హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Land Rover: వచ్చే నెలలో భారత మార్కెట్లోకి ల్యాండ్ రోవర్ డిఫెండర్.. ధర రూ.69.99 లక్షల నుంచి ప్రారంభం

Land Rover: వచ్చే నెలలో భారత మార్కెట్లోకి ల్యాండ్ రోవర్ డిఫెండర్.. ధర రూ.69.99 లక్షల నుంచి ప్రారంభం

ల్యాండ్ రోవర్ డిఫెండర్‌(ఫొటో సోర్స్-Land Rover)

ల్యాండ్ రోవర్ డిఫెండర్‌(ఫొటో సోర్స్-Land Rover)

Land Rover: ప్రముఖ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ తమ నూతన ఎస్యూవీ మోడల్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ను అక్టోబర్ 15 న భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. కాగా ల్యాండ్ రోవర్ ఎస్యూవీ రెండు బాడీ స్టైల్స్లో అందుబాటులోకి రానుంది.

ఇంకా చదవండి ...

ప్రముఖ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ తమ నూతన ఎస్యూవీ మోడల్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ను అక్టోబర్ 15 న భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. కాగా ల్యాండ్ రోవర్ ఎస్యూవీ రెండు బాడీ స్టైల్స్లో అందుబాటులోకి రానుంది. 3 డోర్లు ఉండే షార్ట్ వీల్బేస్ -90 మరియు 5 డోర్లు ఉండే లాంగ్ వీల్బేస్ 110లలో ఈ ఎస్యూవీని అందుబాటులోకి తేనున్నారు. ల్యాండ్ రోవర్ 90 ధర రూ .69.99 లక్షలకు, ల్యాండ్ రోవర్ 110 ధర రూ .76.57 లక్షలకు అందుబాటులోకి రానుంది.

ల్యాండ్ రోవర్ డిఫెండర్ 90 మరియు 110 రెండూ ఐదు వేరియంట్లలో లభిస్తాయని కంపెనీ తెలిపింది. అక్టోబర్ 15న జరిగే లాంచింగ్ సమయంలో 5 డోర్ల ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110ను దేశవ్యాప్తంగా ఉన్న తమ బ్రాండ్ డీలర్లు ద్వారా డెలివరీ చేయనుంది. కాగా కోవిడ్–19 మహమ్మారి కారణంగా ల్యాండ్ రోవర్ 90 కార్ల డెలివరీలో కొంత ఆలస్యం కానుందని భావిస్తున్నారు.

ఈ రెండు డిఫెండర్లలోనూ 2.0- లీటర్ నాలుగు సిలిండర్స్ టర్బోచార్జిడ్ పెట్రోల్ ఇంజన్ అమర్చబడి ఉంటుంది. ఇది 300 హెచ్పి మరియు 400 ఎన్ఎమ్ టార్క్యును ఉత్పత్తి చేస్తుంది. అంతేకాక ఈ కారు 8 -స్పీడ్ ట్రాన్స్మిషన్తో జతచేయబడి ఉంటుంది. ల్యాండ్ రోవర్ యొక్క టెర్రైన్ రెస్పాన్స్ ఆల్-వీల్-డ్రైవ్ యూనిట్తో కూడా అందుబాటులోకి రానుంది. ల్యాండ్ రోవర్110 ఎయిర్ సస్పెన్షన్తో వస్తుంది.

ఈ కారు 10 అంగుళాల టచ్స్క్రీన్ మరియు హెడ్స్ అప్ డిస్ప్లేతో 12.3- అంగుళాల ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ను కలిగి ఉంటుంది. దీనిలో కనెక్టడ్ కార్ టెక్, మెరిడియన్ ఆడియో సిస్టమ్, ఎలక్ట్రికల్లీ అడ్జెస్టబుల్ మరియు హాటెడ్ ఫ్రంట్ సీట్లు, 360 డిగ్రీల సరౌండెడ్ కెమెరా మరియు ఎల్ఇడి హెడ్లైట్లు వంటి అడ్వాన్సుడ్ ఫీచర్స్ ఉన్నాయి.

దేశీయ మార్కెట్లో ఇప్పటికే ఉన్న జీప్ వ్రాంగ్లర్ మరియు మెర్సిడెస్ బెంజ్ జి 350 లకు ఈ కారు గట్టి పోటీ ఇవ్వనుంది. ప్రస్తుతం ల్యాండ్ రోవర్ బ్రాండ్కు భారత పోర్ట్ఫోలియోలో రేంజ్ రోవర్ వేలార్, రేంజ్ రోవర్ స్పోర్ట్, డిస్కవరీ, రేంజ్ రోవర్ కార్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా జాగ్వార్ ల్యాండ్ రోవర్కు 24 నగరాల్లో 27 అవుట్లెట్లను కలిగి ఉంది.

First published:

Tags: Automobiles

ఉత్తమ కథలు