AGE OF MARRIAGE FOR MEN COULD SOON BE REDUCED TO 18 YEARS BS
పురుషుల పెళ్లి వయసు 18 ఏళ్లు.. కేంద్రం సంచలన నిర్ణయం..!
ప్రతీకాత్మక చిత్రం
మన దేశంలో పెళ్లి చేసుకునే వయసు మహిళలకు, పురుషులకు వేర్వేరుగా ఉంటుంది. పురుషులు 21 ఏళ్లు దాటితే, మహిళలు 18 ఏళ్లు దాటితే పెళ్లి చేసుకోవడానికి అర్హులు. లేకపోతే వీరిని మైనర్లుగానే పరిగణిస్తారు. అయితే.. ఈ వయసు వ్యత్యాసాన్ని సమానంగా చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
మన దేశంలో పెళ్లి చేసుకునే వయసు మహిళలకు, పురుషులకు వేర్వేరుగా ఉంటుంది. పురుషులు 21 ఏళ్లు దాటితే, మహిళలు 18 ఏళ్లు దాటితే పెళ్లి చేసుకోవడానికి అర్హులు. లేకపోతే వీరిని మైనర్లుగానే పరిగణిస్తారు. అయితే.. ఈ వయసు వ్యత్యాసాన్ని సమానంగా చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తు్న్నట్లు సమాచారం. మహిళలతో సమానంగా 18 ఏళ్లు చేయాలన్న ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. బాల్య వివాహ నిషేధ చట్టంలో ఈ సవరణపై ఈ మధ్య నిర్వహించిన వివిధ మంత్రిత్వ శాఖల అంతర్గత సమావేశంలో చర్చించినట్లు సమాచారం. పురుషులు, మహిళల పెళ్లి అర్హత వయసును ఈక్వల్ చేసేందుకు వివిధ వర్గాలతో సంప్రదింపుల ప్రక్రియ ప్రారంభించామని బుధవారం కేంద్రం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. ఈ వ్యాఖ్యలు కూడా పురుషుల వివాహ వయసును కేంద్రం తగ్గిస్తుందన్న వార్తలకు ఊతమిస్తోంది. వాస్తవానికి.. పురుషులు, మహిళల వివాహ వయసు ఒకేలా ఉండాలంటూ బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయ్ ఆగస్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు.
ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు.. పురుషులు, మహిళల పెళ్లి వయసు సమానంగా చేసే దిశగా.. బాల్య వివాహ నిషేధ చట్టానికి సవరణ తెచ్చేందుకు మహిళా శిశు అభివృద్ధి శాఖ సంప్రదింపులు మొదలుపెట్టిందని కోర్టుకు కేంద్రం తరఫు న్యాయవాది తెలిపారు. చట్టాలను మార్చాల్సి ఉన్నందున న్యాయ శాఖను కూడా కక్షిదారుగా చేర్చాలని కోరారు. కాగా, తదుపరి విచారణను ధర్మాసనం వచ్చే ఏడాది ఫిబ్రవరి 19కి వాయిదా వేసింది. పురుషులు వివాహ వయసును 18 ఏళ్లకు కుదించితే.. రాబోయే రెండు, మూడేళ్లలో రికార్డు స్థాయిలో పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.