AMERICA 51 YEAR OLD MAN MARRIES SON S 27 YEAR OLD EX GIRLFRIEND THEY STARTED DATING WHEN SHE WAS 16 PAH
అమ్మబాబోయ్.. ముసలోడే కానీ మహా ముదురు.. కొడుకు మాజీ లవర్ ను ఏంచేశాడంటే..
పాల్, సిడ్నిలు
America: బాలిక తరచుగా తన స్నేహితుడికి కలవడానికి అతని ఇంటికి వస్తుండేది. దీంతో బాలికకు.. అతని స్నేహితుడి తండ్రితో పరిచయం ఏర్పడింది. ఇద్దరికి మధ్య చనువు పెరిగింది. ప్రతి రోజు చాటింగ్ చేసుకునే వారు.
ప్రేమ ఎప్పుడు (love) ఎవరి మీద పుడుతుందో ఎవరు చెప్పలేరు. కొందరు తమ కన్నా.. వయసులో పెద్దవారిని పెళ్లి చేసుకుంటుంటారు. మరికొన్ని చోట్ల తమకన్నా.. వయసులో తక్కువ ఉన్నవారితో కూడా ప్రేమలో పడిన అనేక సంఘటనలు ఉన్నాయి. అయితే.. మరికొందరు క్యాష్ ఫీలింగ్, కాస్ట్ ఫీలింగ్ లను అసలు చూయించరు. మనసుకు నచ్చితే చాలను కుంటారు. అయితే... ఈ మధ్య కాలంలో కొన్ని విచిత్ర సంఘటనలు జరుగుతున్నాయి. అత్తతో, అల్లుడి ఎఫైర్ (Affairs) ఘటనలు, కోడలితో మామ వివాహేతర సంబంధాల వంటి ఘటనలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల కొడుకు, భార్యతో కూడా కన్నతండ్రి ఎఫైర్ పెట్టుకున్న అనేక ఘటనలు ఉన్నాయి. అయితే, ఇక్కడ ఒక విచిత్ర ఘటన వెలుగులోనికి వచ్చింది.
పూర్తి వివరాలు.. అమెరికాలోని (America) వింత సంఘటన జరిగింది. ఒహియోకుక చెందిన 27 ఏళ్ల సిడ్ని అనే యువతి.. తన లవర్ తండ్రితో ప్రేమలో పడింది. అయితే.. వీరు యువతి.. ఓహియోలో ఉన్నప్పటి నుంచి ఒకే ఏరియాలో ఉండేవారు. అప్పుడు సిడ్ని అనే బాలికకు 11 ఏళ్లు. ఆమె... పాల్ అనే వ్యక్తి కొడుకు మంచి స్నేహితులు. పాల్ కొడుకు.. కోసం తరచుగా ఆమె ఇంటికి వచ్చేది. కొడుకుతో కొన్ని రోజుల పాటు డేటింట్ కూడా చేసింది. అయితే, ఆమె కొన్ని రోజుల తర్వాత.. పాల్ తో కూడా ప్రేమలో పడింది. దీంతో అతను సిడ్నితో చాట్ చేసేవాడు. ఇద్దరు కలుసుకునే వారు. వీరి ఇద్దరి ప్రేమ కొన్నేళ్ల పాటు సాగింది. ఇప్పుడు పాల్ కు 57 కాగా, డిస్నికి 27 ఏళ్లు.
ఇద్దరి ఇష్టలు ఒక్కటయ్యాయి. కొనాళ్లకు పాల్, సిడ్ని ఇద్దరు తమ ప్రేమను (love affair) పరస్పరం చెప్పుకున్నారు. పెళ్లితో ఒక్కటవ్వాలను కున్నారు. అయితే... వీరి ప్రేమ విషయం తెలసి.. సిడ్ని స్నేహితులు అనేక మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వీరి ప్రేమను ఎవరు అంగీకరించ లేదు. వీరి పెళ్లిని అంగీకరించేదిలేదని ఇరు కుటుంబాలు తెగేసి చెప్పాయి. దీంతో ఇద్దరు ఎవరికి చెప్పకుండా సీక్రెట్ గా 2016లో పెళ్లి చేసుకున్నారు. అయితే, మొదట్లో పాల్ కొడుకు కూడా.. వీరి బంధాన్ని ఒప్పుకోలేదు. కానీ ఆ తర్వాత.. కొనాళ్లు దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత.. అంతా ఒకే ఇంట్లో ఉంటున్నారు. తమ జీవితం సాఫీగా సాగుతుందని.. సిడ్ని తెలిపింది. ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట (Social media) వైరల్ గా (Viral ) మారింది.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.