Video: పిల్లాడు ఏడుస్తున్నట్లు అరిచిన పక్షి... షాకవుతున్న నెటిజన్లు

పిల్లాడు ఏడుస్తున్నట్లు అరిచిన పక్షి (image credit - twitter)

Viral Video: మీకు అరుదైన, విచిత్రమైన వీడియోలు చూసే అలవాటు ఉందా... అయితే ఈ స్టోరీ మీకోసమే. ఇందులో పక్షి అచ్చం పిల్లాడు ఏడిస్తే ఎలా ఉంటుందో అలాగే అరిచింది.

  • Share this:
    Viral Video: మన ప్రపంచంలో చిత్ర విచిత్రమైన పక్షులున్నాయి. కోకిలలు కుహూకుహూ అంటారు... కాకులు కావ్ కావ్ అంటాయి. వాటి నుంచి వేరే శబ్దాలేవీ (Bird voice) మనం వినం. అవి ఎప్పుడూ అలాగే అరుస్తాయి. కొన్ని రకాల చిలుకలకు ట్రైనింగ్ ఇస్తే... అవి మనుషుల లాగా మాట్లాడగలుగుతాయి. అలాంటి వీడియోలు (Bird videos) మనం చాలా చూశాం. ఐతే... ఏ ట్రైనింగూ ఇవ్వకుండానే రకరకాల వాయిస్‌లను మిమిక్రీ చేయగలిగే పక్షులున్నాయి. అలాంటి ఓ పక్షి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ (Viral video) అవుతోంది. దాన్ని చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు. అది నిజమా గ్రాఫిక్సా అంటున్నారు.

    ఈ వీడియోలో పక్షి... పసికందులు ఏడిస్తే ఎలా ఉంటుందో... అలాగే అరిచింది. అది పక్షి అరుపులా మనకు అస్సలు అనిపించట్లేదు. పిల్లలు ఏడ్చినట్లే ఉంది. అందుకే ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇదేం పక్షిరా బాబూ అంటున్నారు.

    ఆ వీడియో ఇక్కడ చూడండి.


    ఆస్ట్రేలియా... సిడ్నీలోని టారొంగా జూ (Taronga Zoo) వారే స్వయంగా ఈ వీడియోని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు కాబట్టి ఇది ఫేక్ వీడియో కాదు. మరైతే ఆ పక్షి అలా ఎలా అరవగలిగిందన్నది మనకు వచ్చే డౌట్.

    ఈ పక్షులను లైర్ బర్డ్ (Lyrebird) అంటారు. వీటికి ఉన్న స్పెషల్ స్కిల్ ఇది. ఇవి తమ చుట్టుపక్కల ఏది విన్నా... దాన్ని మిమిక్రీ చెయ్యగలవు. సరిహద్దుల్లో బుల్లెట్ల వర్షం, అంబులెన్స్ సైరన్, ఎమర్జెన్సీ సైరన్లు ఇలా అవి విన్న ప్రతిదీ కాపీ కొడతాయి. సేమ్ అలాగే అరుస్తాయి. ఈ పక్షుల వీడియో యూట్యూబ్‌లో బోలెడున్నాయి.

    ఉదాహరణకు ఈ వీడియో చూడండి.

    ఇది కూడా చదవండి: బార్బీలా కనిపించాలని రూ.24 లక్షలు ఖర్చుచేసింది.. తీరాచూస్తే ఇలా అయ్యింది!

    టాలెంట్ అదిరింది కదా. ఈ పక్షులని మిమిక్రీ పక్షులు (mimicry bird) అని కూడా అంటారు. ఆస్ట్రేలియాలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. ఈ పక్షులు సౌండ్‌లను గుర్తుంచుకోగలవు. వాటిని లోలోపల ప్రాక్టీస్ చేసి... సేమ్ అలాగే అరవగలవు. ఎవరూ అలా నేర్పకపోయినా అది వాటికి వచ్చు. అందుకే ఈ పక్షులు ప్రపంచంలోని మిగతా పక్షుల కంటే ప్రత్యేకమైనవిగా నిలిచాయి.
    Published by:Krishna Kumar N
    First published: