చాలా మంది యువత ప్రేమించుకుంటారు. పెళ్లిచేసుకొనివారితోనే ఎప్పటికి ఉండాలని అనుకుంటారు. అయితే.. కొన్ని సందర్బాలలో అవతలి వ్యక్తి కూడా అదే ఫీలింగ్ తో ఉన్నాడో లేదో అసలు పట్టించుకోరు. కొంత మంది ఎదుటి వారితో మొదట స్నేహంగా ఉంటారు. ఆ తర్వాత.. తమ ప్రేమను (love) ప్రపోజ్ చేస్తారు. దీన్ని కొంత మంది యాక్సెప్ట్ చేస్తే.. మరికొందరు రిజక్ట్ చేస్తుంటారు. ఈ క్రమంలో కొంత మంది చాలా ఒత్తిడికి గురౌతారు. తమ ప్రేమను ఒప్పుకొని వారిమీద అఘాయిత్యాలకు పాల్పడుతుంటారు. భౌతికంగా దాడులు చేయడం, ఇంట్లో వెళ్లి చెప్పడం, ప్రేమించిన వారికి అందరిలో చెడ్డపేరు వచ్చేలా రూమర్స్ అంటగడుతుంటారు.
ఇలాంటి పనులు చేయడంలో యువతీ, యువకులు ఒకరికి మరోకరు ఏమాత్రం తీసిపోవడం లేదు. ఇప్పటికే కొన్ని చోట్ల అబ్బాయిలు.. అమ్మాయిలపై భౌతిక దాడులు, యాసిడ్ దాడులు, అత్యాచారాలకు పాల్పడిన అనేక ఘటనలు వార్తలలో నిలిచాయి. మరికొన్ని చోట్ల.. అమ్మాయిలు కూడా.. తమ బాయ్ ఫ్రెండ్ బైక్ కాలబెట్టడం, అనేక రకాలుగా టార్చర్ చేయడం వంటి పలు ఘటనలు తరచుగా వార్తలలో ఉంటునే ఉంటాయి. తాజాగా, మరో ఘటన వెలుగులోనికి వచ్చింది.
పూర్తి వివరాలు.. అమెరికాలో (america) షాకింగ్ ఘటన జరిగింది. నార్త్ కరోలినాలోని ఒక మహిళ చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పోలీసుల ప్రకారం.. నార్త్ కరోలినాలోని ఒక మహిళ.. తన ప్రియుడు (Ex lover) రిజక్ట్ చేశాడని కోపం పెంచుకుంది. ఎలాగైన అతడిపై పగతీర్చుకోవాలని భావించింది. అందుకు ఒక ప్లాన్ వేసింది. అతను ఇంటిని తగలెట్టాలని అనుకుంది. తన ప్లాన్ ప్రకారం.. గోల్డ్ హిల్ లోని ప్రియుడి ఇల్లనుకుని మరో ఇంటికి నిప్పంటించింది. అప్పుడు ఆ ఇంటి యజమాని బైటనుంచి వస్తున్నాడు. ఘటన చూసి షాక్ కు గురయ్యాడు. వెంటనే స్థానికులను అప్రమత్తం చేశాడు. మంటలను ఆర్పడానికి ప్రయత్నించాడు.
అయితే.. మహిళ అక్కడ నిలబడి సహాయక చర్యలకు అడ్డుపడింది. అప్పుడు.. అతను షాకింగ్ కు గురయ్యాడు. అక్కడి వారి సహాయంతో.. ఆమెను పక్కకు తప్పించి, అక్కడ ఉన్న నీళ్లతో మంటలు ఆర్పారు. వెంటనే ఫైర్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పేశారు. అంతే కాకుండా స్థానిక పోలీసులు మహిళను అదుపులోనికి తీసుకున్నారు. ఆమెను విచారించగా తన ప్రియుడిమీద కోపంతో ఇలా చేసినట్లు ఒప్పుకుంది. తన ప్రియుడి ఇల్లు తెలియక వేరే ఇల్లును కాలబెట్టినట్లు అంగీకరించింది. ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట వైరల్ గా (viral news) మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: America, Lover cheating, VIRAL NEWS