హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

సినిమా ఇండస్ట్రీలో విషాదం .. ది గాడ్ ఫాదర్ నటుడు కన్నుమూత..

సినిమా ఇండస్ట్రీలో విషాదం .. ది గాడ్ ఫాదర్ నటుడు కన్నుమూత..

జేమ్స్ కాన్ (ఫైల్)

జేమ్స్ కాన్ (ఫైల్)

America: సినిమా రంగంలో విషాదం చోటు చేసుకుంది. యూఎస్ కు చెందిన ఫేమస్ నటుడు జేమ్స్ కాన్ 82 ఏళ్ల వయసులో కన్నుమూశారు.

అమెరికాకు (America)  చెందిన నటుడు గాడ్ ఫాదర్ సినిమాలో నటించిన.. స్టార్ జేమ్స్ కాన్ 82 ఏళ్ళ వయసులో మరణించారు. ఆయన ది గాడ్‌ఫాదర్‌లో (The Godfather Star) సోనీ కార్లియోన్‌గా నటించి ప్రసిద్ధి చెందారు. యుఎస్ నటుడు జేమ్స్ కాన్ 82 సంవత్సరాల వయస్సులో మరణించినట్లు ఆయన సన్నిహిత వర్గాలు గురువారం తెలిపాయి. కాగా, ఆయన ది గాడ్‌ఫాదర్‌ పాత్రలో సోనీ కార్లియోన్‌గా నటించి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో ఆయన గురువారం తుదిశ్వాస విడిచారు.

మిజరీ, థీఫ్, రోలర్‌బాల్‌లో కూడా పాత్రలు పోషించిన కాన్, ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోల యొక్క ది గాడ్‌ఫాదర్‌లో మాఫియా కుటుంబం యొక్క పెద్ద కొడుకుగా విషాదకరమైన పాత్ర పోషించినందుకు ఆస్కార్ నామినేషన్‌ను అందుకున్నాడు. కాగా, జూలై 6 సాయంత్రం జిమ్మీ మరణించినట్లు మీకు తెలియజేయడానికి చాలా బాధగా ఉందని అని అతని కుటుంబం కాన్ ఖాతాకు పోస్ట్ చేసిన ట్వీట్‌లో పేర్కొంది. కాన్ మేనేజర్ ఈ వార్తను AFPకి ధృవీకరించారు. అంతే కాకుండా ఆయన "ది గాడ్‌ఫాదర్," "ఎల్ఫ్" , "మిజరీ" వంటి చిత్రాలలో నటించారు. జేమ్స్ కాన్ (James Caan Dies) బుధవారం సాయంత్రం 82 సంవత్సరాల వయసులో మరణించారు.

ఇదిలా ఉండగా బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ (Britain PM Boris Johnson) తన పదవికి రాజీనామా చేశారు.

ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించారు. రాజీనామా ప్రకటన సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడిన ఆయన.. ప్రపంచంలోనే బెస్ట్ జాబ్ నుంచి తప్పుకుంటున్నందుకు ఎంతో బాధగా ఉందని ఎమోషనల్ అయ్యారు. బ్రిటన్‌కు బంగారు భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తన హయంలో సాధించిన విజయాల పట్ల తనకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు. ఐతే కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు ఆయన ఆపద్ధర్మ ప్రధాన మంత్రిగా కొనసాగుతారు. కన్జర్వేటివ్ పార్టీ సమావేశంలో కొత్త నాయకుడిని ఎన్నుకునే ప్రక్రియ పూర్తయ్యే వరకు 58 ఏళ్ల జాన్సన్ ప్రధాని బాధ్యతలు నిర్వర్తిస్తారు. అక్టోబర్‌లో పార్టీ మహాసభలు జరగాల్సి ఉంది.

బోరిస్ జాన్సన్ పాలనపై మంత్రులు, అధికారులు విశ్వాసం కోల్పోయారు. ఆయన పదవి నుంచి వైదొలగాలని డిమాండ్ చేస్తూ... ఇప్పటి వరకు 50 మందికి పైగా మంత్రులు, ఎంపీలు రాజీనామా చేశారు. ప్రభుత్వంపై అవిశ్వాసం ఎంతగా పెరిగిపోయిందంటే.. 36 గంటల క్రితం మంత్రి పదవి పొందిన మిచెల్ డొనెలన్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. బుధవారం సాయంత్రం వరకు 17 మంది క్యాబినెట్ మంత్రులు, 12 మంది పార్లమెంటరీ కార్యదర్శులు, నలుగురు విదేశీ ప్రభుత్వ ప్రతినిధులు రాజీనామాను ప్రకటించారు.

బోరిస్ జాన్సన్ పాలనపై వారంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కరోనా సంక్షోభాన్ని సరిగ్గా ఎదుర్కోలేకపోయారని, లాక్‌డౌన్ నిర్ణయాలతో ప్రజలను ఇబ్బందులుకు గురి చేశారని.. ఆయనపై ప్రజలతో పాటు మంత్రులు కూడా మండిపడుతున్నారు. అంతేకాదు బోరిస్ జాన్సన్‌ సెక్స్ స్కాండల్‌పై వస్తున్న ఆరోపణలను కూడా ప్రస్తావిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రులు, ఎంపీల నుంచి తీవ్రంగా ఒత్తిడి రావడంతో.. ప్రధాని పదవికి రాజీనామా చేయాలని బోరిస్ నిర్ణయించుకున్నారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: America, Bollywood, Movie News, VIRAL NEWS

ఉత్తమ కథలు