Viral News: మందు బాటిల్ మిస్సింగ్.. అమెరికా ప్రభుత్వం విచారణ

మద్యం బాటిల్​ (ఫైల్​)

ఓ మద్యం బాటిల్ కనిపించకుండా పోవడాన్ని అమెరికా ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీంతో దర్యాప్తునకు ఆదేశించింది. వెంటనే బాటిల్ జాడ కనిపెట్టాలని అధికారులకు హుకూం జారీ చేసింది. వినడానికి విచిత్రంగా ఉన్నా.. ఇది నిజం.

  • Share this:
    మందు బాటిల్​ మిస్సింగ్​.. ఘటనను అమెరికా ప్రభుత్వం సీరియస్​గా తీసుకుంది.. విచారణకు ఆదేశించింది. అవును మీరు విన్నది కరెక్టే.. అక్కడ కనిపించకుండా పోయింది మద్యం బాటిల్​.. అబ్బా ఒక్క బాటిల్​ కనిపించకుండా పోతే.. ఏకంగా ప్రభుత్వం విచారణ చేస్తుందా? అది కూడా అమెరికా ప్రభుత్వం.. అనుకుంటున్నారా? మీకు కలిగే సందేహాలు సరైనవే... అయితే ఏదో సాధారణ మందు బాటిల్​ అయితే ఊరుకునేదే.. ఆ మందు బాటిల్​ ఆషామాషీది​ కాదు.. ఆ బాటిల్​కు విశిష్ట చరిత్ర ఉంది.. విలువ కూడా ఎక్కువే.. ఎంత అంటారా .. ఓ 4 లక్షలు రూపాయలు.. అంత ఎక్కువ రేటు ఉంటే ఖచ్చితంగా పట్టుకోవాల్సిందే అంటారా?.. అందుకే అమెరికా ప్రభుత్వం విచారణ చేస్తోంది.  తొందరగా బాటిల్​ జాడ తెలుసుకోవాలని అధికారులకు హుకూం జారీచేసింది. అయితే అసలు ఆ మందు బాటిల్​ కథ ఏంటి.. అంత విశేషం ఏంటి.. అంత విలువ ఎందుకుంది? అసలు ఎలా కనిపించకుండా పోయిందో.. తెలుసుకుందాం..

    ఒక దేశానికి చెందిన కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు ఇతర దేశాల్లో పర్యటిస్తుంటారు. ఆయా దేశాల్లో వాణిజ్య ఒప్పందాలు, స్నేహ సంబంధాలు కుదుర్చుకోవడానికి పర్యటనలు చేస్తుంటారు. ఇదే సమయాల్లో అతిథులకు అక్కడి అధికారులు, ప్రభుత్వం విలువైన బహుమతులు ఇవ్వడం మామూలే. ఈ క్రమంలోనే అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ హయాంలో విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న మైక్ పాంపియ జపాన్​లో పర్యటించారు. ఆ పర్యటన సందర్భంగా జపాన్ ప్రభుత్వ అధికారులు 5,800 డాలర్లు (సుమారు రూ. 4 లక్షలు) విలువ చేసే ఓ మద్యం బాటిల్‌ను మైక్​కు బహుమతిగా ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఆ మద్యం బాటిల్ కనిపించకుండా పోయింది. దీంతో యూఎస్​ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అయితే జపాన్ ప్రభుత్వ అధికారులు మద్యం బాటిల్‌ను బహుమతిగా ఇచ్చిన సమయంలో మైక్ పాంపియో సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నారు. ఆ వైన్ సీసాను ఆయన నేరుగా తీసుకున్నారా? లేదా అనే విషయంపై స్పష్టత లేదని అమెరికాకు చెందిన ఓ వార్తా పత్రిక తన కథనంలో పేర్కొంది. కాగా.. 390 డాలర్ల కంటే తక్కువ విలువ చేసే బహుమతులను తీసుకున్నప్పుడు అమెరికా చట్టాల ప్రకారం అక్కడ ఎటువంటి అదనపు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ, అంతకుమించి విలువైన వస్తువులను బహుమతిగా తీసుకుంటే మాత్రం.. అక్కడి చట్టాల ప్రకారం డబుబ్లు చెల్లించి తీరాలి. అయితే అప్పటి ట్రంప్​ ప్రభుత్వం మాత్రం ఆ మద్యం బాటిల్‌కు డబ్బులు చెల్లించినట్లు ఎక్కడా పేర్కొనలేదు. దీనికి తోడు ప్రస్తుతం ఆ మందు బాటిల్ కూడా కనిపించకపోవడంతో యూఎస్​ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
    Published by:Prabhakar Vaddi
    First published: