చైనాలోని (China) హుబేయ్ లో ఘోర విమాన ప్రమాదం (Plane crashes) సంభవించింది. జె-7 విమానం శిక్షణ సమయంలో ఒక్కసారిగా కూలి కిందపడిపోయింది. ఈ ఘటన ఈరోజు (గురువారం) జరిగింది. దీంతో అనేక గృహాలకు మంటలు వ్యాపించాయి. విమానాశ్రయానికి సమీపంలోని లాహెకౌ నగరంలో విమానం కూలిపోయింది. కాగా, విమానం నుంచి పైలట్‌కు పారాచూట్ తీయడంతో స్వల్ప గాయాలైనట్లు హాంకాంగ్‌కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ చైనా అధికారిక మీడియాను ఉటంకిస్తూ పేర్కొంది. ప్రమాద స్థలంలో అనేక ఇళ్లు అగ్నికి ఆహుతైనట్లు చైనా సోషల్ మీడియాలో వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.
అత్యవసర విభాగం సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని నివేదిక పేర్కొంది. ఈ ఏడాది మార్చి నుంచి చైనాలో విమానాలు ప్రమాదానికి గురికావడం ఇది మూడోసారి. గత నెలలో, దేశంలోని నైరుతి చాంగ్కింగ్ నగరంలో టేకాఫ్ అవుతుండగా, 122 మందితో చైనాకు చెందిన టిబెట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ప్యాసింజర్ విమానం రన్‌వేపై నుంచి దూసుకెళ్లి మంటలు చెలరేగడంతో 40 మందికి పైగా గాయపడ్డారు. అదే విధంగా, మార్చి 12న, కున్మింగ్ నుంచి గ్వాంగ్జౌకి వెళ్లే బోయింగ్ 737 విమానం గ్వాంగ్సీ జువాంగ్ స్వయం ప్రతిపత్త ప్రాంతంలోని టెంగ్జియాన్ కౌంటీలో కూలిపోయింది. తొమ్మిది మంది సిబ్బందితో సహా విమానంలో ఉన్న మొత్తం 132 మంది మరణించారు.
ఇదిలా ఉండగా పాక్ కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి పది తర్వాత పెళ్లి వేడుకలపై పలు కీలక సూచనలను చేసింది.
పాకిస్థాన్ లో (Pakistan) కొన్ని నెలలుగా రాజకీయ సంక్షోభంతో, ఆర్థిక వ్యవస్థ (Economic crisis) కూడా దిగజారుతుంది. దీంతో అక్కడి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో నూతన ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. తన మంత్రులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో..ప్రధానంగా దేశం ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు పలు కొత్త విధానాలను పాటించాలని నిర్ణయించారు. దీనిలో ప్రధానంగా.. విద్యుత్ వినియోగం తగ్గించాలని నిర్ణయించారు. ఇందు కోసం రాత్రి 10 తర్వాత వివాహ వేడుకలు జరుపుకోవడానికి అనుమతి నిరాకరించారు.
అదే విధంగా, మార్కెట్ లను రాత్రి 8.30 గంటలకు మూసివేయాలని వ్యాపారులకు ఆదేశించారు. దీంతో విద్యుత్ వినియోగం తగ్గి , విద్యుత్ సంక్షోభం గాడిలో (Electricity crisis) పడుతుందని భావిస్తున్నారు. అదే విధంగా, పాక్ లో ప్రస్తుతం.. ఉత్పత్తి అవుతున్న విద్యుత్ 22,000 మెగావాట్లు కాగా, 26,000 మెగావాట్ల అవసరం ఉందని, దేశంలో దాదాపు 4,000 మెగావాట్ల విద్యుత్ కొరత విద్యుత్ శాఖ మంత్రి ఖుర్రుమ్ దస్తగిర్ తెలిపారు. ఇక మీదట కూడా గతంలో మాదిరిగానే క్యాబినేట్ ప్రభుత్వ కార్యాలయాలకు శనివారం కూడా సెలవు దినాలను పునరుద్ధరించాయి.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.