హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

ఆహా..బాలయ్య ఒక్క ఛాన్స్‌ ప్లీజ్..లెజెండ్‌ని రిక్వెస్ట్ చేసిన వివాదాస్పద డైరెక్టర్

ఆహా..బాలయ్య ఒక్క ఛాన్స్‌ ప్లీజ్..లెజెండ్‌ని రిక్వెస్ట్ చేసిన వివాదాస్పద డైరెక్టర్

Photo Credit:Twitter

Photo Credit:Twitter

RGV: మొదటి సారి ఆయనలో మార్పు వచ్చింది. . ఓ స్టార్‌ హీరో చేస్తున్న టాప్‌ ప్రోగ్రామ్‌ నాకు ఎంతో నచ్చేసిందంటూ ఆకాశానికి ఎత్తేశారు. అంతే కాదు తనకు ఆ ప్రోగ్రామ్‌లో పాల్గొనే అవకాశం కల్పించండి అంటూ విజ్ఞప్తి చేశారు. ఇంతకీ రిక్వెస్ట్ చేసిన కాంట్రవర్సీ పర్సన్‌ ఎవరో కాదు రాంగోపాల్‌వర్మ.

ఇంకా చదవండి ...

సంచలన దర్శకుడు రాంగోపాల్‌వర్మ (Rangopal Varma) ఆశ పడుతున్నారు. ఎవరితోనైనా, ఎక్కడైనా కొంటెగా, వెటకారంగా, సెటైరికల్‌గా మాట్లాడే ఆర్జీవీ బాలయ్య విషయంలో ఓ మెట్టుదిగారు. టీవీ షోలు, పొలిటికల్ న్యూస్‌ అప్‌డేట్స్‌ పట్ల కూడా చాలా సిల్లీ కామెంట్స్‌ చేసే వర్మ ఒక్కసారిగా నందమూరి బాలకృష్ణ(Nandamuri balakrishna)కు వీరాభిమానిగా మారిపోయారు. ఆహా ఓటీటీలో వస్తున్న అన్‌స్టాపబుల్‌ ఎన్‌బీకే (Unstoppable nbk)ప్రోగ్రామ్‌కు బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు (Rangopal Varma). బాలయ్య వ్యాఖ్యాతగా చేస్తున్న ఆ పోగ్రామ్‌ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. ప్రతి దాన్ని విమర్శనాత్మక కోణంలో చూసే వర్మ..బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌ ప్రోగ్రామ్‌ని మాత్రం అందనంత ఎత్తుకు ఎత్తేశారు. ఇదో స్ట్రాటో ఆవరణ ప్రోగ్రామ్ అంటూ కితాబిచ్చారు కాంట్రవర్సీ డైరెక్టర్ వర్మ. అన్‌స్టాపబుల్‌లో సెలక్టెటెడ్ సెలబ్రిటీలతో బాలకృష్ణ చేస్తున్న ఇంటర్వూలు, అందులో అడుగుతున్న ప్రశ్నలు, వారితో చేస్తున్న తమషాలతో ఆ ప్రోగ్రామ్‌ నందమూరి ఫ్యాన్స్‌కి , ఆడియన్స్‌కి విపరీతంగా నచ్చేసింది. ఆ ప్రోగ్రామ్‌కి ఓ ప్రత్యేకత ఏర్పడింది. అలాంటి అన్‌స్టాపబుల్‌ ఎన్‌బీకే ప్రోగ్రామ్‌ అంటే తనకెంతో ఇష్టమని చెప్పారు వర్మ. తన ట్విట్టర్‌ (Twitter)ఖాతాలో ఈ పోస్ట్‌ని షేర్ చేసుకున్నారు.

ఆహా ఆ షో అదిరింది..

అంతే కాదు బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాపబుల్‌ ప్రోగ్రామ్‌ అంతరిక్షం స్థాయికి వెళ్లిపోయిందని..తనకు ఆ షోలో పాల్గొనాలని ఉందంటూ మనసులో మాట బయటపెట్టారు రాంగోపాల్‌వర్మ. బాలయ్యగారు నాకు ఓ అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాను అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు ఆర్జీవీ. నిజంగా రాంగోపాల్‌వర్మ రిక్వెస్ట్‌ని బాలయ్య, ఆహా నిర్వాహకులు స్వాగతిస్తారో లేదో చూడాలి. ఒకవేళ ఆర్జీవీతో ఇంటర్వూ చేయాల్సి వస్తే బాలయ్య రేంజ్‌ ప్రశ్నలకు రాంగోపాల్‌వర్మ సమాధానాలు స్ట్రెయిట్‌గా చెబుతారా లేక అన్నీ షోలు, లైవ్‌ చాట్‌లకు వెళ్లి చెప్పినట్లుగా ఉంటందా అనే చర్చ మొదలైంది.


నాకో ఛాన్స్‌ ఇవ్వండి బాలయ్య..

అటు బాలయ్య, ఇటు రాంగోపాల్‌వర్మ ఇద్దరు డిఫరెంట్‌ మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు కావడంతో ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితే బాగుంటుందని చాలా సోషల్ మీడియా వేదిక ద్వారా తమ అభిప్రాయాల్ని బయటపెడుతున్నారు. మరికొందరైతే ..నువ్వు ఆ ప్రోగ్రామ్‌కి హోస్ట్‌గా వ్యవహరిస్తావా అంటూ వర్మపై సెటైర్ వేస్తున్నారు. మరికొందరైతే నిన్ను ఇంటర్వూ చేయడానికి ఏముంటుంది అంతా టైమ్‌ వేస్ట్‌ తప్ప అని మరొకరు రిప్లైలు ఇస్తున్నారు. మరికొందరైతే ఏకంగా మీ ఇద్దరితో షో నడిపితే ఎవరి ప్రతాపం వాళ్లు చూపిస్తారు అంటూ ఇద్దర్ని కార్నర్‌ చేసి కామెంట్స్ చేస్తున్నారు.

First published:

Tags: Bala Krishna, RGV, Unstoppable NBK

ఉత్తమ కథలు