NewsRoundup: అలోక్ వర్మ రాజీనామా, ఏపీలో పెన్షన్‌ల పెంపు సహా మరిన్ని టాప్ న్యూస్

తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ, అంతర్జాతీయంగా ఇవాళ జరిగిన ప్రధాన వార్తలను సంక్షిప్తంగా చూద్దాం.

news18-telugu
Updated: January 11, 2019, 9:59 PM IST
NewsRoundup:  అలోక్ వర్మ రాజీనామా, ఏపీలో పెన్షన్‌ల పెంపు సహా మరిన్ని టాప్ న్యూస్
టాప్ వార్తలు
news18-telugu
Updated: January 11, 2019, 9:59 PM IST
సీబీఐ మాజీ డైరెక్టర్ ఆలోక్ వర్మ రాజీనామా చేశారు. ఆయన్ను సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి తప్పించిన హై పవర్ కమిటీ.. ఆ స్థానంలో తాత్కాలిక చీఫ్‌గా ఎం.నాగేశ్వరరావును నియమించింది. ఆలోక్ వర్మను అగ్నిమాపక శాఖ, హోంగార్డుల విభాగం డైరెక్టర్ జనరల్‌గా బదిలీ చేసింది. అయితే, ఆ బాధ్యతలు చేపట్టేందుకు ఆలోక్ వర్మ తిరస్కరించారు. తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారు. Full story

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పింఛన్ పొందుతున్న లబ్దిదారులందరికీ... ప్రస్తుతం ఇస్తున్న మొత్తం కంటే రెట్టింపు మొత్తం ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. పెంచిన పింఛన్లను జనవరి నుంచే అమలు చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఫిబ్రవరిలో ఇచ్చే పింఛన్లలోని జనవరికి సంబంధించిన పింఛన్ బకాయిలను కూడా చెల్లించనుంది. Full story

ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు అన్ని జిల్లాల నాయకులతో ప్రత్యేకంగా సమావేశమవుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్... శుక్రవారం జరిగిన పార్టీ నాయకుల సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో తమతో పొత్తు కోసం టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ ప్రయత్నిస్తున్నాయని పార్టీ శ్రేణులతో వ్యాఖ్యానించిన పవన్ కళ్యాణ్... తమకు బలం లేదంటూనే కొన్ని పార్టీలు తమతో పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నాయని అన్నారు. Full story

జనవరి 21 నుంచి పంచాయతీ ఎన్నికలు.. ఆపై లోక్‌సభ ఎన్నికలు జరగనుండటంతో రాష్ట్రంలో కొద్ది రోజులు ఎలక్షన్ ఫీవర్ నడవనుంది. ఈ రెండు ఎన్నికలకు తోడు మధ్యలో ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది. వచ్చే నెల మూడో వారంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాట్లు మొదలుపెట్టింది. Full storyడేరా సచ్చా సౌధ చీఫ్ గుర్మీత్ రామ్‌రహీమ్‌కు మరో కేసులో జైలు శిక్షపడనుంది. జర్నలిస్ట్ రామచంద్ర ఛత్రపతి హత్య కేసుపై తీర్పు వెలువరించిన పంచకుల ప్రత్యేక న్యాయస్థానం..గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌తో పాటు మరో ముగ్గురిని దోషిగా తేల్చింది. నలుగురు దోషులకు జనవరి 17న శిక్షలు ఖరారు చేయనుంది. Full story

ప్రేమపెళ్లికి పెద్దలు అడ్డుచెప్పడంతో వికారాబాద్ జిల్లాలో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మొదట అమ్మాయి పురుగుల మందు తాగగా..ఇరుపొరుగువారు ఆమెను ఆస్పత్రికి తరలించారు. తన కోసం ప్రియురాలు ఆత్మహత్య చేసుకోవడంతో ప్రియుడు కూడా ఆత్మహత్యకు యత్నించాడు. హఠాత్ పరిణామంతో షాక్‌కు గురైన బంధువులు...అదే ఆసుపత్రిలో అతన్ని చేర్పించారు. మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడి బయటపడ్డారు. దాంతో ఇద్దరికీ ఆసుపత్రిలోనే నిఖా చేశారు కుటుంబసభ్యులు. Full story

దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ డివిడెండ్‌తో పాటు షేర్ల బైక్ బ్యాక్ ప్రకటించింది. ఒక్కో షేర్‌పై రూ. 4 డివిడెండ్‌ ప్రకటించిన ఇన్ఫోసిస్... రూ. 8260 కోట్ల ఖర్చుతో షేర్లను బై బ్యాక్ చేయాలని నిర్ణయించిన ఇన్ఫీ... ఒక్కో షేర్‌ను రూ. 800లకు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో రూ. 3609 నికర లాభాన్ని ప్రకటించిన కంపెనీ... మార్కెట్ అంచనాలను అందుకోలేకపోయింది. గతంతో పోలిస్తే 12 శాతం తక్కువ లాభాన్ని నమోదు చేసింది. Full story
Loading...
భారీ అంచనాలతో విడుదలైన విన‌య విధేయ రామ మూవీకి నెగెటివ్ టాక్ రావడంతో మెగా అభిమానులు నిరాశ చెందారు. మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వ‌చ్చిన ఈ చిత్రంలో చాలా స‌న్నివేశాలు అతిగా ఉన్నాయని సోషల్ మీడియాలో సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇన్నాళ్లూ తెలుగులో బాల‌య్య అంటూ ఆయ‌న్నే టార్గెట్ చేసిన ట్రోల్ రాయుళ్ల‌కు ఇప్పుడు సంక్రాంతి భోజ‌నం పెట్టాడు రామ్ చ‌ర‌ణ్. Full story

బీసీసీఐ సీఓఏ సంచలన నిర్ణయం తీసుకుంది. ‘కాఫీ విత్ కరణ్’ షోలో క్రికెటర్లు మాట్లాడిన అనుచిత వ్యాఖ్యల గురించి విచారణ పూర్తయ్యేవరకూ... హార్దిక్ పాండ్యా, కెఎల్ రాహుల్‌లపై నిరవధిక సస్పెన్షన్ విధించింది. విచారణ మొత్తం పూర్తయ్యే, సీఓఏ నిర్ణయం ప్రకటించేవరకూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లోనే కాకుండా ఐపీఎల్ లాంటి ఆర్గనైజ్డ్ పోటీల్లోనూ పాల్గొనకూడదని నిర్ణయం వెల్లడించింది. Full story
First published: January 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...