Home /News /trending /

AFTER HIJAB NEW ROW IN KARNATAKA OVER CLARENCE HIGH SCHOOLS MANDATORY BIBLE POLICY PAH

OMG: ఇదేం రచ్చరా నాయనా.. కర్ణాటకలో రాజుకున్న మరో వివాదం.. ఆ స్కూల్ లో చదవాలంటే బైబిల్ ను తప్పనిసరి తేవాలని హుకుం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Karnataka: ప్రస్తుతం హిజాబ్ వివాదం దేశంలో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. కర్ణాటకలోని స్కూల్ లో వెలుగు చూపిన ఈ వివాదం (After Hijab)సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఇక తాజాగా, మరోక వివాదం వార్తలలో నిలిచింది.

Karnataka Clarence High  Schools Mandatory Bible Policy: కర్ణాటకలోని బెంగళూరులో ఉన్న క్లారెన్స్ హైస్కూల్ లో విద్యార్థులు..ప్రతి రోజు బైబిల్ ను తీసుకొని పాఠశాలకు వచ్చేలా ఆదేశించిందని హిందూ జనజాగృతి సమితి ఆరోపించింది. ఈ సందర్భంగా, హిందూ జనజాగృతి సమితి రాష్ట్ర ప్రతినిధి గౌడ మాట్లాడుతూ.. సదరు పాఠశాలలో చదివే క్రైస్తవేతర విద్యార్థులను తప్పనిసరిగా బైబిల్‌ను  ( Bible Policy) తీసుకెళ్లి చదవాలని కోరిందని ఆరోపించారు. ఇది రాజ్యాంగంలోని 25, 30 ఆర్టికల్‌లను ఉల్లంఘించినట్లని అన్నారు.

అయితే దీనిపై పాఠశాల యాజమాన్యం తమను తాము సమర్థించుకున్నారు. ఈ నేపథ్యంలో.. క్లారెన్స్ హైస్కూల్ (Clarence High  Schools) ప్రిన్సిపల్ జెర్రీ జార్జ్ మాథ్యూ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. "మా పాఠశాల యొక్క ఒక విధానం గురించి కొంతమంది కలత చెందుతున్నారని మాకు తెలుసు. తాము.. శాంతిని ప్రేమిస్తు, చట్టాన్ని గౌరవిస్తామని అన్నారు. మేము మా న్యాయవాదులను సంప్రదించాము. ఈ విషయంలో వారి సలహాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ వివాదం ప్రస్తుతం  కన్నడ (karnataka) నాట మరో రాజకీయ దుమారానికి తెరదీసింది. దీనిపై.. కర్ణాటక ప్రాథమిక, మాధ్యమిక విద్యాశాఖ మంత్రి బిసి నగేష్ స్పందించారు. ఏ విద్యాసంస్థ కూడా ఒక నిర్దిష్ట మతపరమైన ఆచారాన్ని అనుసరించమని ప్రజలను బలవంతం చేయదని, అలా చేస్తున్న సంస్థలు కనిపిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బిసి నగేష్ అన్నారు. అదే విధంగా, "ఏ సంస్థ కూడా మతపరమైన పాఠ్యపుస్తకాలను బోధించదు. మీకు తెలిసినట్లుగా బైబిల్ ( Bible Policy)  క్రైస్తవ మతం యొక్క మతపరమైన పుస్తకం. తమ విద్యాసంస్థలలో అలాంటివి బోధించలేము.

అది మైనారిటీ సంస్థ అయినా లేదా ఇతర సంస్థల అయినా మతపరమైన ఆచారాలు అనుమతించబడవు" అని మంత్రి బిసి నగేష్ స్పష్టం చేశారు. కాగా, విద్యార్థులను.. మతపరమైన ఆచారాలకు విరుద్ధమైన దానిని ఆచరించమని ఏ సంస్థ ఎవరినీ బలవంతం చేయదు. ఒక వేళ చేస్తే.. డిపార్ట్‌మెంట్ చర్యలు తీసుకుంటుంది" అని కర్ణాటక మంత్రి హెచ్చరించారు. ఈ వివాదంపై.. త్వరలో కర్ణాటక (karnataka Education minister) విద్యాశాఖ మంత్రిని కలిసి ఆందోళన చేస్తామని హిందూ జనజాగృతి సమితి తెలిపింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Hijab, Karnataka, Student

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు