Home /News /trending /

AFTER BEATING ODDS THIS KERALA GIRL TRUMPS SSLC TOO BUT HER HEART BEATS FOR DONORS FAMILY GH PAH

Kerala Girl: ఇంటర్‌లో బెస్ట్ స్కోర్ సాధించిన హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ స్టూడెంట్.. దాత కుటుంబానికి కృతజ్ఞతలు చెప్పిన యువతి

తల్లితో ఆనందాన్ని పంచుకుంటున్న బాలిక

తల్లితో ఆనందాన్ని పంచుకుంటున్న బాలిక

Kerala: తన ప్రాణం నిలవడానికి కారణమైన కుటుంబానికి ఎప్పుడూ రుణపడే ఉంటానని చెబుతోంది కేరళకు చెందిన ఓ యువతి. తనకు చెందిన మంచి విషయం ఏదైనా సరే, దాత కుటుంబంతో పంచుకుంటానని చెబుతోంది 19 ఏళ్ల ఫిను షెరిన్‌.

తన ప్రాణం నిలవడానికి కారణమైన కుటుంబానికి ఎప్పుడూ రుణపడే ఉంటానని చెబుతోంది కేరళకు చెందిన ఓ యువతి. తనకు చెందిన మంచి విషయం ఏదైనా సరే, దాత కుటుంబంతో పంచుకుంటానని చెబుతోంది 19 ఏళ్ల ఫిను షెరిన్‌. మంగళవారం ఇంటర్ ఫలితాల ప్రకటన తర్వాత ఆమె చేసిన మొదటి పని వాయనాడ్‌లోని దివంగత విష్ణు కుటుంబాన్ని పరామర్శించడం. పదో తరగతి ఫలితాలు వెల్లడైనప్పుడు కూడా ఆమె ఆ కుటుంబాన్ని కలిసింది. తన ప్రతి హృదయ స్పందనలో ఆ కుటుంబం ఉంటుందని, తన జీవితానికి వారు చేసిన మేలు మరచిపోలేనని ఫిను షెరిన్‌ చెబుతుంది. ఆమెకు నాలుగేళ్ల క్రితం సర్జరీ చేసి విష్ణు అనే యువకుడి గుండెను అమర్చారు. అప్పటి నుంచి దాత కుటుంబాన్ని ఆమె ఆరాధిస్తూనే ఉంది.

* బాగు చేయలేనంతగా పాడైన గుండె
చక్కలకల్ నివాసి, ఫిను ప్లస్‌టూలో కెమిస్ట్రీ మినహా అన్ని సబ్జెక్టులలో A+ గ్రేడ్‌ సాధించింది. విష్ణు తండ్రి సునీల్, తల్లి బీనా, సోదరి లక్ష్మి తమ ఇంటికి ఫిను షెరిన్‌ రావడంపై ఆనందం వ్యక్తం చేశారు. 2018లో మోటార్‌సైకిల్ ప్రమాదంలో విష్ణు ప్రాణాలు కోల్పోయాడు. అతను రెగ్యులర్‌గా రక్తదానం చేసేవాడని తెలిసింది. విష్ణు ప్రమాదంలో కన్నుమూసిన తర్వాత అతని అవయవాలు దానం చేయాలని కుటుంబం నిర్ణయం తీసుకుంది. అతని కుటుంబం తీసుకున్న నిర్ణయం ఫినుతో సహా ఆరుగురి ప్రాణాలను రక్షించడంలో సహాయపడింది.



ఫిను షెరిన్‌ 9వ తరగతి చదువుతున్నప్పుడు పాఠశాలలో ఉన్నప్పుడు చాలా అలసిపోయినట్లుగా ఫీల్‌ అయ్యేది. ఆ తర్వాత వైద్యులను సంప్రదించడం తో ఆమెకు గుండె జబ్బు ఉన్నట్లు తెలిసింది. కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లడంతో.. అక్కడ కార్డియాలజిస్ట్ పేస్‌మేకర్ ఇంప్లాంటేషన్ చేయాలని సూచించారు. కానీ దానితో కూడా ఫలితం లేదని, ఫిను గుండె కోలుకోలేని విధంగా పాడైపోయిందని, ఆమెకు గుండె మార్పిడి అవసరమని డాక్టర్ వెంటనే గుర్తించారు. గుండె మార్పిడి కోసం ఫినూకు రూ.56 లక్షలు అవసరం. విరాళాలు సేకరించేందుకు చక్కలకల్‌ ప్రజలు ఒక్కతాటిపైకి చేరి సామాజిక కార్యకర్త సలీం మాదవూరు అధ్యక్షతన కమిటీ వేశారు. ఆమె చదువుకుంటున్న పాఠశాల, చక్కలక్కల్ హెచ్‌ఎస్‌ఎస్ మాత్రమే రూ.13 లక్షలు విరాళంగా ఇచ్చింది.

* డాక్టర్ కావాలన్నదే ఆశయం
దీని గురించి సలీం మాట్లాడుతూ.. ‘ఫిను తండ్రి KP సిద్ధీక్. ఆయన ఆటో డ్రైవర్‌గా పనిచేసేవారు. తన కష్టాల గురించి నన్ను సంప్రదించినప్పుడు, మేము ఫినూకి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాం. అందరూ సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. 14 ఏళ్ల చిన్నారికి సరిపోయే గుండెను కొనుగోలు చేయడం ప్రధాన సవాలు. బెంగుళూరులోని నారాయణ హృదయాలయ, కోజికోడ్‌లోని మెట్రోమెడ్ ఇంటర్నేషనల్ కార్డియాక్ సెంటర్‌లో చాలా సేపు నిరీక్షించిన తర్వాత, ఫైనుకి ఎట్టకేలకు విష్ణు(23) అనే దాత దొరికాడు’ అని చెప్పారు.

మెట్రోమెడ్ ఆసుపత్రిలో గుండె మార్పిడి ప్రక్రియ విజయవంతంగా జరిగింది. ఫిను రెండు సంవత్సరాల పాఠశాలకు దూరమైంది. కానీ అదే పాఠశాల నుంచి తొమ్మిది సబ్జెక్టులలో A+ గ్రేడ్‌ సాధించింది. కెమిస్ట్రీలో కేవలం ఒక మార్కుతో A+ గ్రేడ్‌ను కోల్పోవడంపై నిరాశ చెందానని ఫిను చెప్పింది.
చాలా కాలం ఆస్పత్రులలో గడిపానని, వైద్యులు, నర్సులు నన్ను వైద్య వృత్తిని చేపట్టడానికి ప్రేరేపించారని, డాక్టర్ కావాలనేది నా కోరికని ఫిను షెరిన్‌ తెలిపింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Heart, Intermediate, Kerala, Ranker

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు