Home /News /trending /

AMERICAN BECAME THE FATHER OF 150 PEOPLE THROUGH SPERM DONATION NS GH

ఇతను మామూలోడు కాదు.. ఇప్పటికే 150 మందికి తండ్రయ్యాడు.. ఎలా సాధ్యమైందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Sperm Donor: దానాల్లో అత్యుత్తమ దానం వీర్యదానం.. అని ఓ సినిమాలో చెప్పిన మాటను బాగ వంటపట్టించుకున్నాడు అమెరికాకు చెందిన ఓ వ్యక్తి. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 150 మంది పుట్టుకకు కారణమయ్యాడు అమెరికా వెర్మాంట్ రాష్ట్రానికి చెందిన జోయ్ డోనార్.

ఇంకా చదవండి ...
దానాల్లో అత్యుత్తమ దానం వీర్యదానం.. అని ఓ సినిమాలో చెప్పిన మాటను బాగ వంటపట్టించుకున్నాడు అమెరికాకు చెందిన ఓ వ్యక్తి. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 150 మంది పుట్టుకకు కారణమయ్యాడు అమెరికా వెర్మాంట్ రాష్ట్రానికి చెందిన జోయ్ డోనార్. అంటే వీర్యాన్ని దానం చేసిం 150 మందికి పిల్లలు తండ్రయ్యాడు. అంతే కాకుండా యూకే వ్యాప్తంగా ఏడాదికి 10 మంది మహిళల గర్భానికి కారణమయ్యాడు. 2021 నూతన సంవత్సరం లోపు బ్రిటీష్ మహిళలకు క్రిస్మస్(Christmas) కానుకను అందజేయనున్నాడు. కోవిడ్-19(Covid-19) తీవ్రంగా ఉన్నప్పటి అది తనకు అడ్డం కాదంటున్నాడు. 50 ఏళ్ల జోయ్ తన అసలు పేరును బయటకు వ్యక్త పరచలేదు. జోయ్ డోనార్(Donor) గానే అందరికి సూపరిచితులయ్యాడు. గత మూడు నెలలుగా లండన్ లోనే నివాసముంటున్న జోయ్ అనేక ఇంటర్వ్యుల్లో పాల్గొన్నాడు. ఎందులోనూ తన పేరును బహిరంగ పరచలేదు. ఒకరికి జీవితమిచ్చేందుకు మహిళలకు సహాయం చేయడం అన్నింటికంటే ఉత్తమమైందిగా భావిస్తున్నానని అంటున్నాడు జోయ్. తాను ఎల్లప్పుడూ మహిళలు కోరికను నెరవేర్చేందుకు, బిడ్డను కనాలనే వారి కలను తీర్చేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశాడు.

ఎక్కువ మందితో సెక్స్ లో పాల్గొనడానికి ఇష్టపడలేదు..
సెప్టెంబరులో యూకే వచ్చినప్పటి నుంచి జోయ్ దాదాపు 15 మంది మహిళలను కలిశాడు. వారిలో చాలా మందితో శృంగారం చేయడానికి ఇష్టపడలేదని, అది వారి సంబంధంలో చాలా సమస్యలను కలిగిస్తుందని తెలిపాడు. అంతేకాకుండా ఎక్కువమంది లెస్బియన్లని, సహజంగా ఉంటేనే ప్రభావవంతంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇప్పటివరకు మూగ్గురితోనే లైంగికంగా కలిశానని, వారిలో ఇద్దరు గర్భవతులు అని తెలిపాడు. అయితే చాలా మంది వారికి తన నుంచి ఏం ఆశిస్తున్నారో చెప్పరని అన్నాడు. తాను యూకేలో వేల్స్, హల్, బర్మింగ్హామ్, కెంట్ లకు వెళ్లానని, అవసరమైన మహిళలకు తనవంతు సహాయం చేయగలిగానని చెప్పాడు. ఇందుకు తానేంతో అదృష్టవంతుడిగా భావిస్తున్నానని ఆనందపడ్డాడు.

కరోనా నా దూకుడును అడ్డుకుంది..
యూకే ఉన్న సమయంలో కలిసిన ముగ్గురు మహిళలు ఇప్పుడు గర్భవతిగా ఉన్నారనే వార్త చాలా ఆనందానికి గురిచేసిందని తెలిపాడు. కరోనా మహమ్మారి ఈ ఏడాది తనను నెమ్మదించేలా చేసిందని, సగటున ఏడాదికి 10 మహిళలకు గర్భదానాన్ని చేస్తానని జోయ్ చెప్పుకొచ్చాడు. కచ్చితమైన సంఖ్య తెలియదు గాని, ప్రతీ ఏడాది డబుల్ గణాంకాల్లో శిశువులకు తండ్రినవుతున్నానని అతడు వెల్లడించాడు. కరోనా వల్ల సెక్స్ చేస్తున్న సమయంలోనూ మాస్క్(Mask) ధరిస్తున్నానని తెలిపాడు. అయితే సామాజిక దూరాన్ని మాత్రం పాటించలేమని అన్నాడు. పిల్లలు పుట్టినప్పుడు వారి ఫొటోలు చూడటం తనకు ఎంతో ఇష్టమని వివరించాడు.

వీర్యదానం(Sperm Donate) వల్ల ఆర్థిక లాభం లేదు..
మహిళలకు తన స్మెర్మ్(Sperm) అందించడం వల్ల ఎలాంటి ఆర్థిక లాభం లేదని, కేవలం ప్రజలకు సహాయం చేయడం ద్వారానే తాను ఆనందం పొందుతానని జోయ్ స్పష్టం చేశాడు. అదృష్టవశాత్తు తాను కొన్ని ఆన్ లైన్ వ్యాపారాలను(Online Business) నమ్ముతున్నానని, అందువల్ల తాను ఎల్లపప్పుడు అందుబాటులో ఉండి అవసరమైన వారికి వీర్యాన్ని దానం చేయగలుగుతాన్నానని తెలిపాడు. జోయ్ అమెరికా, అర్జెంటీనా, ఇటలీ, సింగపూర్, ఫిలిప్పైన్స్, యూకేల్లో పర్యటించి తన వీర్యాన్ని దానం చేశాడు.

ప్రపంచమంతా నా పిల్లలే..
తనకు ప్రపంచమంతా పిల్లలు ఉన్నారని జోయ్ ఆనందం వ్యక్తం చేశాడు. సెక్స్(Sex) కు సంబంధించి సమస్యలు ఎదుర్కుంటూ క్లినిక్స్ చుట్టూ ప్రజలు తిరిగుతున్నారని, చాలా మంది ఈ విషయంలో ఆందోళన చెందుతున్నారని జోయ్ స్పష్టం చేశాడు. క్లినిక్స్ ద్వారా వీర్యాన్ని తీసుకున్న మహిళలు లేదా వారి పిల్లలు ఎప్పుడూ దాతలను కలవలేరని అభిప్రాయపడ్డాడు. అయితే తాను మాత్రం వీర్యాన్ని దానం చేసేటప్పుడు తల్లులను వ్యక్తిగతంగా సమావేశమవుతానని, ఏ సమయంలోనైనా బిడ్డలను కలవడం సంతోషంగా ఉంటుందని చెప్పాడు. వారు కావాలంటే వారికి సన్నిహితంగా ఉంటానని అన్నాడు.

వీర్యం పనిచేసినంత కాలం దానం చేస్తా..
2008లో వీర్యాన్ని దానం చేయడం ప్రారంభించానని సంవత్సరానికి 10 మంది పిల్లలకు జన్మనిచ్చానని అతను తెలియజేశాడు. తన వీర్యం పనిచేసినంత కాలం దానం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నానని, నాకు తెలిసి 90 ఏళ్ల వరకు ఇస్తానని బదులిచ్చాడు. సాధ్యమైనంత వరకు సురక్షితంగా(Secure) వీర్యాన్ని దానం చేస్తున్నానని చెప్పాడు. ఏటా ఆరోగ్య పరీక్షలను చేయించుకుంటానని, ఒకవేళ పరీక్షలు చేయించుకోమని మహిళలు కోరితే మధ్యలోనైనా చేయించుకుంటానని చెప్పాడు.

ప్రైవేటు స్పెర్మే సురక్షితం..
IVF క్లినిక్లో కంటే ప్రైవేటు స్పెర్మ్(Private Sperm) సురక్షితమని తాను నమ్ముతున్నానని జోయ్ చెప్పాడు. ఎందుకంటే ఐవీఎప్ కోసం అండ సేకరణ అనేది అండోత్సర్గం హైపర్ స్టిమ్యూలేషన్ సిండ్రోమ్ వంటి తీవ్రమైన దుష్ప్రభావాలతో కూడిన శస్త్రచికిత్సావిధానమి ఆయన అన్నాడు. గర్భదారణ సమయంలో అందరికీ పరీక్షలు నిర్వహించడానికి నేను సహాయం చేసే స్త్రీలు, అందువల్ల వారు లైంగికంగా సంక్రమంచే వ్యాధితో బాధపడుతున్నారో లేదో త్వరలో తెలుసుకుంటారని ఆయన తెలిపాడు. అయితే ఇలా ఇంతవరకు జరగలేదని తెలిపాడు.

యూకే తర్వాత ఇంటికే ప్రయాణం..
జోయ్ తన యూకే(UK) పర్యటన తర్వాత తన స్వస్థలమైన అమెరికాకు తిరిగి వెళ్లాలని ఆశిస్తున్నట్లు చెప్పాడు. అయితే వీర్యదానం(Sperm Donate) కోసం ప్రపంచంలో ఎక్కడికైనా ప్రయాణించడం చాలా సంతోషంగా ఉందని అన్నాడు. ఫేస్ బుక్(Facebook) లేదా ఈమెయిల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలకు అందుబాటులో ఉంటానని తెలిపాడు. ప్రపంచంలో అవసరమరైన చోట పనిచేయగలిగినందుకు ఆనందంగా ఉందని అన్నాడు. ఊహించినట్లుగానే క్రిస్మస్ కాలాన్ని యూకేలో ఉల్లాసంగా గడపాలనుకుంటున్నానని ఆశిస్తున్నట్లు చెప్పాడు.
Published by:Nikhil Kumar S
First published:

Tags: America, Pregnant

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు