Amazon : తెలంగాణకు అమెజాన్ వరం... రూ.25000 కోట్లతో డేటా సెంటర్ల ఏర్పాటు

Amazon Company : బిగ్ ఈజ్ బ్యూటీఫుల్ అనేది రిలయన్స్ నినాదం. అమెజాన్ సంస్థ కూడా దీన్నే ఫాలో అవుతోంది. ఇండియాలో... అది కూడా తెలంగాణలో మూడు భారీ డేటా సెంటర్లను ఏర్పాటు చేయబోతోంది. ఆ విశేషాలు తెలుసుకుందాం.


Updated: February 12, 2020, 11:41 AM IST
Amazon : తెలంగాణకు అమెజాన్ వరం... రూ.25000 కోట్లతో డేటా సెంటర్ల ఏర్పాటు
Amazon : తెలంగాణకు అమెజాన్ వరం... రూ.25000 కోట్లతో డేటా సెంటర్ల ఏర్పాటు
  • Share this:
Amazon Company : ప్రపంచంలో అతి పెద్ద ఈ-కామర్స్‌ సంస్థగా పేరు తెచ్చుకున్న అమెజాన్‌ కంపెనీ... తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టబోతోంది. హైదరాబాద్‌ అవుట్‌స్కర్ట్స్‌లో సుమారు రూ.25000 కోట్లతో మూడు భారీ డేటా సెంటర్లను ఏర్పాటు చేయబోతోంది. ఇందుకు సంబంధించి పర్మిషన్ల కోసం అప్లై చేసుకుంది. ఈ సెంటర్లలో 90 శాతం పెట్టుబడిని... హైఎండ్‌ కంప్యూటర్లు, స్టోరేజీ, సర్వర్లు, ఇతర పరికరాలు ఏర్పాటు చేయబోతోంది. హైదరాబాద్‌ అవుట్‌స్కర్ట్స్‌లోని రంగారెడ్డి జిల్లాలో షాబాద్ మండలంలోని చందనవెల్లి, మీర్‌ఖాన్‌పేట, రావిరాల దగ్గర్లోని ఫ్యాబ్‌సిటీలో ఈ డేటా సెంటర్స్ ఏర్పాటు కాబోతున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం 134 ఎకరాల్ని అమెజాన్‌కి ఇచ్చింది. మెదటి దశలో రూ.11,600 కోట్లు పెట్టి రెండు డేటా సెంటర్లు ఏర్పాటు చేయబోతోంది అమెజాన్. అలాగే మరొకటి వచ్చే ఐదేళ్లలో ఏర్పాటు చేయబోతోంది. మూడోదానికోసం రూ.13,400 కోట్లు ఖర్చు చేయాలని డిసైడైంది. ఇలా మొత్తం మూడు సెంటర్లతో భారీ పెట్టుబడులు పెట్టబోతోంది. ఈ సెంటర్ల ద్వారా దాదాపు 1500 - 2000 మంది ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. ఇందులో గొప్ప విషయం మరొకటి ఉంది. అమెరికా తర్వాత హైదరాబాద్‌లోనే అమెజాన్ ఈ అతిపెద్ద కేంద్రాల్ని ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం అమెజాన్‌కు 22 దేశాల్లో 69 డేటా కేంద్రాలున్నాయి. హైదారాబాద్‌లో మూడు కేంద్రాలు కూడా సిద్ధం అయితే ఆ సంఖ్య 72కు చేరుతుంది. ఇండియా, ఆసియా దేశాలకు అదిరిపోయే ఫ్యూచర్ ఉందని భావిస్తున్న అమెజాన్... ఇప్పటి నుంచే అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటోంది. దానికి తోడు ఇండియాలో ఇంటర్నెట్ వాడకం బాగా పెరుగుతోంది. అందువల్ల అమెజాన్ ముందు జాగ్రత్తగా ఈ స్టెప్ వేస్తోంది.

ఇటీవల తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్... దావోస్ వెళ్లారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. కంపెనీలకు అన్ని రకాలుగా కలిసొచ్చేలా చేస్తామన్నారు. దాంతో ప్రపంచ స్థాయి కంపెనీలు... తెలంగాణ వైపు చూస్తున్నాయి. అమెజాన్ వెబ్ సర్వీసెస్‌కు చెందిన ఉన్నతాధికారులతో కేటీఆర్... ఈ డేటా కేంద్రాల ఏర్పాటుపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సాయం అందిస్తామన్నారు. దాంతో... ప్రాజెక్టు పట్టాలెక్కింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పర్యావరణ పర్మిషన్ల కోసం అమెజాన్ డేటా సర్వీసెస్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ పేరుతో... జనవరి 31న అప్లికేషన్ పెట్టుకుంది. మొత్తం దాదాపు 150000 చదరపు మీటర్లలో ఈ కేంద్రాల్ని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిసింది.

అన్నీ లాభాలే : ఏదైనా కంపెనీ ఏర్పాటవుతుందంటే... అది ఆ కంపెనీతోపాటూ... స్థానిక ప్రజలకు కూడా మేలు జరగడం ఖాయం. అమెజాన్ కంపెనీ డేటా సెంటర్ల ఏర్పాటు వల్ల... అమెజాన్ వెబ్ సర్వీసులు ఇండియన్స్‌కి మరింత చేరువవుతాయి. అందువల్ల ఇలాంటి సర్వీసులకు ట్రైనింగ్ ఇచ్చే సంస్థలు పుట్టుకొస్తాయి. అలాగే... డేటా వాడకం కూడా పెరుగుతుంది. తద్వారా సాఫ్ట్‌వేర్ సంస్థలకు కలిసొస్తుంది. ఇలా క్లస్టర్ సంస్థల ఏర్పాటుకు వీలవుతుంది.

First published: February 12, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు