హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Sad News : పుట్టగొడుగుల కూర తిని చనిపోయిన తండ్రి, కొడుకు..

Sad News : పుట్టగొడుగుల కూర తిని చనిపోయిన తండ్రి, కొడుకు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పుట్టగొడుగుల కూర అందరికీ ఇష్టమే. పైగా అది ఆరోగ్యానికి ఎంతో మంచిది. అందుకే ఇప్పుడు ప్రపంచ దేశాల్లో పుట్టగొడుగుల వాడకం బాగా పెరిగింది. అలాంటి సమయంలో అందుకు పూర్తి విరుద్ధమైన వార్త వచ్చింది. ఏం జరిగిందో తెలుసుకుందాం.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  దక్షిణ కర్ణాటకలో విషపూరిత పుట్టగొడుగుల కూర తిని ఓ తండ్రి, కొడుకూ చనిపోయారు. బెల్తాన్‌గాడీ.. పతువేట్ తాలూకా.. పల్లాడపల్కాలో ఈ ఘటన జరిగింది. 80 ఏళ్ల గురువ, ఆయన కొడుకు 41 ఏళ్ల ఒడియప్ప ప్రాణాలు కోల్పోయారు. వారి మృతదేహాల్ని మంగళవారం స్థానికులు చూశారు. గురువకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు ఒడియప్ప కాగా.. చిన్నకొడుకు కర్త. కొన్నాళ్లుగా వీళ్లు తీవ్ర ఆర్థిక సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. నిండా అప్పులు ఉన్నాయి. పేదరికం చుట్టుముట్టింది. ఈ పరిస్థితుల్లో వారు చనిపోవడం స్థానికులకు ఆవేదన కలిగించింది.

  సోమవారం సాయంత్రం ఊరికి దగ్గర్లోని.. అడవిలోకి వెళ్లిన ఒడియప్ప.. అక్కడ కొన్ని పుట్టగొడుగుల్ని చూశాడు. వాటిని వండుకొని తింటే.. ఆ రాత్రి కర్రీగా పనిచేస్తాయని అనుకున్నాడు. వాటిని తీసుకొని ఇంటికి వచ్చాడు. ఈ రాత్రికి మనం మంచి వంట వండుకుందాం.. అంటూ.. పుట్టగొడుగులు వండాడు. ఆ రోజు ఉదయమే సిటీకి వెళ్లిన కర్త.. రాత్రికి ఇంటికి రాలేదు. దాంతో ఒడియప్ప, గురువ ఆ కూరను అన్నంలో కలుపుకొని తిన్నారు. మంగళవారం కర్త.. ఇంటికి వచ్చాడ. ఇంటి ముందు ఒడియప్ప శవమై కనిపించాడు. లోపలికి వెళ్లి చూస్తే.. లోపల పెద్దాయన కూడా చనిపోయి ఉన్నాడు. విషయం తెలిసి ఊరోళ్లు.. పరుగున వచ్చి.. ముక్కన వేలేసుకున్నారు.

  ధర్మస్థల పోలీసులు స్పాట్‌కి వచ్చి.. కేసు రాసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. విషపూరిత పుట్టగొడుగుల కూర తినడం వల్లే చనిపోయారని భావిస్తున్నారు. ఇద్దరి నోటి నుంచి నురగలు బయటకు వచ్చాయని పోలీసులు తెలిపారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాల్సి ఉంది.

  Crime : నిప్పు అంటించుకొని.. అమ్మాయిని కౌగలించుకున్నాడు.. ఎందుకంటే..

  ఒడియప్పకు కొంత మానసిక సమస్యలున్నాయి. అప్పుడప్పుడూ అతను ఇంట్లో గట్టిగా అరుస్తాడు. సోమవారం రాత్రి కూడా అలాగే అరిచినా.. చుట్టుపక్కల వాళ్లు పట్టించుకోలేరు. ఎప్పుడూ ఉండేదేగా అనుకున్నారు. అడవుల్లో దొరికే వాటిని తెలిసీ, తెలియకుండా తినవద్దని పోలీసులు కోరుతున్నారు. మనం చేసే చిన్న తప్పులే ప్రాణాల మీదకు తెస్తాయని సూచిస్తున్నారు. మొత్తంగా ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. చుట్టుపక్కల వాళ్లు.. అయ్యో అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  Published by:Kumar Krishna
  First published:

  Tags: Crime, Karnataka, Trending news