Viral News: ఆమె వయసు 61.. అతడి వయసు 24.. ప్రేమలో పడ్డ జంట.. వీరి రొమాన్స్‌ చూసి నెటిజన్లు షాక్..

Photo Credit : Face Book

Viral News: మనవళ్లు మనవరాళ్లతో ఆడుకుంటూ సమయం గడపాల్సిన ఈ వృద్ధ మహిళ.. నాకు ఒక బాయ్ ఫ్రెండ్ కావాలి అంటూ డాన్స్ చేస్తూ టిక్ టాక్ లో వీడియోలు చేస్తుండేది. ఆమె వీడియోలను మెక్ కెయిన్ షూట్ చేస్తుండేవాడు.

  • Share this:
ప్రేమ గుడ్డిది అని ఇప్పటికే ఎన్నో సంఘటనలు నిరూపించాయి. తమకు కులమతాలతో పాటు వయసుతో కూడా సంబంధం లేదని ప్రేమికులు నిరూపిస్తూనే ఉన్నారు. అయితే తాజాగా మరో ప్రేమ విషయం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. అమెరికాకు చెందిన 24 ఏళ్ల కుర్రాడు తన బామ్మ వయసున్న ఓ 61 ఏళ్ల మహిళతో ప్రేమలో పడ్డాడు. ఆమె కూడా అతడిపై మనసు పారేసుకోవడం విశేషం. రామాక్రిష్ణా అంటూ శేషజీవితాన్ని గడిపేయాల్సిన ఈ వృద్ధురాలు ప్రేమకు వయసుతో సంబంధం ఏంటోయ్ అంటూ తన ప్రియుడితో చెట్టపట్టాలేసుకుని తిరుగుతోంది. దీంతో ఈ జంటను చూసినవారు అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు!వివరాల్లోకి వెళితే.. ఈ 61 ఏళ్ల బామ్మ పేరు చెరిల్‌.. ఈమెతో ప్రేమలో పడ్డ యువకుడి పేరు మెక్ కెయిన్. వీరిద్దరి మధ్య 37 సంవత్సరాల వయో భేదం ఉంది. చెరిల్‌ కుమారులలో ఒకరు మెక్ కెయిన్ కంటే పెద్దవాడు. ప్రస్తుతం ఆమెకు 17మంది మ‌న‌వ‌ళ్లు, మ‌న‌వ‌రాళ్లు కూడా ఉన్నారు.

అయితే మనవళ్లు మనవరాళ్లతో ఆడుకుంటూ సమయం గడపాల్సిన ఈ వృద్ధ మహిళ.. నాకు ఒక బాయ్ ఫ్రెండ్ కావాలి అంటూ డాన్స్ చేస్తూ టిక్ టాక్ లో వీడియోలు చేస్తుండేది. ఆమె వీడియోలను మెక్ కెయిన్ షూట్ చేస్తుండేవాడు. మెక్ కెయిన్‌కి 15 ఏళ్ల వ‌య‌సు ఉన్న‌ప్పుడే.. చెరిల్‌తో స్నేహబంధం ఏర్పడింది. వారి స్నేహం ప్రేమగా చిగురించడానికి కొంత సమయం పట్టిందట.

ఇది కూడా చదవండి : లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లంచ్ మెనూ ఇదే.. క్రికెటర్లకు వడ్డించే పదార్థాలు ఏంటంటే..

ఒకానొక సమయంలో ఆమె సరిగా డాన్స్ చేయలేకపోయిందట. దీంతో ఆమెకు డాన్స్ ఎలా చేయాలో కెయిన్ దగ్గరుండి నేర్పించాడట. ఈ సమయంలోనే వారి మధ్య ప్రేమ పుట్టిందట. ఇక ఆ తర్వాత ఇద్దరూ తమ వయసులను పూర్తిగా మర్చిపోయి గాఢంగా ప్రేమించుకోవడం ప్రారంభించారు. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుని ప్రపోజ్ చేసుకున్నారు. అంతేకాదు, జులై 31వ తేదీన నిశ్చితార్థం కూడా చేసుకున్నారు.

ఇక వీళ్లిద్దరు అధికారికంగా తమ రిలేషన్ షిప్ స్టార్ట్ చేయడానికి పెళ్లి ఒకటే మిగిలి ఉంది. ఈ క్రమంలోనే ఈ జంట తమ రొమాంటిక్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఓన్లీ ఫ్యాన్స్ అనే ఓ వెబ్ సైట్‌లో అకౌంట్ క్రియేట్ చేసి తమ బోల్డ్ ఫోటోలను సైతం షేర్ చేస్తున్నారు. అయితే చాలా మంది నెటిజన్లు చెరిల్‌ని ఉద్దేశిస్తూ ఏంటి మీ బామ్మగారా? అని కెయిన్‌ని ఆటపట్టిస్తున్నారు. దీంతో ఆమెకు పట్టరాని ఏడుపు వస్తుందట. కానీ ప్రియుడు మాత్రం ఆమెను కన్విన్స్ చేస్తూ నువ్వే నా అందాల రాణిని అని చెప్పగానే ఆమె కూల్ అయిపోతుందట.. ఏదేమైనా ప్రేమ మరీ ఇంత గుడ్డిదని తాము ఎప్పుడూ ఊహించలేదని నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.
Published by:Sridhar Reddy
First published: