Viral: అద్భుతం.. ఆశ్చర్యం.. ఒకే చెట్టుకు కాస్తున్న 40 రకాల పండ్లు.. ఎలా సాధ్యమైందంటే..

ప్రతీకాత్మక చిత్రం

40 రకాల పండ్లు అందించే ఈ అసాధారణమైన చెట్టును సామ్ వాన్ అకెన్ అనే అమెరికన్ రైతు సృష్టించారు. ఆయన సైరక్యూస్ యూనివర్సిటీలో విజువల్ ఆర్ట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు.

  • Share this:
సాధారణంగా ఒక చెట్టుకు ఒకేరకమైన కాయలు కాస్తాయి. అయితే అమెరికాలోని ఒక చెట్టుకు మాత్రం ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 40 రకాల కాయలు కాస్తున్నాయి. అంటుకట్టడంలో వినూత్న పద్ధతులను ఉపయోగించి ఇలాంటి చెట్టును సృష్టించాడు ఒక రైతు. 40 రకాల పండ్లు అందించే ఈ అసాధారణమైన చెట్టును సామ్ వాన్ అకెన్ అనే అమెరికన్ రైతు సృష్టించారు. ఆయన సైరక్యూస్ యూనివర్సిటీలో విజువల్ ఆర్ట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. ఈయన సృష్టించిన చెట్టు.. రేగు, పీచ్, నేరేడు పండు, చెర్రీ వంటి వివిధ రకరకాల పండ్లను అందించడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ప్రొఫెసర్ సామ్ అంటుకట్టు (Grafting) విధానం ద్వారా 40 రకాల పండ్లు అందించే చెట్టుని సృష్టించారు. అయితే ఈ చెట్టు మొగ్గ వేయడానికి దాదాపు తొమ్మిదేళ్ల పట్టిందట. అంటుకట్టడం అంటే.. సాధారణంగా ఏదైనా ఒక అంటు చెట్టుకి ఇతర చెట్టు కొమ్మను గట్టిగా అతికిస్తారు. అప్పుడు అంటు చెట్టు.. ఇతర చెట్టు కొమ్మకు పోషకాలను సమంగా అందిస్తుంది. తద్వారా ఆ ఇతర చెట్టు కొమ్మ చక్కగా పెరుగుతుంది. ఇదే విధానాన్ని పాటించిన ప్రొఫెసర్ సామ్.. మొగ్గ ఉన్న ఓ చెట్టు కొమ్మను వేరు చేసి ప్రధాన చెట్టుకు చలికాలంలో అంటుకట్టారు. ఈ అద్భుతమైన చెట్టుకు ప్రాణం పోసేందుకు 2008 నుంచి ఆయన గ్రాఫ్టింగ్ విధానాన్ని పాటిస్తున్నారు.

న్యూయార్క్ స్టేట్ అగ్రికల్చరల్ ఎక్స్‌పరిమెంట్ స్టేషన్‌లోని ఒక తోట గురించి తెలుసుకున్న తర్వాత ప్రొఫెసర్ సామ్ ఈ చెట్టును రూపొందించాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో ఈ తోటలో 200 కంటే ఎక్కువ రకాల రేగు పండ్లు, నేరేడు పండ్లు పండించేవారు. కానీ సరిపడా నిధుల్లేక ఈ తోటను నిరుపయోగంగా వదిలేస్తున్నారని సామ్ తెలుసుకున్నారు. దీంతో ఆ తోటను కౌలు తీసుకొని "శిల్పం ద్వారా అంటుకట్టుట (sculpture through grafting)" అనే ప్రయోగాలు చేయడం ప్రారంభించారు. ఏళ్ల తరబడి కృషి చేసి విజయవంతంగా ఒకే చెట్టుకి రేగు, పీచు, నేరేడు, చెర్రీస్ వంటి 40 రకాల నోరూరించే పండ్లను పండించగలిగారు.

Sleep: నగ్నంగా పడుకోవడం వల్ల ఎన్నో లాభాలు.. చాలా సమస్యలకు పరిష్కారం.. అవేంటో తెలుసుకోండి

Revanth Reddy: కాంగ్రెస్ ముఖ్యనేత కీలక వ్యాఖ్యలు.. రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్

అయితే ప్రొఫెసర్ కేవలం స్టోన్ ఫ్రూట్స్(stone fruits) మాత్రమే ఎంచుకున్నారు. ఎందుకంటే ఈ పండ్లను సింగిల్ కల్చర్ వ్యవసాయ పద్ధతుల్లోనే పండిస్తున్నారు. అందుకే ఈ పండ్లను విభిన్న పద్ధతిలో పండించాలని నిర్ణయించుకున్నారు. దీన్ని ఒక సైంటిఫిక్ అట్టెంప్ట్ లా కాకుండా ఓ ఆర్ట్ ప్రాజెక్టుగానే తాను భావిస్తున్నట్లు ప్రొఫెసర్ చెబుతున్నారు. ప్రతి పండు కూడా భిన్న సమయాల్లో కాస్తాయని ఆయన వివరించారు. అందుకు అనుగుణంగా తాను చెట్టుని మార్చానని తెలిపారు.
Published by:Kishore Akkaladevi
First published: