హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Crorepati For a Day: డబ్బే డబ్బు.. వ్యక్తి డీమ్యాట్ అకౌంట్‌లోకి రూ.11,677 కోట్లు.. ఆ తర్వాత జరిగింది ఇదే..

Crorepati For a Day: డబ్బే డబ్బు.. వ్యక్తి డీమ్యాట్ అకౌంట్‌లోకి రూ.11,677 కోట్లు.. ఆ తర్వాత జరిగింది ఇదే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Crorepati For a Day: ఓ సాధారణ వ్యక్తి తన డీమ్యాట్‌ అకౌంట్‌(Demat Account) బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకున్నప్పుడు కొన్ని రూ.వందల కోట్లు కనిపిస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇలాంటి అనుభవమే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ వ్యక్తికి ఎదురైంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఓ సాధారణ వ్యక్తి తన డీమ్యాట్‌ అకౌంట్‌(Demat Account) బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకున్నప్పుడు కొన్ని రూ.వందల కోట్లు కనిపిస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇలాంటి అనుభవమే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ (Ahmedabad)లో ఓ వ్యక్తికి ఎదురైంది. బ్యాంకింగ్‌ సిస్టమ్‌లో జరిగిన పొరపాటు వల్ల అతని డీమ్యాట్‌ అకౌంట్‌లోకి రూ.11,677 కోట్లు డిపాజిట్‌ అయ్యాయి. అయితే తన అకౌంట్‌లోకి అంత డబ్బు ఎలా వచ్చింది అనే ఆశ్చర్యం, ఆనందం కొన్ని గంటలే మిగిలాయి. పొరపాటును గుర్తించిన బ్యాంక్‌, డిపాజిట్‌ చేసిన డబ్బును వెనక్కి తీసుకుంది. దీంతో ఆ వ్యక్తి ఒక్కరోజు కోటీశ్వరుడిగా మారారని స్థానికులు చెబుతున్నారు.

బ్యాకింగ్‌ సిస్టమ్‌లో ఇలాంటి పొరపాట్లు అరుదుగా జరుగుతుంటాయి. ఇంతకుముందు చాలా సార్లు ఇలాంటి ఘటనలు జరిగాయి. కొన్ని సందర్భాల్లో చాలా రోజుల వరకు బ్యాంకులు తప్పులను గుర్తించలేదు. బ్యాంక్‌ అకౌంట్‌లో అనుకోకుండా డిపాజిట్‌ అయిన డబ్బును వినియోగదారులు విత్‌డ్రా చేసుకుని ఖర్చు చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా ఇలాంటి పొరపాటు అహ్మదాబాద్‌లో పునరావృతం అయింది. బ్యాంకింగ్‌లో జరిగిన ఒక పొరపాటుతో సాగర్ రమేష్ అనే వ్యక్తి ఒకరోజులో కోటీశ్వరుడు అయ్యాడు.

* భారీగా అమౌంట్ క్రెడిట్

రమేష్ సాగర్ ఆరేళ్లుగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఏడాది క్రితం కోటక్ సెక్యూరిటీస్‌(Kotak Securities)లో డీమ్యాట్ అకౌంట్‌ ఓపెన్‌ చేశాడు. నెల రోజుల క్రితం సాగర్‌ తన డీమ్యాట్‌ అకౌంట్‌ చెక్ చేసుకోగా ఏకంగా రూ.116,77,24,43,277.10 కోట్లు ఉన్నట్లు కనిపించింది. దీంతో అతడు ఆశ్చర్యపోయాడు. అతని అకౌంట్‌లో ఆ మొత్తం ఎనిమిది గంటలకు పైగా ఉంది.

దీని గురించి రమేష్‌ సాగర్‌ మాట్లాడుతూ.. ‘2022 జులై 26న నా డీమ్యాట్‌ అకౌంట్‌లో రూ.116,77,24,43,277.10 బ్యాలెన్స్‌ కనిపించింది. అందులో నుంచి రూ.రెండు కోట్లు నేను స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసి రూ.ఐదు లక్షల లాభం పొందాను. అదే రోజు సాయంత్రం 8 నుంచి 8.30 గంటల సమయంలో, బ్యాంక్ పొరపాటున డిపాజిట్‌ చేసిన మొత్తాన్ని వెనక్కి తీసుకుంది.’ అని చెప్పారు.

 ఇది కూడా చదవండి : గుడ్ న్యూస్.. టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచిన బ్యాంక్ ఆఫ్ బరోడా.. కొత్త వడ్డీ రేట్లు ఇవే..

* మార్జిన్‌ అప్‌డేట్‌లో సమస్య

జులై 26న తనకు బ్యాంక్‌ నుంచి ఓ నోటిఫికేషన్‌ వచ్చిందని తెలిపారు. యాప్‌ మార్జిన్ అప్‌డేట్‌లో సమస్య ఉందని, ఆర్డర్‌లను కొనసాగించవచ్చు కానీ చూపిన మార్జిన్ అప్‌టేడ్‌ కాదని అందులో ఉంది. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తున్నామనే వివరాలు ఉన్నాయి. ఈ సమస్యతో ఆ రోజు రమేష్‌ సాగర్‌తో పాటు మరి కొంత మంది డీమ్యాట్‌లో అకౌంట్లలో కూడా ఎక్కువ మొత్తంలో అమౌంట్‌ క్రెడిట్ అయ్యే అవకాశం ఉంది.

ఈ అంశంపై పశ్చిమ జోనల్ కార్యాలయం (ముంబై) కోటక్ సెక్యూరిటీస్ స్పందన కోరడానికి IANS ప్రయత్నించింది. అయితే పెట్టుబడిదారుడి పాన్ కార్డ్ లేదా డీమ్యాట్ అకౌంట్ నంబర్ క్లెయిమ్‌ను ధ్రువీకరించడం, సమస్యపై మాట్లాడటం సాధ్యం కాదని అధికారులు ఫోన్‌లో తెలిపారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Demat Account, Gujarat, Trending news, VIRAL NEWS

ఉత్తమ కథలు