సీబీఐ అప్ డేట్: రెండు గంటల్లో మూడు బ్రేకింగ్ న్యూస్

సీబీఐ వర్సెస్ సీబీఐ వివాదంలో రెండు గంటల్లోనే కీలక నిర్ణయాలు వెలువడ్డాయి. ఆలోక్ వర్మ, ఎం. నాగేశ్వరరావులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాకేష్ ఆస్థానాకు ఢిల్లీ హైకోర్టులో షాక్ తగిలింది.

news18-telugu
Updated: January 11, 2019, 5:00 PM IST
సీబీఐ అప్ డేట్: రెండు గంటల్లో మూడు బ్రేకింగ్ న్యూస్
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: January 11, 2019, 5:00 PM IST
సీబీఐ వర్సెస్ సీబీఐ కేసులో ఒకే రోజు మూడు బ్రేకింగ్ న్యూస్‌లు జరిగాయి. అందులో ఒకటి సీబీఐ మాజీ డైరెక్టర్ ఆలోక్ వర్మ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. రెండోది, సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా పగ్గాలు చేపట్టిన తర్వాత ఎం. నాగేశ్వరరావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతకు ముందు రోజు ఆలోక్ వర్మ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేశారు. మూడో విషయం ఏంటంటే, అవినీతి ఆరోపణలతో సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా మీద నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టేసేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది.

సీబీఐ మాజీ డైరెక్టర్ ఆలోక్ వర్మ తన ఉద్యగానికే రాజీనామా చేశారు. అగ్నిమాపక శాఖ - హోంగార్డ్స్ డైరెక్టర్ జనరల్‌‌గా నియమించడంతో ఆయన మనస్తాపం చెందారు. సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న తనను, తన కంటే తక్కువ కేడర్ ఉద్యోగానికి బదిలీ చేయడంతో ఆయన మనస్తాపం చెందారు. ఈనెల 31 వరకు ఆయన పదవీకాలం ఉన్నా.. 20 రోజుల ముందుగానే ఆయన తన ఉద్యోగానికి రాజీనామాను సమర్పించారు.

CBI vs CBI, CBI Chief Alok Verma, Alok Verma Removed again, PM Narendra Modi removes Alok Verma, CVC Report on Alok Verma, AK Sikri on Alok Verma, CBI vs CBI Latest news, సీబీఐ వర్సెస్ సీబీఐ, సీబీఐ చీఫ్ అలోక్ వర్మ తొలగింపు, అలోక్ వర్మను తొలగించిన ప్రధాని మోదీ, సీబీఐ వర్సెస్ సీబీఐ లేటెస్ట్ న్యూస్
అలోక్ వర్మ (ఫైల్ ఫొటో)


సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా తెలుగువ్యక్తి ఎం.నాగేశ్వరరావు మరోసారి పగ్గాలు చేపట్టారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత నాగేశ్వరరావు స్థానంలో ఆలోక్ వర్మ మళ్లీ బాధ్యతలు తీసుకున్నారు. అయితే, ఆయన్ను ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని హైపవర్ కమిటీ సీబీఐ డైరెక్టర్‌గా తొలగించింది. మళ్లీ ఎం.నాగేశ్వరరావుకే పగ్గాలు అప్పగించింది. అయితే, అంతకు ముందు నాగేశ్వరరావు కొందరు ఉద్యోగులను బదిలీ చేయగా, ఆ బదిలీలను ఆలోక్ వర్మ రద్దు చేశారు. తాజాగా, ఆలోక్ వర్మ రద్దు చేసిన బదిలీ ఆర్డర్స్‌ను మళ్లీ నాగేశ్వరరావు క్యాన్సిల్ చేశారు.M Nageswara Rao, the interim CBI Director, has been promoted to the rank of Additional Director by the Appointments Committee of the Cabinet
మన్నెం నాగేశ్వరరావు


సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాకు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. రాకేష్ ఆస్థానాతోపాటు సీబీఐ డిప్యూటీ సూపరింటెండెంట్ దేవేంద్ర కుమార్ మీద నమోదైన కేసును కొట్టేసేందుకు హైకోర్టు నిరాకరించింది. మొయిన్ ఖురేషీ అనే వ్యక్తిని మనీ లాండరింగ్ కేసు నుంచి బయటపడేసేందుకు వారిద్దరూ లంచం డిమాండ్ చేశారంటూ గతంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాన సతీష్ బాబు అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ కేసులో అప్పటి సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా మధ్య చిచ్చుపెట్టింది. రాకేష్ ఆస్థానా, దేవేంద్ర కుమార్ మీద సీబీఐ విచారణ జరపాలంటూ ఆలోక్ వర్మ ఆదేశాలు ఇచ్చారు.

rakesh asthana, rakesh asthana cbi, cbi rakesh asthana, rakesh asthana news, rakesh asthana video, cbi special director rakesh asthana, special director rakesh asthana, pm modi rakesh asthana, సీబీఐ కేసు, సీబీఐ కేస్, సీబీఐ ముడుపుల కేసు: రాకేశ్ ఆస్థానాను ఎప్పుడూ చూడలేదు : మనోజ్ ప్రసాద్ సీబీఐ ముడుపుల కేసు మలుపులు తిరుగుతోంది. సతీష్ బాబు సానా నుంచీ రూ.5 కోట్లు తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మధ్యవర్తి మనోజ్ ప్రసాద్ చెప్పిన మాటలు కలకలం రేపుతున్నాయి. మనోజ్ ప్రసాద్ ఏం చెప్పాడు? దర్యాప్తులో ఏం తేలుతోంది? Never seen or met CBI's Rakesh Asthana: Alleged middleman Manoj Prasad
ఆస్తానా, సీబీఐ స్పెషల్ డైరెక్టర్
Loading...
తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టేయాలంటూ రాకేష్ ఆస్థానా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన వాదనను తోసిపుచ్చిన న్యాయస్థానం కేసు విచారణను కొనసాగించాలని, దర్యాప్తు 10 వారాల్లో పూర్తి చేయాలని ఆదేశించింది.
First published: January 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...