HOME »NEWS »TRENDING »after odisha rare yellow turtle found in west bengal pictures went viral in the internet ms

Yellow Turtle: బెంగాల్ లో అరుదైన పసుపు పచ్చ తాబేలు.. ఫోటోలు వైరల్

Yellow Turtle: బెంగాల్ లో అరుదైన పసుపు పచ్చ తాబేలు.. ఫోటోలు వైరల్
పసుపు వర్ణంలో మెరుస్తున్న తాబేలు

సాధారణంగా తాబేళ్లు నలుపురంగులో ఉంటాయి. సముద్రపు తాబేళ్లలో కొన్ని అరుదైన జాతులున్నా.. అవి కూడా దాదాపు అవే వర్ణంలో ఉంటాయి. కానీ ఈ మధ్య పసుపు వర్ణంతో ఉన్న అరుదైన తాబేళ్లు బయటపడుతున్నాయి.

  • News18
  • Last Updated: October 29, 2020, 15:12 IST
  • Share this:
    ఈ అనంతమైన సృష్టిలో ప్రతీదీ ఒక అద్భుతమే. కొన్ని జంతువులు వింత ఆకారంలో ఉంటే.. మరికొన్ని అవి ఉండాల్సిన రంగు లో కంటే వేరే కలర్ లో ఉంటాయి. సోషల్ మీడియా కాలంలో అవి ఇట్టే ఫేమస్ అవుతున్నాయి. ఇలాంటి వావ్ అనిపించే దృశ్యమే ఇటీవల మరోకటి వెలుగులోకి వచ్చింది. పసుపు పచ్చ వర్ణం ఉన్న ఒక తాబేలు చెరువులోంచి బయటపడి అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. అరుదైన వర్ణంతో మెరిసిపోతున్న ఆ తాబేలు ఇలా బయటపడిందో లేదో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. పశ్చిమ బెంగాల్ లోని బుర్ధ్వాన్ జిల్లాలో ఈ పసుపు పచ్చ తాబేలు బయటపడింది.

    బెంగాల్ లోని బుర్ధ్వాన్ జిల్లాలో స్థానికంగా ఉన్న ఒక చెరువు నుంచి ఇది బయటకు వచ్చింది. పసుపు పచ్చ రంగులో మెరిసిపోతున్న ఈ తాబేలును చూడటానికి అక్కడికి వందలాది మంది గుంపుగూడగా.. సోషల్ మీడియాలో అయితే జనాలకు ఈ తాబేలు పిచ్చపిచ్చగా నచ్చేసింది. చెరువు నుంచి బయటకు వచ్చిన ఈ తాబేలును రక్షించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారమందించారు. దీనిని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ (ఐఎఫ్ఎస్) అధికారి దేబాషిష్ శర్మ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.







    అల్బినో జాతికి చెందిన ఈ తాబేలు.. షెల్ తో పాటు తల, ఇతర భాగాలు కూడా పసుపు రంగులోనే ఉండటం గమనార్హం. అయితే చెరువు నుంచి బయటపడ్డ ఈ తాబేలు శరీరంపై గాయాలయ్యాయని బుర్ద్వాన్ సొసైటీ ఫర్ ఎనిమల్స్ వెల్ఫేర్ సభ్యుడు అర్నబ్ దాస్ అన్నారు. ఇది ఆడ తాబేలు అని ఆయన స్పష్టం చేశారు. దీని వయసు సుమారు సంవత్సరంన్నర దాకా ఉంటుందని ఆయన అన్నారు. ఇది చాలా అరుదైన జాతికి చెందిన తాబేలని.. దీనిని రక్షించి తిరిగి సురక్షిత ప్రాంతానికి చేర్చుతామని ఆయన తెలిపారు.





    కాగా ఈ ఏడాది పసుపు రంగు తాబేలు బయటపడటం ఇది రెండోది. గతంలో ఒడిసాలోని బాలాసోర్ లోనూ కనిపించిన విషయం విదితమే. ఇదిలాఉండగా.. పసుపు వర్ణం తాబేలు ను చూడగానే నెటిజన్లంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
    Published by:Srinivas Munigala
    First published:October 29, 2020, 15:01 IST

    टॉप स्टोरीज