బాలీవుడ్ నటి అలియా భట్ ఎవరికి రాఖీ కట్టిందో తెలుసా?

Alia Bhatt - Raksha Bandhan | బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జొహర్ తనయుడికి రాఖీ కట్టి రక్షా బంధన్ సెలబ్రేట్ చేసుకుంది బాలీవుడ్ నటి అలియా భట్. ఇంతకీ వారి మధ్య అక్కా చెల్లెళ్ల అనుసంబంధం వెనుక కథేంటో తెలుసా?

news18-telugu
Updated: August 16, 2019, 11:19 AM IST
బాలీవుడ్ నటి అలియా భట్ ఎవరికి రాఖీ కట్టిందో తెలుసా?
కరణ్ జొహర్ తనయుడికి రాఖీ కట్టిన అలియా భట్
  • Share this:
బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జొహర్ సినీ సెలబ్రిటీలతో సత్సంబంధాలు కొనసాగిస్తాడు. కరణ్ జొహర్‌, ఆయన కుటుంబ సభ్యులతో బాలీవుడ్ నటి అలియా భట్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. కరణ్ తనకు పితృ సమానులుగా తరచూ చెబుతుంటుంది అలియా భట్. కరణ్ జొహర్ తనయుడు యష్ జొహర్, కుమార్తె రూహి జొహర్‌‌లు అలియా భట్‌‌ను అక్కలా భావిస్తుంటారు. రక్షా బంధన్ సందర్భంగా కరణ్ జొహర్ ఇంటికొచ్చిన అలియా భట్...యష్ జొహర్‌కు రాఖీ కట్టింది. ఈ ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. 

Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి
 

Just too much love.. ❤️


Alia 🌸 (@aliaabhatt) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది


గత ఏడాది కూడా యష్ జొహర్‌తో కలిసి రాఖీ సెలబ్రేట్ చేసుకుంది అలియా భట్. యష్‌కు అలియా భట్ రాఖీ కడుతున్న ఫోటోను ఇన్‌స్టాలో కరణ్ జొహర్ పోస్ట్ చేశారు. 
Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి
 

Big sister love!!!! @aliaabhatt and Yash!!!!❤️❤️❤️❤️ #happyrakshabandhan


Karan Johar (@karanjohar) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది

2012లో ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ చిత్రం ద్వారా అలియా భట్‌ను బాలీవుడ్‌కి పరిచయం చేసింది కరణ్ జొహరే. అప్పటి నుంచి వారిద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. అలియా భట్‌ను సినీ పరిశ్రమకు పరిచయం చేయడం ఒక్కటే కాదు...ఆమెతో సన్నిహిత బంధం కొనసాగిస్తున్నట్లు గతంలో కరణ్ తెలిపాడు. అలియా భట్ తనకు కుమార్తెతో సమానమని పేర్కొన్నాడు.

2017లో సరోగసీ ద్వారా కరణ్ జొహర్ కవల పిల్లలకు తండ్రి అయ్యారు. అప్పట్లో ట్విట్టర్‌లో స్పందించిన అలియా భట్...తనకు తమ్ముడు, చెల్లెలు పుట్టారంటూ సంతోషం వ్యక్తంచేసింది.

First published: August 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు