బనానా ఎఫెక్ట్... కస్టమర్లకు పండ్లను ఫ్రీగా ఇస్తున్న తాజ్ హోటల్స్...

రెండు అరటి పండ్లకు రూ.442 బిల్లు వేసిన జేడబ్ల్యూ మారియట్ హోటల్ వ్యవహారంతో అలర్టైన తాజ్ హోటల్స్... తాము పండ్లను తమ అతిథులకు ఫ్రీగానే ఇస్తున్నామని ప్రకటించింది. దీనిపై ట్విట్టర్‌లో తుఫాను మొదలైంది.

Krishna Kumar N | news18-telugu
Updated: July 27, 2019, 10:18 AM IST
బనానా ఎఫెక్ట్... కస్టమర్లకు పండ్లను ఫ్రీగా ఇస్తున్న తాజ్ హోటల్స్...
Image Credit - Twitter
  • Share this:
ఛండీగఢ్‌లోని జేడబ్ల్యూ మారియట్ హోటల్... బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్‌కి రెండు అరటిపండ్లకు రూ.442 బిల్లు వేసిన విషయం మనకు తెలుసు. ఆ వివాదం చల్లారకముందే... తాజ్ మహల్ హోటల్స్ తమ కస్టమర్లకు తాము పండ్లను ఫ్రీగా ఇస్తున్నామని బోర్డ్ పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది. తాజ్ బోర్డును చాలా మంది నెటిజన్లు ట్విట్టర్‌లో షేర్ చేస్తున్నారు. ఐతే... దీనిపై కూడా నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆ రెండు హోటల్స్‌కీ కంపేర్ ఏంటని కొందరు ప్రశ్నిస్తుంటే... రాహుల్... జిమ్‌లో ఉండి అరటి పండ్లు ఆర్డర్ చేశాడనీ, అందుకే అవి అంత రేటు ఉన్నాయేమో అని మరొకరు కామెంట్ చేశారు. ఇంకొందరు సెటైరికల్‌గా "వాహ్ తాజ్" అనే స్లోగన్ పెడుతున్నారు.


రాహుల్ బోస్... ఈమధ్య ఛండీగఢ్‌లోని హై-ఎండ్ లగ్జరీ హోటల్‌ జేడబ్ల్యూ మారియట్‌కి వెళ్లాడు. జిమ్ చేస్తూ... రెండు అరటిపండ్లకు ఆర్డరిచ్చాడు. వెయిటర్ ఓ ప్లేటులో రెండు అరటిపండ్లు తెచ్చి... బిల్లుతో సహా హోటల్ రూంలో ఉంచాడు. జిమ్ తర్వాత బనానాస్ తిందామని తన రూంలోకి వెళ్లాడు రాహుల్. బిల్లు ఏ ఇరవయ్యో, ముప్పయ్యో ఉంటుందనుకున్నాడు. తీరా చూస్తే.. కళ్లు బైర్లు కమ్మాయి. దిమ్మ తిరిగిపోయింది. ఎందుకంటే బిల్లు రూ.442 ఉంది. అసలు ఎలా స్పందించాలో కూడా అతనికి అర్థం కాలేదు. వాటిని వీడియో తీసి... జులై 22న ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.

అరటి పండ్ల రేటుపై అసహనం వ్యక్తం చేసిన రాహుల్ బోస్... పండ్లు మనకు ప్రమాదం కాదని ఎవరన్నారు? ఈ బిల్లు చూస్తే ఎవరికైనా పండ్లు హానిచేయవని అనిపిస్తుందా? అని నెటిజన్లను అడిగాడు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు కూడా ఆ హోటల్‌పై మండిపడ్డారు. పండ్లపై GST, UTGST ఏంటని ఓ నెటిజన్ ప్రశ్నించగా... ఇదో రుచికరమైన చోరీ అని మరో నెటిజన్ సెటైర్ వేశారు. ఇంకా చాలా మంది రకరకాలుగా స్పందించారు.


ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందన్న జేడబ్ల్యూ మారియట్... త్వరలోనే అధికారిక ప్రకటన రిలీజ్ చేస్తామని తెలిపింది. ఐతే ఈ అంశాన్ని ప్రస్తుతం ఎక్సైజ్ అండ్ టాక్సేషన్ డిపార్ట్‌మెంట్ పరిశీలిస్తోంది. ఇందుకోసం ముగ్గురు సభ్యుల టీమ్‌ని ఏర్పాటు చేసింది. త్వరలో ఈ టీమ్ హోటల్‌కి వెళ్లి ఎంక్వైరీ చెయ్యనుంది.
First published: July 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు