Home /News /trending /

ALLU ARJUN PUSPA CINEMA FEVER ABROAD MILLIONS OF VIEWS FOR CELEBRITY STEPS ON SOCIAL MEDIA SNR

న్యూ ట్రెండ్ సెట్ చేస్తున్న పుష్ప సాంగ్స్‌..విదేశాల్లోని రోడ్లపై స్టెప్పులేస్తున్నసెలబ్రిటీలు

Photo Credit: Instagram

Photo Credit: Instagram

Pushpa Fever: అల్లుఅర్జున్ యాక్ట్ చేసిన పుష్ప ఓ సెన్సేషనల్‌ హిట్‌గా నిలిచింది. ఆ సినిమాలోని పాటల గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే. సోషల్ మీడియాలో ఒక్కో పాటకు వస్తున్న క్రేజ్ చూస్తుంటే..వరల్డ్‌ రికార్డ్‌ సృష్టించడంలో డౌటే లేదు అనిపిస్తోంది. పుష్పలోని రష్మిక, సమంత వేసిన స్టెప్పులకు ధీటుగా సెలబ్రిటీలు డ్యాన్స్ చేసి వీడియోలు షేర్ చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
అల్లు అర్జున్(Allu Arjun),రష్మిక మందన (Rashmika mandanna)కాంబోలో వచ్చిన పుష్ప (Pushpa)సినిమా రోజు రోజుకు జనంలో దూసుకెళ్తోంది. ఇంకా ఆ సినిమాలోని పాటలకు క్రేజ్‌ పెరుగుతోంది. ఇప్పుడు ఇతర భాష సినిమాల హీరోయిన్లు, మోడల్స్, టీవీ ఆర్టిస్టులు సైతం ఆ పాటలకు బానిసలవుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమాలో హీరో, హీరోయిన్‌ రష్మిక మందన, సమంత వేసిన స్టెప్పుల్ని బీట్ చేసే విధంగా తమ టాలెంట్‌ని చూపించి వీడియోల(Videos)ను ఇన్‌స్టా(Instagram)లో పోస్ట్ చేస్తున్నారు. పుష్ప సినిమాలోని సమంత చేసిన ఐటమ్‌ సాంగ్ ఊ అంటావా మావా ఉ ఉ అంటావా సాంగ్‌కి మోడల్స్, టీవీ ఆర్టిస్ట్‌లు సురభి, సమృద్ది (Surabhi,Samriddhi)చింపేశారు. ది కపిల్ శర్మ షోలో స్టైల్‌ ఏ బయాన్‌తో మిలియన్ల మంది వీక్షకుల హృదయాల్ని గెలుచుకున్న ఈ ట్విన్స్ లుక్కు పుష్పలోని ఐటమ్‌ సాంగ్‌పై పడింది. అంతే ఇద్దరు కలిసి ఆ సాంగ్‌కి స్టెప్పులేసి సమంతని మరిపించారు. మ్యాచింగ్‌ లైఫ్‌ స్టైల్ వార్తల్లో పాపులర్‌గా పేరు తెచ్చుకున్న చింకీ,మింకీనే సురభి, సమృద్ధి. సమంత ఐటమ్‌ సాంగ్‌ను అదే రేంజ్‌లో స్టెప్పులేసిన వీడియోని తమ ఇన్‌స్టా ద్వారా షేర్‌ చేసుకొని మరోసారి ఫేమస్ అయ్యారు. ఈ ఇద్దరు అక్క చెల్లెళ్లు చేసిన ఐటమ్‌ సాంగ్‌ వీడియోకి సోషల్ మీడియాలో సమంత, రూత్‌ప్రభు చేసిన వీడియో వ్యూస్‌ని క్రాస్‌ చేస్తోంది. పొట్టి డ్రెస్సులు వేసుకొని నల్ల కళ్లద్దాలు పెట్టుకొని ఇరగదీశారంటూ ట్విన్స్‌ ఫాలోవర్స్‌ కామెంట్స్ పోస్ట్ చేశారు.

పుష్ప అంటే పడి చస్తున్నారు..
పుష్ప సినిమా కంటే అందులోని పాటలే బాగా పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే సినిమాలోని సాంగ్స్‌ని సెలబ్రిటీలు సైతం స్టెప్పులు వేసి పుష్ప సాంగ్స్‌ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇదే ట్రాక్‌లోకి వచ్చింది నటి లారెన్‌ గాట్లిబ్laurengottlieb. ఈ భోజ్‌పూరి పవర్‌స్టార్‌ పవన్‌ సింగ్‌power star bhojpuri pawan singhతో కలిసి మ్యూజిక్ వీడియో చేసిన ముద్దుగుమ్మ రష్మిక మందనrashmika mandanna , అల్లుఅర్జున్‌ Allu Arjun స్టెప్పులేసిన సామి సామి పాటకు కాలిఫోర్నియాcaliforniaలోని రోడ్లపై బ్లాక్‌ టాప్‌ వేసుకొని స్టెప్పులు వేసింది. ఆ వీడియోని తన ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో వరల్డ్‌ వైడ్‌గా వైరల్ అవుతోంది పుష్ప సినిమాలోని సామి సామి అనే సాంగ్. ఆమె చేసిన డ్యాన్స్‌ వీడియోకి ఇప్పటికే రెండు లక్షల లైకులు వచ్చాయి. నిజంగా రష్మిక మందన చేసిన డ్యాన్స్‌కి ఎన్ని లైకులు వచ్చాయో తెలియదు కానీ..లారెన్‌ వేసిన స్టెప్పులతో పుష్ప ఫీవర్‌ ఫారెన్‌ వరకూ పాకిపోయిందంటున్నారు నెటిజన్లు.




పుష్ప ఫీవర్‌ ఓ రేంజ్‌కెళ్తోంది..
పుష్ప సినిమా ఓ ట్రెండ్ సెట్ చేస్తే..అందులోని పాటలు సెన్సేషన్‌ని క్రియేట్ చేస్తున్నాయి. ఫ్యాన్ ఇండియా సినిమాగా సుకుమార్ రూపొందించిన పుష్పకు ఇండియాతో పాటు ఫారిన్‌లో కూడా ఫ్యాన్స్‌ తయారైపోయారు. సెలబ్రిటీలు, స్పోర్ట్స్ స్టార్‌లు పుష్ప సినిమాలోని పాటలకు స్టెప్పులేస్తూ..డైలాగ్‌లను ఇమిటేట్‌ చేస్తున్నారు. ఇంతకు మించి ఏం కావాలి తెలుసు సినిమా గొప్పతనాన్ని చాటడానికి అంటున్నారు మూవీ క్రిటిక్స్.


పుష్ప సినిమాలో సాంగ్స్‌కు వస్తున్న క్రేజ్‌ చూస్తున్న అల్లు అర్జున్‌ ఫ్యాన్స్..పుష్ప పార్ట్-2 మూవీకి ఏ రేంజ్‌కి వెళ్తుందో అని  ఇప్పటి నుంచే అంచనాలు వేస్తున్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Allu arjun pushpa movie, Social Media

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు