అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రెడీ.. మొదలైన ఆన్‌లైన్ ఆర్డర్లు..

Online Shopping : దేశవ్యాప్తంగా గ్రీన్, ఆరెంజ్ జోన్లలో లాక్‌డౌన్ నుంచి మినహాయింపును ఇవ్వడంతో ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అత్యావశ్యకం కాని ఫోన్లు, ఇతర ఉత్పత్తుల డెలివరీని ప్రారంభించాయి.

news18-telugu
Updated: May 4, 2020, 8:29 AM IST
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రెడీ.. మొదలైన ఆన్‌లైన్ ఆర్డర్లు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Online Shopping : దేశవ్యాప్తంగా గ్రీన్, ఆరెంజ్ జోన్లలో లాక్‌డౌన్ నుంచి మినహాయింపును ఇవ్వడంతో ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అత్యావశ్యకం కాని ఫోన్లు, ఇతర ఉత్పత్తుల డెలివరీని ప్రారంభించాయి. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఈ రోజు నుంచి అమ్మకాలను స్టార్ట్ చేశాయి. అయితే, అందరూ ఆర్డర్లు చేయలేరు. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మాత్రమే డెలివరీ చేయనున్నాయి. రెడ్ జోన్లలో ఉండే వినియోగదారులు అత్యావశ్యకమైన వస్తువులను మాత్రమే కొనుగోలు చేయవచ్చు. ఈ నేపథ్యంలో డెలివరీ బాయ్స్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాయి ఈ సంస్థలు. సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, వస్తువును వినియోగదారుడికి అందించే క్రమంలో జాగ్రత్తలు పాటించాలని సూచించాయి.

అందులో భాగంగా.. ఇంటి వద్ద లేకపోతే ఇంటి బయట డెలివరీ ఇచ్చేలా.. సంస్థలు డెలివరీ బాయ్స్‌కు సూచనలు చేశాయి. అంతేకాకుండా.. సాధారణం కంటే ఈ సమయంలో డెలివరీ ఆలస్యం అయ్యేలా ఉందని కూడా ఈ కామర్స్ సంస్థలు తమ వెబ్‌సైట్లలో ‘నోట్’ రాసి ఉంచుతున్నారు.
First published: May 4, 2020, 8:29 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading