Video: అక్కడ విమానం ల్యాండింగ్ చూస్తే వణికిపోవాల్సిందే

కొన్ని విమానాల ల్యాండింగ్ దృశ్యాలను 'Cargospotter' యూట్యూబ్ ఛానెల్ రికార్డ్ చేసి అప్‌లోడ్ చేసింది. ఈ వీడియోను ఇప్పటికే సుమారు 24 లక్షల మంది చూడటం విశేషం.

news18-telugu
Updated: July 17, 2019, 5:51 PM IST
Video: అక్కడ విమానం ల్యాండింగ్ చూస్తే వణికిపోవాల్సిందే
Video: అక్కడ విమానం ల్యాండింగ్ చూస్తే వణికిపోవాల్సిందే (image: Cargospotter/youtube)
news18-telugu
Updated: July 17, 2019, 5:51 PM IST
విమానం టేకాఫ్ లేదా ల్యాండింగ్ అవడం దూరం నుంచి చూస్తేనే థ్రిల్లింగ్‌గా ఉంటుంది. మరి అలాంటిది ఫ్లై ల్యాండింగ్ లేదా టేకాఫ్‌ను దగ్గరగా చూస్తే ఎలా ఉంటుంది? వణుకు పుట్టాల్సిందే. గ్రీస్‌ దేశంలో స్కియాతోస్ పేరుతో ఓ ఎయిర్‌పోర్ట్ ఉంది. ఆ ఎయిర్‌పోర్ట్ పక్కనే బీచ్ ఉంది. బీచ్‌లో ఉన్న టూరిస్టుల మీది నుంచి ఫ్లైట్ ల్యాండింగ్ అవుతుంటే వణుకు పుట్టడం ఖాయం. అక్కడ విమానం ల్యాండింగ్ చూసేందుకు టూరిస్టులు క్యూ కడుతుంటారు. తమ తలల పైనుంచి ప్లైట్ ల్యాండ్ అవడం చూసి ఎంజాయ్ చేస్తుంటారు. ఫ్లైట్ ల్యాండ్ అవుతున్న దృశ్యాలను కెమెరాలో బంధిస్తారు. సెల్ఫీలు క్లిక్‌మనిపిస్తారు. ఆ దృశ్యాలను ఇక్కడ చూడండి.

ఈ వీడియోను 'Cargospotter' యూట్యూబ్ ఛానెల్ నాలుగురోజుల క్రితం పోస్ట్ చేసింది. కొన్ని విమానాల ల్యాండింగ్ దృశ్యాలను 'Cargospotter' యూట్యూబ్ ఛానెల్ రికార్డ్ చేసి అప్‌లోడ్ చేసింది. ఈ వీడియోను ఇప్పటికే సుమారు 24 లక్షల మంది చూడటం విశేషం. బ్రిటీష్ ఎయిర్‌వేస్‌కు చెందిన Embraer E190 విమానం ల్యాండ్ అయ్యే సమయంలో ప్రయాణికులు భయంతో గోడపై నుంచి దూకేసిన దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. టూరిస్టులకు కొన్ని అడుగుల ఎత్తులో విమానాలు ల్యాండ్ అవుతున్న దృశ్యాలు అబ్బురపరుస్తున్నాయి. బీచ్ పక్కనే ఎయిర్‌పోర్ట్ ఉండటంతో విమానం ల్యాండింగ్ దృశ్యాలను కళ్లారా చూసేందుకు టూరిస్టులు వస్తుంటారు.

Redmi K20 Pro: రెడ్‌మీ కే20 ప్రో ఎలా ఉందో చూడండి...




ఇవి కూడా చదవండి:

FASTags: హైవేపై వెళ్తున్నారా? ఇక 'ఫాస్ట్‌ట్యాగ్' తప్పనిసరి

Gold Phone: స్వచ్ఛమైన బంగారం, వజ్రాలతో స్మార్ట్‌ఫోన్... ధర రూ.4,80,000

DRDO Scholarship: అమ్మాయిలకు డీఆర్‌డీఓ స్కాలర్‌షిప్... వివరాలివే
First published: July 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...