డెలివరీ బాయ్స్ కోసం ఫ్రీ ఫుడ్, కూల్‌డ్రింక్స్... వైరల్ వీడియో

USA : అమెరికాలో ఆ మహిళ చాలా మంచిది. డెలివరీ బాయ్స్ కోసం తన ఇంటి డోర్ దగ్గర కూల్ డ్రింక్స్, స్నాక్స్ ఉంచుతోంది. ఎందుకో తెలుసుకుందాం.

news18-telugu
Updated: December 9, 2019, 10:17 AM IST
డెలివరీ బాయ్స్ కోసం ఫ్రీ ఫుడ్, కూల్‌డ్రింక్స్... వైరల్ వీడియో
డెలివరీ బాయ్స్ కోసం ఫ్రీ ఫుడ్, కూల్‌డ్రింక్స్... వైరల్ వీడియో (credit - twitter)
  • Share this:
USA : ఏదైనా మంచి వీడియోని వైరల్ చేసే విషయంలో నెటిజన్లు ఏమాత్రం వెనకడుగు వెయ్యరు. చక్కగా లైక్స్ కొడతారు, కామెంట్లు పెడతారు, షేర్ చేస్తారు. వాళ్ల యూనిటీని మెచ్చుకోవాల్సిందే. తాజాగా నెటిజన్లంతా కలిసి ఓ మంచి వీడియోని వైరల్ చేశారు. అందులో అమెజాన్ సంస్థ డెలివరీ బాయ్... ఓ ఇంటికి ఐటెమ్ డెలివరీ చెయ్యడానికి వెళ్లాడు. అక్కడ వాటర్ బాటిళ్లు, కూల్ డ్రింక్స్, స్నాక్స్, కుకీస్, క్రేకర్స్ ప్యాకెట్లు ఉండటం చూశాడు. అవి డెలివరీ బాయ్స్ కోసం ఫ్రీగా ఉంచినవని తెలియడంతో తెగ ఆనందపడిపోయాడు. ఆమెకు థాంక్స్ చెబుతూ... డాన్స్ చేస్తూ... తనకు కావాల్సినవి తీసుకొని పండగ చేసుకున్నాడు. అమెరికా... విల్మింగ్టన్‌లోని డెలావేర్‌లో ఉన్న ఇంటి ముందు ఇలా ఫ్రీ ఫుడ్ పెట్టింది అందులో నివసిస్తున్న మహిళ. ఆమె చేసిన మంచి పనిని ఇప్పుడు అంతా మెచ్చుకుంటున్నారు. యాహూ లైఫ్ స్టైల్‌ ఫేస్ బుక్ పేజీలో పెట్టిన ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. ట్విట్టర్‌లో కూడా దుమ్మురేపుతోంది.

డిసెంబర్ వచ్చేసింది కదా. అమెరికా ప్రజలు ఇప్పుడు ఫెస్టివ్ మూడ్‌లో ఉంటారు. క్రిస్మస్‌కి ఇప్పటి నుంచే వేడుకలకు ఏర్పాట్లు చేసుకుంటారు. అందులో భాగంగా... ఆ మహిళ డెలివరీ బాయ్స్ కోసం ఫ్రీ ఫుడ్ ఇస్తున్నారు. నెటిజన్లు ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

 

Pics : హాట్ పోజులతో హీట్ పెంచుతున్న అంకితా దవే


ఇవి కూడా చదవండి :కొత్త అవతారం ఎత్తిన అర్ణబ్ గోస్వామి... ఇక ఆపలేంగా...

ఒకేసారి రెండు సెక్స్ రాకెట్ల గుట్టు రట్టు...

సానియా మీర్జా సంచలనం... దుమ్మురేపుతున్న వైరల్ వీడియో

అత్యంత రద్దీగా శబరిమల... దర్శనానికి స్వాముల పడిగాపులు...


మరో గుడ్‌న్యూస్ చెప్పిన హైదరాబాద్ మెట్రో
First published: December 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు