AMBULANCE DRIVER FROM WEST BENGAL WINS JACKPOT LOTTERY 1 CRORE BECOMES CROREPATI IN ONE DAY VB
Ambulance Driver: అతడు ఒక అంబులెన్స్ డ్రైవర్.. ఉదయం లేవగానే కోటీశ్వరుడు అయ్యాడు.. ఎలా అంటే..
షేక్ హీరా
Ambulance Driver: ఎవరి విధి ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. తరచుగా కొన్ని ఘటనలు మనం వినే ఉంటాం.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యారని.. అలాంటిదే ఇక్కడ ఒకటి జరిగింది. అయితే తన జీవితంలో కోటీశ్వరుడు అవుతానని ఊహించని ఓ అంబులెన్స్ డ్రైవర్ కథను ఈ రోజు మీకు తెలియజేస్తున్నాం.
హిట్ షో 'కౌన్ బనేగా కరోడ్‌పతి'లో గేమ్‌లు గెలిచి ధనవంతులైన చాలా మంది కథలను మీరు చూసి ఉండవచ్చు. ఎవరి విధి ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. నిజజీవితంలో కోటీశ్వరుడు అవుతానని ఊహించని ఓ అంబులెన్స్ డ్రైవర్ గురించి ఇక్కడ మనం తెలుసుకుందాం. అదృష్టం కొద్దీ ఈ అంబులెన్స్ డ్రైవర్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. మీరు నమ్మకపోవచ్చు, కానీ ఇది నిజం. పశ్చిమ బెంగాల్(West Bengal) లోని తూర్పు బర్ధమాన్ జిల్లాకు చెందిన అంబులెన్స్ డ్రైవర్ షేక్ హీరా ఉదయం లేచి రూ.కోటి విలువైన జాక్‌పాట్ లాటరీని గెలుచుకున్నాడు. ఆ టిక్కెట్‌ను అతడు కేవలం రూ.270కి కొనుగోలు చేశాడు. అయితే మధ్యాహ్నానికి కోటీశ్వరుడు అయ్యాడు. కోటి రూపాయల జాక్‌పాట్‌ను గెలుచుకున్న తర్వాత.. అతను తనకు సెక్యూరిటీ కల్పించాలని నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు.
లాటరీ టిక్కెట్టు పోతుందేమోనని..తనను ఎవరైనా ఏమైనా చేస్తారని భయపడి అతడు ఇలా చేశాడు. ఎట్టకేలకు శక్తిగఢ్ పోలీసులు అతడిని సురక్షితంగా ఇంటికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన ఇంటి వద్ద పోలీసు బలగాలను మోహరించారు. షేక్ హీరా తల్లి అనారోగ్యంతో ఉన్నారు. ఆమె చికిత్స కోసం అతనికి చాలా డబ్బు కావాలి. కానీ విధి అతడికి అనుకూలంగా మారింది. ఆ లాటరీ టికెట్ గెలవడంతో.. తన తల్లికి మెరుగైన చికిత్సను అందిస్తానని చెప్పాడు. దీని గురించి అతడు మాట్లాడుతూ.. తాను ఎప్పుడూ ఏదో ఒక రోజు జాక్‌పాట్ గెలవాలని కలలు కనే వాడిని అని.. అందుకే టిక్కెట్లు కొంటూనే ఉన్నానన్నాడు. చివరకు ఆ దేవుడు నన్ను కరుణించాడు. అని షేక్ ఆనందం వ్యక్తం చేశాడు.
ఈ డబ్బును ఏం చేస్తావని అడగ్గా.. తాను దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడినని.. తనకు కాస్త అప్పులు ఉన్నాయని.. వాటిని వీటితో తీర్చుతానని.. చెప్పాడు. ప్రస్తుతం తన తల్లికి ఉత్తమ చికిత్సను అందిస్తానని చెప్పాడు. ఇక మిగిలిన వాటితో మంచి ఇల్లును కొనుక్కుంటానన్నాడు. ఇక.. లాటరీ టిక్కెట్లు విక్రయించే షేక్ హనీఫ్ మాట్లాడుతూ, “నేను చాలా సంవత్సరాలుగా లాటరీ టిక్కెట్ల వ్యాపారం చేస్తున్నాను. నా షాప్ నుండి చాలా మంది టిక్కెట్లు కొంటారు. కొన్ని బహుమతులు అప్పుడప్పుడు వస్తుంటాయి. కానీ ఇంతకు ముందు నా షాప్ నుండి ఇంత జాక్‌పాట్ ప్రైజ్ రాలేదు.
ఈ రోజు.. జాక్‌పాట్ విజేత నా దుకాణం నుండి టిక్కెట్‌ను కొనుగోలు చేసినందుకు నేను సంతోషిస్తున్నానన్నారు. అంబులెన్స్ డ్రైవర్‌కు రూ.కోటి అమౌంట్ అనేది తక్కువ కాదు. రాత్రికి రాత్రే బిలియనీర్‌గా మారిన అంబులెన్స్ డ్రైవర్‌పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే.. షేక్ మరియు అతని కుటుంబం మొత్తం ఇంత పెద్ద మొత్తంలో డబ్బును అందుకోవడం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో షేక్ హీరా గురించి జోరుగా చర్చ జరుగుతోంది. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు కానీ అదే సమయంలో రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్ అయిపోయాడు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు.. ఒకేసారి కోటీశ్వరుడితో పాటు.. సోషల్ మీడియాలో స్టార్ కూడా అయిపోయాడు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.