Video: ఊసరవెల్లిలా రంగులు మార్చుకుంటున్న ఆక్టోపస్!.. నిద్రలో!

ఊసరవెల్లిలా రంగులు మార్చుకుంటున్న ఆక్టోపస్ (image credit - twitter)

Octopus Video: ఆక్టోపస్ రంగులు మార్చుకోవడం మీరెప్పుడైనా చూశారా... బహుశా చూసి ఉండరు. అది కూడా నిద్రపోతూ రంగులు మార్చుకోవడం మరో విచిత్రం. ఆ వీడియో చూస్తే భలే ఉంది అంటారు.

  • Share this:
    Octopus Video: ఈ భూమి, సముద్రాలు, ప్రకృతి ఇవి ఎప్పుడూ మనకు బోర్ కొట్టవు. ఎందుకంటే ఇవి ఎప్పుడూ మనకు కొత్త దనాన్ని చూపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా మహా సముద్రాలు కలర్‌ఫుల్‌గా ఉండటమే కాదు. ఎన్నో అద్భుతాల్ని చూపిస్తాయి. జనరల్‌గా మనం ఊసరవెల్లి రంగులు మార్చుకుంటుంది అంటాం కదా... అలా ఓ ఆక్టోపస్ కూడా తన స్కిన్ కలర్స్ మార్చుకుంటోంది. నిజానికి ఊసర వెల్లి రంగులు మార్చుకోంది. కాకపోతే... దాని స్కిన్‌పై చుట్టుపక్కల కలర్స్ కాంతి పడినప్పుడు.. ఆ కలర్ దాని స్కిన్‌పై కూడా కనిపిస్తుంది. అద్దంలాగా అన్నమాట. అది చూసి మనం రంగులు మార్చేసుకుంటోంది అనుకుంటాం. తన శత్రువైన గద్ద నుంచి తప్పించుకునేందుకు ఊసరవెల్లికి ఈ ఆప్షన్ ఉంది.

    సరే ఇప్పుడు ప్రస్తుత వీడియోలో... ఓ అష్టభుజి (octopus) కలర్స్ మార్చుకుంటోంది. ఇది మాత్రం నిజంగానే రంగులు మార్చుకుంటోంది. యాక్చువల్లీ అది ఓ చోట అలా ఉండి నిద్రపోతోంది. ఏం కలలు కంటుందో గానీ... దాని ఒంటిపై రంగులు మాత్రం మారిపోతున్నాయి. మొదట నాచు రంగులో ఉండి... తర్వాత వైట్ కలర్‌లోకి మారింది. ఆ తర్వాత మచ్చలున్నట్లుగా మార్చుకుంది. చివరకు ముళ్లు ఉన్నట్లుగా త్రీడీ కలర్స్‌లో మార్చుకుంది. ఇదంతా ఓ డైవర్... ముద్రంలో షూట్ చేశారు.

    ఆ వీడియోని ఇక్కడ చూసేయండి.


    మీరు ఇదివరకు చాలా ఆక్టోపస్ వీడియోలు చూసే ఉంటారు. ఇవి తెలివైన జీవులు. సొంతంగా గూడు కట్టుకోగలరు. లేదా... ఏ ఆల్చిప్పలోనో దూరి దాన్ని డోర్ మూసుకున్నట్లు మూసుకోగలవు. కొబ్బరి చిప్పలో దాక్కోగలవు. ఇలా వాటి తెలివితేటలు అమోఘం. మరో విషయం... ఆక్టోపస్‌ని తినేద్దామని ఏదైనా చేప వస్తే... ముందుగా ఆక్టోపస్ ఓ రకమైన బ్లూ కలర్ విషాన్ని నీటిలోకి చిమ్ముతుంది. దాంతో... నీరంతా బ్లూ కలర్ లోకి మారిపోతుంది. అంతలో ఆక్టోపస్ తుర్రుమని పారిపోతుంది. ఆ తర్వాత చేప ఎంత వెతికినా దొరకదు. ఇలాంటి ఆప్షన్ కూడా దానికి ఉంది.

    ఇది కూడా చదవండి: Zodiac Sign: మీ రాశి ఆధారంగా మీకు ఏ కెరీర్ బెస్ట్? తెలుసుకోండి

    ఈ వీడియోని ట్విట్టర్‌లో బ్యూటెంజెబీడెన్ (Buitengebieden) అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఈ ఆక్టోపస్ నిద్రపోతూ కలర్స్ మార్చుకోవడం నెటిజన్లకు బాగా నచ్చుతోంది. రకరకాల కామెంట్లు పెడుతున్నారు. చాలా మంది నమ్మలేకపోతున్నామని అంటున్నారు. ఇలాంటిది ఇదివరకు ఎప్పుడూ చూడలేదు అంటున్నారు.
    Published by:Krishna Kumar N
    First published: