HOME »NEWS »TRENDING »aliens on venus potential signs of life detected on the inhospitable planet sk gh

Aliens: శుక్రగ్రహంపై గ్రహాంతరజీవుల జాడ? వెలుగులోకి సంచలన విషయాలు

Aliens: శుక్రగ్రహంపై గ్రహాంతరజీవుల జాడ? వెలుగులోకి సంచలన విషయాలు
ప్రతీకాత్మక చిత్రం

పరిశోధకులు వాస్తవ జీవ రూపాలను కనుక్కోనప్పటికీ శుక్రగ్రహంపై ఫాస్ఫిన్ అనే జీవులు ఉన్నాయని ప్రాథమికంగా తేల్చారు. వాతావరణంలో అభివృద్ధి చెందుతున్న బ్యాక్టీరియా ద్వారా ఈ జీవులు ఉత్పత్తి అవుతున్నాయని గుర్తించారు.

 • Share this:
  భూమండలంపై మనుషులతో పాటు ఇతర జంతువులు, ఇతర జీవులు మనుగడ సాగిస్తున్నాయి. ఈ విశ్వంలో భూమితో పాటు అనేక గ్రహాలున్నాయి. ఇక్కడ మనుషులు జీవిస్తున్నట్లే ఇతర గ్రహాల్లో కూడా మనుషుల్లాంటి జీవులు జీవించి ఉండొచ్చు కాదా.. అనే విషయంపై పరిశోధన చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇటీవల దీనిపై అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలు శుక్రగ్రహం (Venus)పై కఠినమైన ఆమ్ల మేఘాలలో జీవుల ఉనికిని కనుగొన్నారు. పరిశోధకులు వాస్తవ జీవ రూపాలను కనుక్కోనప్పటికీ శుక్రగ్రహంపై ఫాస్ఫిన్ అనే జీవులు ఉన్నాయని ప్రాథమికంగా తేల్చారు. వాతావరణంలో అభివృద్ధి చెందుతున్న బ్యాక్టీరియా ద్వారా ఈ జీవులు ఉత్పత్తి అవుతున్నాయని గుర్తించారు. అంతర్జాతీయ శాస్త్రీయ బృందం మొదట హవాయిలోని జేమ్స్ క్లర్క్ మాక్స్‌వెల్ టెలిస్కో‌ప్‌ని ఉపయోగించి ఫాస్ఫిన్‌ను గుర్తించింది. చిలీలోని అటాకామా లార్జ్ మిల్లీమీటర్ /సబ్మిల్లిమీటర్ అర్రే రేడియో టెలిస్కోప్‌ను ఉపయోగించి దీనిని ధృవీకరించింది. నేచర్ ఆస్ట్రానమీ ప్రచురించిన జర్నల్‌లో ఈ ఆసక్తికర విషయాలు తెలిపారు.

  దీనిపై వేల్స్‌లోని కార్డిఫ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త జేన్ గ్రీవ్స్ మాట్లాడుతూ “ శుక్రగ్రహంపై జీవుల కదలిక చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. గ్రహాంతర జీవన ఉనికిపై ఎప్పటి నుండో సైన్స్‌కు ఉన్న ముఖ్యమైన ప్రశ్నలలో ఒకటి.'' అని అన్నారు. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మాలిక్యులర్ ఆస్ట్రోఫిజిసిస్ట్ మరియు స్టడీ సహ రచయిత క్లారా సౌసా-సిల్వా మాట్లాడుతూ .. "వీనస్ గ్రహంపై జీవుల కదలికపై చేస్తున్న రీసెర్చ్లో ఫాస్ఫిన్ అనే బ్యాక్టీరియా కదలిక చూసి నమ్మశక్యంగా లేనప్పటికీ ఇది చాలా అద్భుతంగా అనిపించింది.'' అని అన్నారు.  ఫాస్ఫిన్ -మూడు హైడ్రోజన్ అణువులతో కూడిన భాస్వరం అణువు- ప్రజలకు అత్యంత విషపూరితమైనది. ఈ పరిశోధన టెలిస్కోపులు, ఖగోళ వస్తువుల రసాయన శాస్త్రం మరియు ఇతర లక్షణాలను అధ్యయనం చేయడంలో శాస్త్రవేత్తలకు ఉపయోగపడింది.

  కాగా, శుక్రుడు వీనస్ భూమికి సమీప గ్రహం. ఈ గ్రహం భూమి కంటే కొంచెం చిన్నది. ఇది సూర్యుడి నుండి రెండవ గ్రహం. భూమి మూడవది. వీనస్ మందపాటి, విషపూరిత వేడి వాతావరణంలో ఉంటుంది. శుక్రుడిపై ఉపరితల ఉష్ణోగ్రతలు 880 డిగ్రీల ఫారెన్‌హీట్(471 డిగ్రీల సెల్సియస్)కు చేరుకుంటాయి. ఇక్కడ సీసం కరిగేంత వేడి ఉంటుంది. శుక్రుడి ఉపరితలంపై ఏ ప్రాణమూ మనుగడ సాగించదు అని సౌసా-సిల్వా అన్నారు. 86 డిగ్రీల ఫారెన్హీట్ (30 డిగ్రీల సెల్సియస్) చుట్టూ తేలికపాటి ఉష్ణోగ్రత ఉన్న ఎత్తైన మేఘాలు తీవ్ర ఆమ్లతను భరించగల వైమానిక సూక్ష్మజీవులను కలిగి ఉంటాయని కొందరు శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. ఈ మేఘాలు 90% సల్ఫ్యూరిక్ ఆమ్లం కలిగి ఉంటాయి.

  భూమిపై “వాయురహిత” వాతావరణంలో ఏర్పడే సూక్ష్మజీవులు - ఫాస్ఫిన్‌ను ఉత్పత్తి చేస్తాయి. వీటిలో మురుగునీటి మొక్కలు, చిత్తడి నేలలు, వరి పొలాలు, చిత్తడి నేలలు, సరస్సు అవక్షేపాలు మరియు అనేక జంతువుల విసర్జన మరియు పేగు వంటివి ఉన్నాయి. కొన్ని పారిశ్రామిక ప్రదేశాల్లో ఫాస్ఫిన్ జీవశాస్త్రపరంగా కూడా పుడుతుంది.
  భూమిపై ఫాస్ఫిన్ ఉత్పత్తి చేయడానికి ఖనిజాలు లేదా జీవ పదార్థాల నుండి బ్యాక్టీరియా ఫాస్ఫేట్ తీసుకొని హైడ్రోజన్‌ను జోడిస్తుంది. ''జీవ ప్రక్రియ అవసరం లేకుండా ఈ ఆవిష్కరణను చేయడానికి మేము మా వంతు కృషి చేశాము. మన ప్రస్తుత పరిజ్ఞానంతో, శుక్రగ్రహం మేఘాలలో ఫాస్ఫిన్ ఉనికిని వివరించలేము. దీని ఉపరితలం మరియు వాతావరణం ఆక్సిజన్ సమ్మేళనాలతో సమృద్ధిగా ఉంటాయి, ఇవి ఫాస్ఫిన్‌తో వేగంగా స్పందిచడంతో పాటు వాటిని నాశనం చేస్తాయి.'' అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published:September 15, 2020, 11:04 IST

  टॉप स्टोरीज