పండుగ సీజన్ ఆన్‌లైన్ విక్రయాలు @ రూ.15,000 కోట్లు

పండుగ సీజన్ ఆన్‌లైన్ విక్రయాలు @ రూ.15,000 కోట్లు

రికార్డు స్థాయి విక్రయాలు నమోదు

గత పండుగ సీజన్‌లో నమోదైన మొత్తం విక్రయాలను...ఈ సారి కేవలం 36 గంటల్లోనే అధిగమించినట్లు అమెజాన్ ఇండియా కంట్రీ హెడ్ అమిత్ అగర్వాల్ వెల్లడించారు.

 • Share this:
  దసరా పండుగ సీజన్ సందర్భంగా అమజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్ తదితర ఈ-కామర్స్ వెబ్‌సైట్ల రికార్డు స్థాయి విక్రయాలు నమోదు చేసుకున్నాయి. ఆన్‌లైన్‌లో దాదాపు రూ.15,000 కోట్ల(2.3 బిల్లియన్ డాలర్లు) మేర విక్రయాలు జరిగినట్లు అంచనావేస్తున్నారు. పండుగ సీజన్ సందర్భంగా గత ఐదు రోజుల్లో(అక్టోబర్ 9-14) ఈ విక్రయాలు నమోదయ్యాయి. గత ఏడాది ఈ సీజన్‌తో పోలిస్తే...ఈ ఏడాది విక్రయాలు ఏకంగా 64 శాతం మేర పెరిగాయి. గత ఏడాది దసరా సీజన్‌లో దాదాపు రూ.10,325 కోట్ల(1.4 బిల్లియన్ డాలర్లు) విక్రయాలు జరిగినట్లు అంచనావేస్తున్నారు.

  రెడ్‌సీర్ కన్సల్టింగ్ అంచనాల ప్రకారం ఆన్‌లైన్‌ ద్వారా ఈ-కామర్స్ వెబ్‌సైట్లు మునుపెన్నడూ లేనంత విక్రయాలు అక్టోబర్ 9-14 మధ్య ఐదు రోజుల వ్యవధిలో నమోదయ్యాయి. ద్వితీయ శ్రేణి నగరాల్లో విక్రయదారుల సంఖ్య గణనీయంగా పెరగడంతో ఆ మేరకు ఆన్‌లైన్ విక్రయాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ-కామర్స్ వెబ్‌సైట్లు ప్రకటించిన ఆకర్షణీయమైన ఆఫర్లు కూడా భారీ విక్రయాలకు దోహదం చేశాయి.

  ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్లివే...,great discounts on smartphones in Flipkart Big Billion Days Sale
  అక్టోబర్ 10-14 వరకు ఫ్లిప్‌కార్ట్‌లో ది బిగ్ బిలియన్ డేస్ సేల్


  అటు అమెజాన్ ఇండియా కూడా ప్రస్తుత సీజన్‌లో నమోదైన విక్రయాల పట్ల సంతృప్తి వ్యక్తంచేసింది. గత పండుగ సీజన్‌లో నమోదైన మొత్తం విక్రయాలను...ఈ సారి కేవలం 36 గంటల్లోనే అధిగమించినట్లు అమెజాన్ ఇండియా కంట్రీ హెడ్ అమిత్ అగర్వాల్ వెల్లడించారు.

  Amazon, festival sale, discounts, tips, coupons, Flipkart Big Billion Days sale, offers, deals, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్, ఆఫర్స్, డీల్స్, అమెజాన్, ఫెస్టివల్ సేల్
  ప్రతీకాత్మక చిత్రం


  చిన్నచిన్న పట్టణాల నుంచి 80 శాతం మంది కొత్త వినియోగదారులు కొనుగోలు జరిపినట్లు తెలిపారు. పండుగ సీజన్ విక్రయాల్లో అత్యధిక వాటా స్మార్ట్ ఫోన్లదే ఉన్నట్లు తెలిపారు.
  Published by:Janardhan V
  First published: