నేటి నుంచి పోలీసులకు పండగే పండగ.. వారానికి ఒక రోజు ఇంట్లోనే..

AP Police: వారానికి ఒక రోజు కుటుంబంతో గడిపే అవకాశం పోలీసులకు ఇప్పుడు లభించింది. కానిస్టేబుల్‌ నుంచి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ వరకూ వారానికి ఒక రోజు సెలవు ఇస్తూ పోలీసుశాఖ నిర్ణయం తీసుకుంది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 19, 2019, 7:58 AM IST
నేటి నుంచి పోలీసులకు పండగే పండగ.. వారానికి ఒక రోజు ఇంట్లోనే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పండగొచ్చినా, పబ్బమొచ్చినా ఇంట్లో ఉండరు.. కుటుంబంతో గడపరు.. కనీసం ఆదివారం వస్తే పిల్లల్ని బయటికి తీసుకెళ్లి సినిమా చూపించే అవకాశం కూడా ఉండదు.. ఇదీ పోలీసుల దుస్థితి. ఈ దుస్థితి నుంచి పోలీసులకు ఏపీ సర్కారు ఉపశమనం కల్పించింది. వారమంతా కష్టపడి పనిచేస్తూ నరకం అనుభవిస్తున్న ప్రజా రక్షకులకు ఒక రోజు వీక్లీ ఆఫ్ అందుబాటులోకి వస్తోంది. అదీ.. నేటి నుంచే. వారానికి ఒక రోజు కుటుంబంతో గడిపే అవకాశం పోలీసులకు ఇప్పుడు లభించింది. కానిస్టేబుల్‌ నుంచి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ వరకూ వారానికి ఒక రోజు సెలవు ఇస్తూ పోలీసుశాఖ నిర్ణయం తీసుకుంది. అన్ని జిల్లాల పోలీసులతో మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు హెడ్‌ క్వార్టర్స్‌లో మంగళవారం చర్చించిన డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, ఎట్టకేలకు వీక్లీ ఆఫ్‌లకు పచ్చజెండా ఊపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని వేలాదిపోలీసు కుటుంబాల్లో సంతోషాలు వెల్లివిరియనున్నాయి.

ఏపీ పోలీసు శాఖలో మొత్తం 70వేల మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో కానిస్టేబుల్‌ నుంచి సీఐ స్థాయి వరకు ఈ రోజు నుంచి వీక్లీ ఆఫ్‌లు అమలు కానున్నాయి. వారాంతపు సెలవులను ఎక్కడా ఎస్‌హెచ్‌వోలు కాదనకుండా సాఫ్ట్‌వేర్‌ ద్వారా చార్ట్‌ సిద్ధం చేస్తున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీ నాటికి ఆయా స్టేషన్లో ఎవరెవరికి ఏ రోజు వీక్లీ ఆఫ్‌ ఉందో సీసీటీఎన్‌ఎస్‌ ద్వారా స్టేషన్‌కు వివరాలతో షీట్‌ అందుతుంది. డ్యూటీల వివరాలతో అందిన షీట్‌ స్టేషన్లోని నోటీసు బోర్డులో రైటర్‌ అతికిస్తారు. పర్యవేక్షణ అంతా అడిషనల్‌ ఎస్పీ(అడ్మిన్‌)కి అప్పగిస్తారు. ఎక్కడైనా సిబ్బంది కొరత ఉన్నా ఎస్‌హెచ్‌వోలు ఆయనకు చెప్పాలి తప్ప వీక్లీ ఆఫ్‌ తిరస్కరించకూడదు.

First published: June 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>