హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

దేశంలో కలకలం.. ముఖ్యమంత్రి సన్నిహితుడి ఇంట్లో 2 ఏకే 47 రైఫిల్స్.. ఎక్కడంటే..

దేశంలో కలకలం.. ముఖ్యమంత్రి సన్నిహితుడి ఇంట్లో 2 ఏకే 47 రైఫిల్స్.. ఎక్కడంటే..

దొరికిన మిషిన్ గన్

దొరికిన మిషిన్ గన్

Jharkhand: సీఎం అనుచరుడు ప్రేమ్ ప్రకాష్ పై మైనింగ్ ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో.. ఈడీ అధికారులు అతని ఇంట్లో సోదాలు నిర్వహించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Jharkhand, India

కొన్నిచోట్ల రాజకీయ నాయకులు తమ అధికారాలను, హోదాలను అడ్డంపెట్టుకుని, అడ్డమైన పనులు చేస్తున్నారు. అమాయక ప్రజలను, ఉద్యోగులను బెదిరిస్తు తమ అక్రమమైన పనులు చేసుకుంటారు. ఏవరైన అడ్డుపడితే, వారిపై తప్పుడు కేసులు బనాయించి, వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలో కొంత మంది మాత్రమే ధైర్యంగా ముందుకు వచ్చి, తాము ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల వరకు తీసుకెళ్తున్నారు. కొన్ని చోట్ల ఏకంగా ముఖ్యమంత్రి స్థాయి అధికారులు కూడా నేరాలకు పాల్పడుతున్నఘటనలు ఉంటున్నాయి. అంతేకాకుండా, తప్పులు చేస్తున్నవారికి ఇన్ డైరెక్ట్ గా కూడా వారికి చేయుత ఇస్తున్న సంఘటనలు గతంలో అనేకం జరిగాయి. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.


పూర్తి వివరాలు.. జార్ఖండ్ (Jarkhand) రాజధాని రాంచీలో సీఎం హేమంత్ సోరేన్.. సహాయకుడైన ప్రేమ్ ప్రకాశ్ పై 100 కోట్ల మేర అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారని పలు ఆరోపణలు వచ్చాయి. అయితే.. ఈక్రమంలో ఈడీ అధికారులు రంగంలోనికి దిగారు. జార్ఖండ్ లోని ప్రేమ్ కుమార్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో బీరువాలో 2 ఏకే 47 మిషన్ గన్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.తాజాగా, ఈ మిషన్ గన్ లను స్థానిక పోలీసుల వేనని రాంచీ అధికారులు స్పష్టం చేశారు. ఆగస్ట్ 23 న ప్రేమ్ కుమార్ మిత్రులు, అతని ఇంటికి వెళ్లారని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత.. వారు బీరువాలో పెట్టినట్లు పేర్కొన్నారు. అయితే.. వారు బైటకు వెళ్లి తిరిగి వచ్చేటప్పులు, ఇంట్లో ఏవో అధికారులు సోదాలు జరుగుతున్నాయని తెలిసి, ఇంటికి వెళ్లలేదని, అందుకు ఆయుధాలు తిరిగి తీసుకొలేదని పోలీసులు తెలిపారు. కాగా, సర్వీస్ మిషన్ గన్ పట్ల.. నిర్లక్ష్యంగా ప్రవర్తించినందుకు పోలీసులను తక్షణమే సస్పెండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Jarkhand, VIRAL NEWS

ఉత్తమ కథలు