హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

IPL 2021: చెన్నై క్రికెట్​ అభిమానుల్లో ఆసక్తికర చర్చ.. రజనీకాంత్​తో రుతురాజ్​ను పోల్చిన అభిమానులు

IPL 2021: చెన్నై క్రికెట్​ అభిమానుల్లో ఆసక్తికర చర్చ.. రజనీకాంత్​తో రుతురాజ్​ను పోల్చిన అభిమానులు

రుతురాజ్​, రజనీకాంత్​

రుతురాజ్​, రజనీకాంత్​

ఆసక్తికర చర్చ క్రికెట్​ అభిమానుల్లో నడుస్తోంది. చెన్నైకి గైక్వాడ్​లు ఎంతమంది వచ్చినా అందరూ విజయవంతం అవ్వాల్సిందే (All Gaikwads become super hit when they move to Chennai) అంటున్నారు. ఇంతకీ తమిళనాడులో సక్సెస్​ కొట్టిన గైక్వాడ్​ (Gaikwads)లు ఎవరో ఒకసారి తెలుసుకుందాం..

ఇంకా చదవండి ...

రుతురాజ్​ గైక్వాడ్ (Ruturaj Gaikwad)​. గత రెండు ఇండియన్​ ప్రీమియర్ లీగ్​ సీజన్ల నుంచి మారు మోగుతున్న పేరు. మహామహా జట్లపై పరుగుల వరద పారిస్తున్నాడు. గత ఐపీఎల్ (IPL) సీజన్​లో పరుగులు చేయడానికి, గెలవడానికి అపసోపాలు పడ్డారు చెన్నై సూపర్​కింగ్స్​ ప్లేయర్లు (Chennai super kings players). అయితే చివర్లో రుతురాజ్​ గైక్వాడ్​ మాత్రం అర్థ సెంచరీల మీద అర్థ సెంచరీలు చేసి తన సత్తా చాటాడు. అయితే ఈ సారి ఐపీఎల్ (IPL 2021)​లో కూడా తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్​లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు. అయితే ఇక్కడ మరో ఆసక్తికర చర్చ క్రికెట్​ అభిమానుల్లో నడుస్తోంది. చెన్నైకి గైక్వాడ్​లు ఎంతమంది వచ్చినా అందరూ విజయవంతం అవ్వాల్సిందే (All Gaikwads become super hit when they move to Chennai) . అది శివాజీరావ్​ గైక్వాడ్​ అయినా రుతురాజ్​ గైక్వాడ్​ అయినా అంటున్నారు. ఇంతకీ తమిళనాడులో సక్సెస్​ కొట్టిన గైక్వాడ్​ (Gaikwads)లు ఎవరో ఒకసారి తెలుసుకుందాం..

మహారాష్ట్ర నుంచి శివాజీ రావ్​ గైక్వాడ్​..

శివాజీ రావ్​ గైక్వాడ్ (Shivaji Rao Gaikwad)​. పేరు ఎక్కడో విన్నట్లుంది కదూ. అవును సూపర్​స్టార్​ రజనీకాంత్​ అసలు పేరు. సినీ ఇండస్ట్రీలోకి వచ్చాక ఆయన రజనీకాంత్ (Rajni kanth)​గా పేరు మార్చుకున్నారు. మహారాష్ట్ర నుంచి శివాజీ రావ్​ గైక్వాడ్​ తమిళనాడు (Tamilnadu)కు వచ్చాడు. తమిళ ఇండస్ట్రీని శాసించే స్థితికి చేరుకున్నాడు. ఇక రజనీకాంత్​ విషయానికొస్తే శివాజీ రావ్‌ పూర్వీకులది మహారాష్ట్ర (Maharashtra). తండ్రి రామోజీరావు గైక్వాడ్‌. పోలీసు కానిస్టేబుల్‌. తల్లి రమాబాయి గృహిణి. శివాజీ బెంగళూరులో జన్మించారు. దురదృష్టవశాత్తూ ఐదేళ్ల వయసులోనే తల్లిని పోగొట్టుకున్నారు.

శివాజీరావ్‌గా మద్రాసులో నటన శిక్షణ తీసుకుంటున్నప్పుడు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు! కాలే కడుపుతోనే కళామ తల్లిని నమ్ముకున్నారు. అవకాశాల కోసం ఎదురు చూశారు. అప్పుడే ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్‌ దృష్టిలో పడ్డారు. ఆయన ‘అపూర్వ రాగంగళ్‌’ చిత్రాన్ని తీసే పనిలో ఉన్నారు. శివాజీని కూడా ఆ సినిమాకు తీసుకున్నారు. అప్పటికే సినిమాల్లో శివాజీ పేరుతో నటుడు ఉండటంతో శివాజీ రావ్‌కు వేరే పేరు పెట్టాలనుకున్నారు. బాలచందర్‌ పేరు కోసం ఎక్కువసేపు ఆలోచించలేదు. ఆయన తీసిన సినిమా మేజర్‌ చంద్రకాంత్‌లో ఓ పాత్ర పేరు రజనీకాంత్‌. దీంతో ఈ పేరును శివాజీకి పెట్టాలని నిర్ణయించారు. దీంతో శివాజీ రావుకు ఇష్టదైవమైన రాఘవేంద్రస్వామిని ఆరాధించే గురువారం నాడు రజనీకాంత్‌గా నామకరణం చేశారు.  ఒక్కో మెట్టూ ఎక్కుతూ సూపర్​ స్టార్​గా ఎదిగాడు మన రజనీకాంత్ అలియాస్​ శివాజీరావ్​ గైక్వాడ్​. ఇపుడు ఇదే కోవలో రుతురాజ్ (Ruturaj)​ కూడా సీఎస్​కే జట్టు (CSK Team) తరఫున ఆడి సూపర్​ హిట్​ అయ్యాడని అభిమానులు చర్చించుకుంటున్నారు.

2019లో సీఎస్​కేకు..

రుతురాజ్​ గైక్వాడ్ (Ruturaj Gaikwad)​. మహారాష్ట్రలోని పుణేలో 1997 జనవరి 31న జన్మించాడు. చిన్నప్పటి నుంచి క్రికెట్ను ఇష్టపడే వ్యక్తి రుతురాజ్​. 2016లో రంజీలో మహారాష్ట్ర తరఫున అరంగేంట్రం చేశాడు. ఇండియా బీ టీమ్​కు ఆడాడు. అయితే 2019లో రుతురాజ్​ గైక్వాడ్​ను ఐపీఎల్​లో చెన్నై (Chennai) టీమ్​ సీఎస్​కే (CSK) కొనుగోలు చేసింది. అయితే అప్పటి టీమ్​లో అందరూ చెప్పుకోదగ్గ ప్లేయర్స్ (players)​ ఉండటంతో రుతురాజ్​కు ఎక్కువగా ఆడే అవకాశం రాలేదు. కానీ, 2020లో యూఏఈ (UAE)లో జరిగిన ఐపీఎల్​లో ఛాన్స్​ వచ్చింది. మొదటి మూడు మ్యాచ్​లలో తక్కువ పరుగులకే అవుటైనా తర్వాత తన విలువేంటో చూపాడు. ఇక ఈ ఏడాది ఐపీఎల్​ 2021లో తన విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. అదే బాటలో తన మొదటి ఐపీఎల్​ సెంచరీ (Century)ని రాజస్థాన్​ జట్టుపై నమోదు చేశాడు.

60 బంతుల్లోనే 101 పరుగులు..

ఓపెనర్‌గా వచ్చిన రుతురాజ్‌ గైక్వాడ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచి క్రీజులో ఉన్న గైక్వాడ్‌ కేవలం 60 బంతుల్లోనే 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇన్నింగ్స్‌ చివరి బంతికి భారీ సిక్సర్‌ కొట్టిన గైక్వాడ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గైక్వాడ్‌ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 5 భారీ సిక్సులున్నాయి. ఇక అంతకుముందు ముంబైపై జరిగిన మ్యాచ్​లోనూ రుతురాజ్​ చెలరేగిన సంగతి తెలిసిందే. దీంతో చెన్నైకి గైక్వాడ్​లు ఎంతమంది వచ్చినా అందరూ విజయవంతం అవ్వాల్సిందే (All Gaikwads become super hit when they move to Chennai) అంటున్నారు అభిమానులు.

First published:

Tags: Chennai, Chennai Super Kings, Cricket, Csk, IPL 2021, Rajnikanth

ఉత్తమ కథలు