Home /News /trending /

Child Prodigy: ఈ ఫోటోలో ఉన్న బుడతడు చిచ్చర పిడుగు.. ఓ చిట్టి రోబోతో సమానం ..

Child Prodigy: ఈ ఫోటోలో ఉన్న బుడతడు చిచ్చర పిడుగు.. ఓ చిట్టి రోబోతో సమానం ..

Photo Credit : Face Book

Photo Credit : Face Book

Child Prodigy: సోషల్ మీడియాలో కూడా ఈ పిల్లోడు చిన్న సెలబ్రిటీ అయిపోయాడు. రజనీకాంత్ సినిమాలో చిట్టి రోబో వలే కున్వర్ ప్రతాప్ అన్ని గుర్తుంచుకుంటున్నాడని చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.

సాధారణంగా చదివిన ప్రతీ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలంటే చాలా మెమరీ పవర్ కావాల్సి ఉంటుంది. ఎంత పెద్ద మేధావి అయినా ఒకటో రెండో విషయాలను మరచిపోతుంటారు. కానీ కున్వర్ ప్రతాప్ సింగ్ అనే మూడున్నరేళ్ల బాలుడు మాత్రం చదివిన ప్రతీ విషయాన్ని గుర్తుంచుకోగలడు. ఆ మెమరీ పవర్ తోనే 1 నిమిషంలో 27 స్మారక చిహ్నాలు, 14 ఎక్కాలు పొల్లుపోకుండా చెప్పి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో గ్రాండ్ మాస్టర్ టైటిల్ గెలుచుకున్నాడు. 48 సెకన్లలో 1 నుంచి 30 ఎక్కాలు, భారత రాష్ట్రాల రాజధానుల పేర్లు చెప్పగలిగాడు. 27 పుస్తకాలు 23 నిమిషాలు 48 సెకన్లలో చదివాడు. దాంతో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా తన పేరు లిఖించుకున్నాడు. చైల్డ్ ప్రాడిజీ మ్యాగజైన్‌లో టాప్-100 భారతీయ బాలమేధావులలో ఒకడిగా ఎంపికయ్యాడు కున్వర్.

పంజాబ్ రాష్ట్రం లుధియానాకు చెందిన కున్వర్ ప్రతాప్ సారాభా నగర్‌లోని సేక్రేడ్ హార్ట్ కాన్వెంట్ స్కూల్ లో ఐదవ తరగతి చదువుతున్నాడు. ఎక్స్‌ట్రార్డినరీ మెమరీ గల ఈ బాలుడు ప్రపంచంలోని అన్ని దేశాల రాజధానులను కూడా గుర్తుంచుకోగలడు. అతను 1 నుంచి 40 ఎక్కాలు, ప్రధాన సంఖ్యలు, ప్రతి సంఖ్య గుణకాలు చెప్పగలడు. పుస్తకాలంటే బాగా ఇష్టపడే కున్వర్ పెద్ద పదాలను సైతం అనర్గళంగా చదవగలడు. అలాగే, అనర్గళంగా మాట్లాడగలడు. అత్యంత క్లిష్టమైన పదాలను స్పష్టంగా ఉచ్చరించగలడు. కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగాహారాలు నోటితోనే చేయగలడు. అతని బ్రెయిన్ లో క్యాలిక్యులేటర్ ఫిక్స్ చేసినట్లు శరవేగంగా ఖచ్చితమైన సమాధానాలు చెప్పగలడు. అతని అమోఘమైన జ్ఞాపకశక్తి ని చూసి ప్రతి ఒక్కరూ మంత్రముగ్దులవుతుంటారు.

ఈ బాలమేధావి సంవత్సరం క్రితం మాట్లాడుకున్న మాటలు కూడా తిరిగి చెప్పగలడు. సంవత్సరం క్రితం జరిగిన ప్రతి సంఘటన కూడా ఈ చిన్నోడికి గుర్తుంటుంది. అద్భుతమైన జ్ఞాపకశక్తితో అన్ని విషయాలను గుర్తుంచుకో గల ఈ బాలుడు ప్రస్తుతం వార్తల కెక్కాడు. సోషల్ మీడియాలో కూడా ఈ పిల్లోడు చిన్న సెలబ్రిటీ అయిపోయాడు. రజనీకాంత్ సినిమాలో చిట్టి రోబో వలే కున్వర్ ప్రతాప్ అన్ని గుర్తుంచుకుంటున్నాడని చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. అటువంటి జ్ఞాపకశక్తి తమకు కూడా ఉంటే ఎంత బాగుండు అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.
Published by:Sridhar Reddy
First published:

Tags: Punjab, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు