Home /News /trending /

AMAZON FONDER JEFF BEZOS OWNS 884 CRORE PROPERTY IN A NEW YORK BUILDING WHAT MAKES IT SO SPECIAL GH SRD

Jeff Bezos: 884 కోట్ల రూపాయలతో విలాసవంతమైన భవనం కొన్న జెఫ్‌ బెజోస్‌.. ఆ భవనం ప్రత్యేకత ఎంటో తెలుసా?

జెఫ్ బెజోస్

జెఫ్ బెజోస్

Jeff Bezos: అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (Jeff Bezos) డబ్బు సంపాదించడంలోనే కాదు ఖర్చు పెట్టడంలో కూడా అందరికంటే ముందుంటారు. తాజాగా ఆయన న్యూయార్క్‌ లోని ఓ భవనంలో ఒక అపార్ట్‌మెంట్‌ కొనుగోలు చేశారు.

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (Jeff Bezos) డబ్బు సంపాదించడంలోనే కాదు ఖర్చు పెట్టడంలో కూడా అందరికంటే ముందుంటారు. తాజాగా ఆయన న్యూయార్క్‌ లోని ఓ భవనంలో ఒక అపార్ట్‌మెంట్‌ కొనుగోలు చేశారు. 212 ఫిఫ్త్ అవెన్యూలో ఉన్న ఈ 4 బెడ్‌రూమ్‌ల అపార్ట్‌మెంట్‌ విలువ అక్షరాల 23 మిలియన్ (సుమారు రూ.171కోట్లు) డాలర్లు. ఈ భవనం ఫ్లాటిరాన్ జిల్లాలో ఉంది. గతంలో ఈ భవనంలోనే మూడు అంతస్థుల పెంట్‌హౌస్‌తోపాటు మూడు అదనపు యూనిట్‌లను కొనుగోలు చేశారు. దాంతో ఈ భవనంలో ఆయన అపార్ట్‌మెంట్స్ ప్రాపర్టీ విలువ 119 మిలియన్ డాలర్ల( సుమారు 884 కోట్లు) కు చేరుకుంది. అలాగే ఈ ఐకానిక్ బిల్డింగ్ లోపల 4,155 చదరపు అడుగుల భాగాన్ని కొనుగోలు చేసినట్లయింది. బెజోస్ అపార్ట్‌మెంట్‌ 20A కొనుగోలు కోసం జూలైలో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఆగష్టు 6న ఒప్పందం ప్రకారం డబ్బులు చెల్లించి అపార్ట్‌మెంట్‌ ని సొంతం చేసుకున్నారు. ఈ కొత్త అపార్ట్‌మెంట్‌ 22, 23, 24వ అంతస్తుల్లో విస్తరించి ఉన్న పెంట్ హౌస్ కింద ఉంటుంది. 2020 ఏప్రిల్‌లో అదే భవనంలో ఉన్న మరో యూనిట్ ను 16 మిలియన్ డాలర్లతో సొంతం చేసుకున్నారు. ఈ 3 బెడ్‌రూమ్‌ల అపార్ట్‌మెంట్ 20వ అంతస్తులో ఉంటుంది. మిగిలిన యూనిట్లను 2019 జూన్‌లో 80 మిలియన్ డాలర్లు చెల్లించి సొంతం చేసుకున్నారు.

212 ఫిఫ్త్ అవెన్యూ భవనంలో బెజోస్ అపార్ట్‌మెంట్‌‌ల ప్రత్యేకతలు:

కొత్తగా కొన్న అపార్ట్‌మెంట్‌‌లో నాలుగు బెడ్‌రూమ్‌లు, నాలుగు బాత్‌రూమ్‌లు, అందమైన కాఫర్డ్ సీలింగ్, గ్యాలరీ గోడలు, మార్బుల్ ఫ్లోర్స్, పెద్ద కిటికీలు ఉంటాయి. ఈ భవనం నుంచి వరల్డ్ ట్రేడ్ సెంటర్, మాడిసన్ స్క్వేర్ పార్క్ లను వీక్షించవచ్చు.

212 ఫిఫ్త్ అవెన్యూ బిల్డింగ్ ప్రత్యేకతలు:

గతంలో ఒక ఆఫీస్ బిల్డింగ్ గా ఉపయోగించిన 212 ఫిఫ్త్ అవెన్యూ భవనంలో ఇప్పుడు 48 కాండో యూనిట్లు, 24 అంతస్తులు ఉన్నాయి. ఇది న్యూయార్క్ నగరంలో మొదటగా నిర్మించిన ఆకాశసౌధాలలో ఒకటిగా వెలుగొందుతోంది. దీనిని 1913లో స్క్వార్ట్జ్ & గ్రాస్ నిర్మాణ సంస్థ నియో-గోతిక్ శైలిలో నిర్మించింది. ఈ భవనంలో ఉండే సకల సౌకర్యాల గురించి తెలుసుకుంటే.. కోల్డ్ స్టోరేజ్, ది రైట్ ఫిట్ ఫిట్నెస్ సెంటర్, యోగా స్టూడియో ట్రీట్మెంట్ రూమ్, ప్లే రూమ్, ప్రత్యేక గేమ్ రూమ్ ఉంటాయి. ఇందులో రెసిడెన్షియల్ లాంజ్, క్యాటరింగ్ కిచెన్‌తో పాటు డైనింగ్/మీటింగ్ రూమ్ స్క్రీనింగ్ రూమ్ లు కూడా ఉంటాయి.

ఈ అత్యంత ఎత్తైన భవనంలోని అపార్ట్‌మెంట్‌లను టెక్సాస్ బిలియనీర్ ఎడ్ బాస్, ఈఎస్పిఎన్ హోస్ట్ మైక్ గ్రీన్బర్గ్, చార్లెస్, సెరిల్ కుష్నర్ వంటి సెలబ్రిటీలు కూడా కొనుగోలు చేశారు. అయితే అపరకుబేరుడు జెఫ్ బెజోస్ తాము నివసిస్తున్న భవనంలోనే అపార్ట్‌మెంట్‌లను అనుకోని చేశారని నివాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారట.
Published by:Sridhar Reddy
First published:

Tags: Amazon, Jeff Bezos, New york

తదుపరి వార్తలు