కొత్తగా కొన్న ఇల్లు.. శుభ్రం చేస్తున్న యజమానురాలికి మైండ్ బ్లాంక్.. ఓ గదిలో కార్పెట్ ను తీసి చూస్తే..

ప్రతీకాత్మక చిత్రం

ఇంటి పాత యజమాని మనకు ఎందుకు చెప్పలేదా? అనిపిస్తుంది. అమెరికాకి చెందిన ఈ మహిళ కూడా అదే అనుకొని ఉంటుందేమో. కొత్త ఇంట్లో ఆమెకు ఓ షాకింగ్ అనుభవం ఎదురయింది. వివరాల్లోకి వెళ్తే..

  • Share this:
మనం ఒక ఇంటి నుంచి మరో ఇంటికి మారినప్పుడు చాలా విషయాలు మారిపోతాయి. కొత్త ఇంటి వాతావరణానికి మనం అడ్జస్ట్ కావాల్సి ఉంటుంది. కొత్త ఇంట్లో ఎక్కడెక్కడ ఏం ఉన్నాయో గుర్తించేందుకు కొంత సమయం పడుతుంది. ఇల్లు చిన్నదైతే ఫర్వాలేదు కానీ కాస్త పెద్దదైతే దాన్ని పూర్తిగా శుభ్రం చేసుకొని మనకు అనుగుణంగా మార్చుకునేందుకు చాలా సమయమే పడుతుంది. అలా కొత్త ఇంటికి వెళ్లి అక్కడ అడ్జస్ట్ అవుతున్న సమయంలో అక్కడ మనం అనుకోని విషయాలు గమనిస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. దీని గురించి ఇంటి పాత యజమాని మనకు ఎందుకు చెప్పలేదా? అనిపిస్తుంది. అమెరికాకి చెందిన ఈ మహిళ కూడా అదే అనుకొని ఉంటుందేమో. కొత్త ఇంట్లో ఆమెకు ఓ షాకింగ్ అనుభవం ఎదురయింది. వివరాల్లోకి వెళ్తే..

అమెరికాలో నివసించే ఆ జంట సంవత్సరం క్రితం కొత్త ఇల్లు కొనుక్కున్నారు. సంవత్సరం పాటు బాగానే గడిచినా ఆ తర్వాత ఇల్లు పూర్తిగా శుభ్రం చేస్తూ ఓ గదిలో కింద పరిచి ఉన్న కార్పెట్ ని ఎత్తి చూసిందట. అక్కడ ఓ డోర్ దానికి కొద్దిగా తుప్పు పట్టిన హ్యాండిల్ ఉండడంతో దాన్ని తెరిచి లోపలికి వెళ్లింది. అది ఆ ఇంటికి బేస్ మెంట్ గది అని.. అందులో పాత ఫర్నిచర్ తో పాటు చాలా చెత్తా చెదారం పేరుకుపోయి ఉన్నాయని వెల్లడించింది. తాము సంవత్సరం క్రితం ఈ ఇల్లు కొన్నామని.. అయితే కొనేముందు ఇంటిని పూర్తిగా చెక్ చేసుకునే అవకాశం రాలేదని ఆమె వెల్లడించింది. ఈ ఇంటి పాత యజమానులు ఇక్కడి నుంచి వీలైనంత తొందరగా వేరే ప్రదేశానికి మారిపోవాలని భావించారు. అందుకే ఈ ఇంటిని చాలా తక్కువ ధరకే మాకు అమ్మేశారు. అందుకే మేం ఇంటిని కొనే ముందు దీన్ని పూర్తిగా పరిశీలించలేదు కూడా. అని చెప్పుకొచ్చింది.(వీడియో సౌజన్యం: iStory Youtube)
ఇది కూడా చదవండి: వేగంగా దూసుకెళ్తున్న రైలు.. సడన్ గా విడిపోయిన ఇంజన్.. ప్రయాణికుల్లో టెన్షన్.. చివరకు..

తన అనుభవాలను చెబుతూ ఇంట్లోని ఆ బేస్ మెంట్ ని చూపిస్తూ ఆమె టిక్ టాక్ వీడియో తీసి దాన్ని తన టిక్ టాక్ అకౌంట్ అయిన @Unfortunateexistance ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ బేస్ మెంట్ గురించి సంవత్సరం నుంచి తనకు తెలియలేదని.. బేస్ మెంట్ లోకి వెళ్తే అందులో కొన్ని గదులు కూడా ఉన్నాయని.. అయితే వాటిలోకి వెళ్లేందుకు తనకు ధైర్యం సరిపోలేదని చెప్పుకొచ్చిందామె. అప్పటి నుంచి ఈ వీడియోను ఒకటిన్నర కోట్ల మంది వీక్షించారు. ఈ వీడియోను షేర్ చేస్తూ ఇలాంటి బేస్ మెంట్లను చూస్తే చాలా భయంగా ఉంటుంది అని కూడా చెప్పుకొచ్చారు. మరికొందరు తమకు ఎదురైన ఇలాంటి అనుభవాలను కూడా పంచుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: ప్రపంచం అంతం కాబోతోంది.. ఈ వీడియోనే సాక్ష్యం.. తేల్చిచెబుతున్న క్రైస్తవ ప్రముఖులు.. శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..
First published: