హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా వడ్డింపు?... పెరగనున్న ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ రేట్లు?

ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా వడ్డింపు?... పెరగనున్న ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ రేట్లు?

ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా వడ్డింపు? పెరగనున్న ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ రేట్లు?

ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా వడ్డింపు? పెరగనున్న ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ రేట్లు?

పరిస్థితి బాలేదు. ఆర్థికంగా చాలా సమస్యలున్నాయి. దానికి తోడు కరోనా ఒకటి అనుకుంటున్న టెలికం సర్వీస్ ఆపరేటర్లు... టారిఫ్లు పెంచబోతున్నట్లు తెలిసింది.

  భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా... సెప్టెంబర్ నుంచి టారిఫ్‌ల రేట్లను పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి CNBC-TV18కి ప్రత్యేక వర్గాల ద్వారా సమాచారం అందింది. ఆ వివరాల ప్రకారం... రెండు టెలికం ఆపరేటర్లూ... ప్రత్యేక డేటా, కాలింగ్ ప్లాన్ల టారిఫ్‌లను 10 శాతం పెంచాలనుకుంటున్నట్లు తెలిసింది. ఈ కొత్త రేట్లను సెప్టెంబర్ లేదా అక్టోబర్ 2020 నుంచి అమల్లోకి తేవాలనుకుంటున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన అడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూ (AGR) బకాయిలు భారీగా ఉండటం వల్ల ఈ టెలికం కంపెనీలు ఆ భారాన్ని వినియోగదారులపై వేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ బకాయిల నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని ఈ కంపెనీలు... సుప్రీంకోర్టులో సుదీర్ఘకాలం వాదించాయి. కానీ సుప్రీంకోర్టు అందుకు ఒప్పుకోలేదు. AGR బకాయిలకు సంబంధించి సుప్రీంకోర్టు తొలి ప్రకటన వచ్చాక... వెంటనే ఎయిర్‌టెల్, వొడాఫోన్ కంపెనీలు ధరల పెంపు అంశాన్ని పరిశీలించాయి.

  తాజాగా మరోసారి ఈ కంపెనీలు పెట్టుకున్న అభ్యర్థనపై సుప్రీంకోర్టు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు తన తీర్పు ఇవ్వనుంది. జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పు ఇవ్వనుంది. బకాయిలపై మినహాయింపులు ఇవ్వాలా, లేక బకాయిలు కచ్చితంగా చెల్లించాల్సిందేనా అన్నదానిపై ఈ తీర్పు ఉండనుంది. ఐతే... సుప్రీంకోర్టు గత నిర్ణయం ప్రకారమే... ఇప్పుడూ తీర్పు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కేంద్రానికి చెల్లించాల్సిన బకాయిల చెల్లింపు గడువును మరింత పెంచే ఉద్దేశంతో అత్యున్నత న్యాయస్థానం లేదని సమాచారం. భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా... రెండూ... ఈ బకాయిలు చెల్లించేందుకు... 20 ఏళ్ల గడువు ఇవ్వాలని కోరాయి. కేంద్ర ప్రబుత్వ టెలికం విభాగం మాత్రం... టెలికం కంపెనీలు... ఎప్పటికప్పుడు బకాయిలు చెల్లించకుండా వాయిదా వేస్తూ వచ్చాయని చెబుతోంది.

  2019లో ఇండియాలోని అన్ని టెలికం ఆపరేటర్లూ... రకరకాల ప్లాన్ల ధరలను 10 నుంచి 40 శాతం పెంచుతూ ప్రకటనలు జారీ చేశాయి. CNBC-TV18 రిపోర్ట్ ప్రకారం... రెవెన్యూ కార్యకలాపాలు సాగాలంటే... టారిఫ్‌ల ధరలను పెంచక తప్పదని ఈ రెండు కంపెనీలూ భావిస్తున్నట్లు తెలిసింది. ఐతే... ఇవి ఊహాగానాలు మాత్రమేననీ, వీటికి ఎలాంటి ఆధారాలూ లేవని వొడాఫోన్-ఐడియా ప్రతినిధి చెప్పినట్లు రిపోర్టు తెలిపింది. ఈ అంశంపై భారతీ ఎయిర్‌టెల్ మాత్రం స్పందించలేదు.

  టెలికం ప్లాన్లకు సంబంధించి ప్రపంచంలో అత్యంత పోటీ మార్కెట్ ఉన్న దేశాల్లో ఇండియా ఒకటి. మన దేశంలో 1 జీబీ డేటా ధర సగటున రూ.3 దాకా ఉంది. ఆపరేటర్లు ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లాన్లతోపాటూ... అన్‌లిమిటెడ్ కాలింగ్, నేషనల్ రోమింగ్, కంటెంట్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లను... ఇతర ప్లాన్లతో కాంప్లిమెంటరీ ప్లాన్లుగా ఆఫర్ చేస్తున్నారు.

  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Airtel recharge plans, Vodafone Idea

  ఉత్తమ కథలు