Home /News /trending /

AFTER SHORT RESIGNATION LETTER HONEST LEAVE APPLICATION GOES VIRAL NETIZENS REACT PAH

వంద మాటల్లేవు.. సుత్తి లేదు.. షార్ట్ అండ్ స్వీట్ గా 3 పదాల్లో రాజీనామా.. వైరల్ అవుతున్న ఫన్నీ రిసిగ్నేషన్..

వైరల్ అవుతున్న ట్వీట్

వైరల్ అవుతున్న ట్వీట్

Viral news: మూడు పదాల్లో రాజీనామా లెటర్ ప్రస్తుతం ఇంటర్నేట్ లో వైరల్ గా మారింది. మొదటి పదంలో.. తన మ్యానెజర్ ని పలకరించిన ఉద్యోగి, రెండో, మూడో పదంలో అతనికి గుడ్ బై కూడా చెప్పేశాడు.

సోషల్ మీడియాలో  (Social media) వైరల్ వార్తలకు కొదువేలేదు. ప్రతి రోజు వేలల్లో వైరల్ వీడియోలు, వైరల్ సంఘటనలు ట్రెండింగ్ లో (Trending news)  ఉంటున్నాయి. ఇక వీటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్యర్యకరం గాను ఉంటాయి. సాధారణంగా తమ చాలా మంది ఉద్యోగం చేస్తుంటారు. కొన్నాళ్లు పోయాక వేరే, కంపెనీలోకి మారుతుంటారు. దీంతో అప్పటి వరకు పనిచేసిన కంపెనీకి రిజైన్ చేసి కొత్త కంపెనీలో చేరిపోతుంటారు.

కొందరు రిజైన్ లేటర్స్ చాలా పెద్దగా ఉంటాయి. ఏదో చాట భారతం అంతా దానిలో రాసేస్తుంటారు. అదే విధంగా, కొంత మంది ఉద్యోగం చేస్తునే మరో మంచి ఉద్యోగం కోసం సెర్చింగ్ లో ఉంటారు. దీనికి ఏదో రిజన్స్ చెప్పిఆఫీస్ ఎగ్గొట్టీ మరీ ఇంటర్వ్యూలు అటెండ్ అవుతారు. కానీ ఇక్కడోక వ్యక్తి మాత్రం జెన్యూన్ గా తాను.. ఇంటర్వ్యూ వెళ్తున్నానని చెప్పి మరీ ఆఫీస్ కు లీవ్ పెట్టాడు. మరీ ఇది నిజంగా ఎక్కడ జరిగిందో తెలియదు. కానీ రెండు ఘటనలు మాత్రం తెగ వైరల్ (Viral news)  అవుతున్నాయి.


ఒక దాంట్లో ఉద్యోగి రాజీనామా తన మ్యానెజర్ కు రాస్తు.. మొదటి పదంలో డియర్ సార్ అని, రెండో దాంట్లో తన రాజీనామా అని చెప్పి, మూడో పదంలో బాయ్.. బాయ్ అని చెప్పి ముగించేస్తాడు.



అదే విధంగా, మరో ఉద్యోగి తాను వేరే కంపెనీలో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్తున్నానని తనకు లీవ్ కావాలని కోరుతూ మ్యానెజర్ కు లీవ్ లేటర్ రాశాడు. ప్రస్తుతం ఈ రెండు ఘటనలు నెట్టింట తెగ వైరల్ గా (Viral news) మారాయి. దీనిని చూసిన నెటిజన్లు షాక్ తో నోరెల్ల బెడుతున్నారు.

ఇదిలా ఉండగా .. మధ్యప్రదేశ్ (Madhya pradesh) మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత ఉమాభారతి (Uma bharti) మరోమారు వార్తలలో నిలిచారు.

ఆమె ఒక మద్యం దుకాణంపై దాడిచేసి వార్తలో నిలిచారు. కాగా, భోపాల్ 330 కిలోమీటర్ల దూరంలో ఉన్నఓర్చాలోని రామరాజ ఆలయానికి ఉమాభారతి వెళ్లారు. అక్కడ ఆలయానికి దగ్గరలో మద్యం దుకాణం ఉండటాన్ని ఆమె గమనించారు. వెంటనే ఆమె ఆగ్రహంతో ఊగిపోయారు.

వెంటనే తన అనుచరులతో కలిసి మద్యం దుకాణం దగ్గరకు వెళ్లారు. పేడ ముద్దలను తీసుకుని, వైన్ షాపుపై విసిరారు. ఆ తర్వాత.. దుకాణం మూసివేయాలని హెచ్చరించారు. అదే విధంగా, తాను రాళ్లను విసరలేదని, కేవలం ఆవు పేడ (Cow Dung At Liquor Shop) మాత్రమే విసిరి నిరసన తెలిపానని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట  (Social media) వైరల్ గా మారింది. కాగా, గతంలోనే ఉమా భారతి ఇలానే మద్యం దుకాణాలపై దాడిచేసి వార్తలలో నిలిచారు. ఇప్పుడు మరోసారి వైన్ షాపై దాడిచేసి ట్రెండింగ్ లో నిలిచారు
Published by:Paresh Inamdar
First published:

Tags: Trending news, VIRAL NEWS

తదుపరి వార్తలు