ్లీ బతికించుకోవాలన్న ఆశతో.. మృతదేహాలను ప్రయోగశాలకు అప్పగించారు. ఇప్పటికే చాలా మృతదేహాలు ల్యాబ్‌కు వచ్చాయి. ల్యాబ్‌లో మృతదేహాలను భద్రపరచాలంటే భారీగా ఖర్చవుతుంది. ఆ డబ్బును చెల్లిస్తేనే కంపెనీ వాళ్లు మృతదేహాలను ల్యాబ్‌లో చేర్చుకుంటారు.

Nano Turns Helicopter : వాటే ఐడియా బాసూ..టాటా నానో కారుని హెలికాఫ్టర్ గా మార్చి అద్దెకు

క్రయోనిక్స్ టెక్నాలజీని ఉపయోగించి ల్యాబ్‌లో మృతదేహాన్ని పెద్ద పెద్ద ఫ్రీజర్లలో అతి శీతల ఉష్ణోగ్రతలో ఉంచారు. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద గడ్డకటిస్తారు. ఆ వాతావరణంలో మృతదేహాలు పాడవవు. కొన్ని సంవత్సరాల పాటు అలానే ఉంటాయి. శరీరానికి ఎలాంటి హాని జరగదు. ప్రస్తుతానికైతే మృదేహాలకు జీవం పోసే టెక్నాలజీ రాలేదు. భవిష్యత్‌లో తప్పకుండా వస్తుందన్న ఆశతో చాలా మంది తమ వారి మృతదేహాలను ల్యాబ్‌లో భద్రపరుస్తున్నారు. ఆ టెక్నాలజీ వచ్చినప్పుడు మృతదేహాలను ప్రాణం పోయవచ్చని నమ్మకంతో ఉన్నారు.

బెంగాల్ టీచర్ కి అరుదైన వీడ్కోలు .. వీడియో చూస్తుంటే కంట కన్నీళ్లు ఆగవు..

వందేళ్ల క్రితం చంద్రుడిపైకి వెళ్లడం అసాధ్యమని చాలా మంది భావించారు. కానీ నేడు అది సాధ్యమైంది. ఇప్పడు చాలా ఈజీగా అంతరిక్షంలోకి వెళ్తున్నాం. వేరే గ్రహం మీద నివాసాలు ఏర్పాటు చేసేకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతలా టెక్నాలజీ పెరిగింది. రానున్న రోజుల్లో మనషులను బతికించే టెక్నాలజీ కూడా వస్తుందని చాలా మంది విశ్వసిస్తున్నారు. అందుకోసమే ఇప్పటి నుంచి తమ వారి శవాలను దాచి పెట్టుకుంటున్నారు. ఐతే ఈ ప్రయోగాలపై సోషల్ మీడియాలో ఎవరి వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఆశకైనా హద్దుండాలి.. చనిపోయిన వారిని ఎలా బతికిస్తారంటూ సెటైర్లు వేస్తున్నారు. ఏదో ఒక రోజు ఆ టెక్నాలజీ వస్తుందన్న ఆశతో.. ఇప్పుటి నుంచే మృతదేహాలను దాస్తున్న మీలాంటి వారి ముందుచూపునకు సలాం అంటూ.. సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

First published:

Tags: America, Technology, Trending, Us news