Home /News /trending /

AKKINENI NAGARJUNA AND RANA NO 1 YAARI SHOW PROMO VIRAL ON INTERNET NR

Akkineni Nagarjuna : భార్యతో నటించిన సినిమాలెన్నో చెప్పలేకపోయిన నాగార్జున!

Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా ఈరోజు విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ట్విట్టర్ రివ్యూ పాజిటివ్‌గా వచ్చింది.

Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా ఈరోజు విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ట్విట్టర్ రివ్యూ పాజిటివ్‌గా వచ్చింది.

Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా ఈరోజు విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ట్విట్టర్ రివ్యూ పాజిటివ్‌గా వచ్చింది.

    Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా ఈరోజు విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ట్విట్టర్ రివ్యూ పాజిటివ్‌గా వచ్చింది. ఈ నేపథ్యంలోనే రానా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న నెంబర్ 1 యారి షో కు గెస్ట్‌లుగా హాజరయ్యారు అక్కినేని నాగార్జున. ఈ షో కు నాగార్జునతో పాటు వైల్డ్ డాగ్ ఫెమ్ సయామీ ఖేర్ కూడా వచ్చారు.

    అయితే సామాన్యంగానే రానా తన మాటలతో ఇతరుల మనసులో ఉన్న విషయాలను బయటపెట్టిస్తుంటారు. అలానే నెంబర్ 1 యారి రెండు సీజన్ లు సూపర్ హిట్ చేసారు. ఇప్పుడు సీజన్ 3లోను తన గెస్ట్ లను అందరిని తన మాటలతోనే మాయ చేస్తూ వారి నుంచి ఫన్నీగానే జవాబులు చెప్పుకుంటున్నారు రానా. ఇక అలానే ఫన్నీగానే అక్కినేని నాగార్జునతో కొన్ని విషయాలు బయటపెట్టించాడు.

    ఆదివారం ప్రసారం అవబోయే షో ప్రోమోను విడుదల అవ్వగా ఆ ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఆ ప్రోమోలో రానా అడగే ఒక్క ప్రశ్నకు కూడా నాగార్జున సమాధానం చెప్పకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆ ప్రశ్నలలో ఒకటి ''మీరు అమల గారు కలిసి ఎన్ని సినిమాల్లో నటించారు'' అని రానా ప్రశ్న వెయ్యగా ఆ ప్రశ్నకు నాగార్జున నాలుక కరుచుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.



    ఇక సయామీ ఖేర్ ను నాగార్జున గారికి ఎన్ని టాటూలు ఉన్నాయ్ అని అడగగా.. నాగార్జుననే తనకు తెలియదంటూ సమాధానం చెప్పాడు. అంతేకాదు.. సయామీ నటించిన తొలి తెలుగు సినిమా ఏది?, నాగార్జున బాల నటుడిగా నటించిన చిత్రాలెన్ని? ప్రశ్నలకు కూడా నాగార్జున సమాధానం చెప్పకపోవడంతో నెంబర్ 1 యారి ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Amala Akkineni, Nagarjuna Akkineni, Rana daggubati, Tollywood, Wild Dog Movie

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు