హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

OMG: తగ్గెదేలే.. ముచ్చటగా నాలుగో పెళ్లికి రెడి ఐన ఉపాధ్యాయుడు.. మూడో భార్య ఏం చేసిందంటే..

OMG: తగ్గెదేలే.. ముచ్చటగా నాలుగో పెళ్లికి రెడి ఐన ఉపాధ్యాయుడు.. మూడో భార్య ఏం చేసిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Uttar pradesh: విద్యార్థులకు ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయుడే దారితప్పాడు. ఇప్పటి వరకు మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇక ఆత్రం ఆపుకోలేక నాలుగో వివాహం కోసం కూడా సిద్ధపడ్డాడు.

కొందరికి ఒక పెళ్లి (Wedding) కావడానికి తల ప్రాణం తొకకు వస్తుంది. కానీ కొందరు మాత్రం.. యువతులకు మాయ మాటలు చెప్పి పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుంటారు. ఇప్పటి కాలంలో పెళ్ళి  (Marriage) జరగాలన్న రాసి పెట్టుండాలని కొందరు అనుకుంటున్నారు. అలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నవారికే తమ కూతురిని ఇస్తామంటూ కొందరు భీష్మీంచుకొని కూర్చుకుంటున్నారు. ఇక మరికొందరు.. అనేక గొంతెమ్మ కోరికలతో వచ్చిన సంబంధాలను ఏదొ ఒక వంకతో పోగొట్టుకుంటున్నారు. కొన్ని చోట్ల దంపతులలో ఏవైన శారీరక సమస్యలు ఉంటే మరో పెళ్లి చేసుకుంటున్నారు. ఇలాంటి కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ లో  (Uttar pradesh) ఈ ఘటన జరిగింది. షాహ్ గంజ్ పరిధి లోని (Agra teacher) స్థానిక పాఠశాలలో ఒక వ్యక్తి ఉపాధ్యాయుడిగా (Teacher Fourth wedding) పనిచేస్తున్నాడు. అతనికి పిల్లలంటే ఎంతో  ప్రేమ. సదరు వ్యక్తికి 20 ఏళ్ళ క్రితం పెళ్లయ్యింది. ఆ తర్వాత.. ఐదేళ్లు ఒపిక పట్టాడు. కానీ అతనికి పిల్లలు కల్గలేదు. ఇక లాభం లేదని భార్యతో గొడవ పెట్టుకున్నాడు. ఇతని వేధింపులు భరించలేక భార్య, తన చెల్లెలినిచ్చి పెళ్లి చేయించింది. ఆ తర్వాత.. మూడేళ్లు ఒపిక పట్టాడు. మళ్లీ సేమ్ అలాగే జరిగింది. ఆమెకు పిల్లలు కల్గలేదు. ఈ క్రమంలో ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నాడు. ఆమెను పెళ్లి అయినప్పటి నుంచి పిల్లల కోసం వేధించసాగాడు. తరచుగా ఆస్పత్రికి వెళ్లి టెస్టులు చేయించేవాడు.  ఈ క్రమంలో మొదటి భార్య ఇతని చేష్టలు భరించలేక విడాకులు ఇచ్చేసింది.

ఇద్దరు భార్యలను టెస్ట్ చేయించిన వైద్యులు వీరిలో ఎలాంటి లోపం లేదని పిల్లలు కల్గుతారని చెప్పారు. కానీ ఉపాధ్యాయుడు ఉండబట్టలేక పోయాడు. తాను వెంటనే పిల్లలను కని వారితో నాన్న.. అని పిలిపించుకోవాలని (fatherhood) మరో ప్లాన్ వేశాడు. వెంటనే నాలుగో పెళ్లికి సిద్దపడ్డాడు. ఈ నెల 12 న నాలుగో వివాహానికి ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు. ఈ విషయంకాస్త .. రెండో, మూడో భార్యకు తెలిసింది. దీంతో వారికి చిర్రెత్తుకొచ్చింది. వెంటనే స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళ్లి భర్త ఘన కార్యంపై ఫిర్యాదు చేశారు. దీంతో ఉపాధ్యాయుడిని పోలీసులు ..స్టేషన్ కు రప్పించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

First published:

Tags: Marriages, Teacher, Uttar pradesh, VIRAL NEWS

ఉత్తమ కథలు