Home /News /trending /

AMERICA MATCH FOUND IN PRISON MOTHER FALLS IN LOVE WITH PRISONER SERVING 15 YEAR SENTENCE PAH

OMG: ఇదేందిరా నాయనా.. జైలులో ఉన్న ఖైదీతో డేటింగ్.. చివరకు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

America: జైలులో ఉన్న ఖైదీతో మహిళ ప్రేమలో పడింది. అతను తీవ్రమైన దాడికి పాల్పడిన వ్యక్తికి సహాకరించాడనే నేరం మీద జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • West Bengal, India
ప్రేమ ఎప్పుడు ఎవరిమీద పుడుతుందో ఎవరు చెప్పలేరు. కొందరు యువత తమ అవసరాల కోసం ప్రేమను పావుగా ఉపయోగించుకుంటారు. ప్రేమ,స్నేహాం అనే ముసుగులో అడ్డమైన తిరుగుళ్లు తిరుగుతుంటారు. మరికొందరు.. మాత్రం వీరికి భిన్నంగా ఎదుటి వారిని నిజాయితీగా ప్రేమిస్తుంటారు. ప్రేమించిన వారికోసం ఏం చేయడానికైన వెనుకాడరు. ప్రేమలో కొంత మంది మంచిగా సెటిల్ అయిన వారిని, అన్నిరకాలుగా మంచిగా ఉన్నవాడిని చూసి లవ్ చేస్తుంటారు. కొందరు దీనికి భిన్నంగా ఉంటారు. తమ మనసుకు నచ్చితే చాలు.. వారిని ప్రేమిస్తుంటారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. అమెరికాలో (America) వింత ఘటన జరిగింది. కాలిఫోర్నియాకు చెందిన బ్రిట్నీ సమ్మర్స్ అనే మహిళ.. జైలులో టిక్ టాక్ లో పరిచయం అయిన వ్యక్తితో ప్రేమలో పడింది. 35 ఏళ్ల బ్రిట్నీ సమ్మర్స్.. సోషల్ మీడియాలో ఒక యాప్, మైఖేల్ జేమ్సన్ తో పరిచయం ఏర్పడింది. అప్పటికే అతగాడు.. తీవ్రమైన నేరానికి పాల్పడిన వ్యక్తికి సహాకరించాడనే ఆరోపణపై 15 ఏళ్ల శిక్ష అనుభవిస్తున్నాడు. వీరి ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారితీసింది. తరచుగా వీరిద్దరు జైలులో కలుసుకునేవారు. ఈ క్రమంలో.. అతగాడు.. ఇప్పటికే 14 ఏళ్ల శిక్షను పూర్తి చేసుకున్నాడు. అయితే.. తాము తొందరలోనే పెళ్లి బంధంతో ఒక్కటవుతున్నట్లు మహిళ సోషల్ మీడియాలో పంచుకుంది.



అయితే.. బ్రిట్నీ సమ్మర్స్ కు ఇప్పటికే పెళ్లి అయ్యి.. భర్తతో దూరంగా ఉంటుంది. ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. మేమిద్దరం ఒకర్నిమరోకరు అర్థంచేసుకున్నామని, అతగాడు జైలునుంచి బయటకు రాగానే పెళ్లిచేసుకుంటామని బ్రిట్నీ తెలిపింది. మేమిద్దరం చిన్నతనం నుంచి అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నామని, ఇప్పుడు మరోసారి కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నట్లు బ్రిట్నీ సోషల్ మీడియాలో (Social media) పంచుకుంది. ఈ ఘటన కాస్త వైరల్ గా (Viral news)  మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: America, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు