పుషప్స్ చేస్తూ... కొవ్వును కరిగిస్తూ... విరాట్ కోహ్లీ వైరల్ వీడియో...

క్రికెటర్లలో మోస్ట్ ఫిట్‌నెస్ట్ ప్లేయర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ... తాను ఎంతలా వర్కవుట్స్ చేసేదీ వీడియో ద్వారా చూపించాడు. నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది.

news18-telugu
Updated: July 4, 2020, 8:24 AM IST
పుషప్స్ చేస్తూ... కొవ్వును కరిగిస్తూ... విరాట్ కోహ్లీ వైరల్ వీడియో...
పుషప్స్ చేస్తూ... కొవ్వును కరిగిస్తూ... విరాట్ కోహ్లీ వైరల్ వీడియో... (credit - twitter)
  • Share this:
ఆటతోనే కాదు... ఫిట్‌నెస్‌తోనూ ఆకట్టుకుంటున్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. తాజాగా హాప్ పుషప్స్ చేసిన ఓ వీడియోని అభిమానులతో పంచుకున్నాడు. ఈ 31 ఏళ్ల కండల వీరుడు... పుషప్స్ ఎక్సర్‌సైజ్ చేస్తూనే... మధ్యలో ఓ ట్విస్ట్ ఇచ్చాడు. అది చూసి ఫ్యాన్స్ అవక్కయ్యారు. ఇన్‌స్టాగ్రామ్‌లోని తన పోస్టులో... ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాను ట్యాగ్ చేశాడు కోహ్లీ. ఎందుకంటే... ఇలాంటి పుషప్స్ చేస్తూ... వీడియో పోస్ట్ చేసిన మొదటి ఇండియన్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యానే. తన బ్రదర్ క్రునాల్ పాండ్యా తర్వాత హార్ధిక్ ఈ ఫీట్ చేసాడు. తాజాగా జూన్ 3న శుక్రవారం కోహ్లీ... వర్కవుట్ వీడియో పోస్ట్ చేస్తూ... ప్రత్యేక వర్కవుట్ చేసి చూపించాడు. అది తన ఫేవరెట్ అని చెప్పాడు. తాను రోజూ ఏదైనా ఎక్సర్‌సైజ్ చేయాలని అనుకుంటే... అది ఇదే... అని తన ట్విట్టర్ అకౌంట్‌లో తెలిపాడు.


ఇండియన్ క్రికెట్‌లోకి విరాట్ రాకముందు... ప్లేయర్లెవరూ... ఫిట్‌నెస్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టలేదు. 2008లో ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి ఎంటరైన ఈ రైట్ హ్యాండ్లర్... క్రమంగా తాను ఫిట్‌నెట్‌తో ఉండాలనీ... అప్పుడే మూడు ఫార్మాట్లలోనూ ఆటను గెలవగలనని భావించాడు. అప్పటి నుంచి గ్రౌండు పైనే కాదు... బాడీపైనా ఫోకస్ పెట్టాడు. 2017 మధ్య నుంచి ఇండియన్ క్రికెట్‌లో ఫిట్‌నెస్‌కి సంబంధించి యోయో టెస్ట్ తప్పనిసరి అయ్యింది.

ప్రస్తుతం ఇండియన్ క్రికెట్‌లో ప్లేయర్ ఆల్‌రౌండర్ అయినా... యోయో టెస్ట్ పాస్ అవ్వక తప్పదు. అందులో పాస్ అయితేనే జట్టులోకి ఎంపికవుతారు. మహమద్ షమీ, అంబటి రాయుడు వంటి వారు ఫిట్‌నెస్ టెస్ట్ ఫెయిలయ్యారు. చివరి నిమిషంలో జట్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.యోయో విధానం వల్ల ఇండియన్ క్రికెట్‌లోనే కాదు... ఇండియాలోనే ఫిట్‌నెట్ ప్రమాణాలు పెరిగాయి. రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల, హార్ధిక్ పాండ్యా, మనీష్ పాండే, శిఖర్ ధావన, జస్ప్రీత్ బుమ్రా వంటి వారు మంచి ఫిట్‌నెస్ సాధించారు. వెటెరన్ క్రికెటర్లైన ఎంఎస్ ధోనీ, సురేష్ రైనా లాంటి వాళ్లు కూడా ఆటకు తగ్గట్టుగా మంచి ఫిట్‌నెస్ సాధించారు.
Published by: Krishna Kumar N
First published: July 4, 2020, 8:24 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading